MoviesMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/aa-crazy-director-remuneration-inkaa-penchaledata7ecf02f1-d3a5-4099-a176-e155f140098e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/aa-crazy-director-remuneration-inkaa-penchaledata7ecf02f1-d3a5-4099-a176-e155f140098e-415x250-IndiaHerald.jpgఒకేఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఘ‌న‌త క‌న్న‌డ డైరెక్ట‌ర్‌ ప్ర‌శాంత్‌నీల్ సొంతం. 2014లో ఉగ్రం అనే సినిమాతో తొలిసారి మెగాఫోన్ ప‌ట్టిన ప్ర‌శాంత్ మొద‌టి ప్ర‌య‌త్నం లోనే ఘ‌న‌విజ‌యం సాధించాడు. ఆ త‌రువాత ఈ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన చిత్రం ‘కేజీఎఫ్’ . కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేప‌థ్యంతో పీరియాడిక‌ల్ ఫిల్మ్ గా క‌న్న‌డ‌ స్టార్ య‌ష్ క‌థానాయ‌కుడిగా రూపొందిన ఈ మూవీ 2018 డిసెంబ‌ర్ 21న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.prashanthneel;india;bollywood;cinema;hollywood;hero;kgf;fidaaఆ క్రేజీ డైరెక్ట‌ర్ రెమ్యూన‌రేష‌న్ ఇంకా పెంచ‌లేద‌ట‌..?ఆ క్రేజీ డైరెక్ట‌ర్ రెమ్యూన‌రేష‌న్ ఇంకా పెంచ‌లేద‌ట‌..?prashanthneel;india;bollywood;cinema;hollywood;hero;kgf;fidaaWed, 26 May 2021 05:00:00 GMTఒకేఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఘ‌న‌త క‌న్న‌డ డైరెక్ట‌ర్‌ ప్ర‌శాంత్‌నీల్ సొంతం. 2014లో ఉగ్రం అనే సినిమాతో తొలిసారి మెగాఫోన్ ప‌ట్టిన ప్ర‌శాంత్ మొద‌టి ప్ర‌య‌త్నం లోనే ఘ‌న‌విజ‌యం సాధించాడు. ఆ త‌రువాత ఈ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన చిత్రం ‘కేజీఎఫ్’ . కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేప‌థ్యంతో పీరియాడిక‌ల్ ఫిల్మ్ గా క‌న్న‌డ‌ స్టార్ య‌ష్ క‌థానాయ‌కుడిగా రూపొందిన ఈ మూవీ 2018 డిసెంబ‌ర్ 21న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా సాధించిన సంచ‌ల‌న‌ విజ‌యం.. హీరో య‌ష్‌ను ద‌క్షిణాది సూప‌ర్‌స్టార్‌ల స‌ర‌స‌న చేర్చింది. ప్ర‌శాంత్‌నీల్ స‌త్తా ఏంటో భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసింది. ఈ ఒక్క‌ సినిమాతో దేశంలోని స్టార్ డైరెక్ట‌ర్‌లలో ఒక‌డిగా ఎదిగిపోయాడు ప్ర‌శాంత్‌నీల్‌. ‘కేజీఎఫ్’ లో హాలీవుడ్ మూవీల‌ను త‌ల‌పించే స్థాయిలో అత‌డు తెరకెక్కించిన భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు.ఆ చిత్రానికి సీక్వెల్‌గా వ‌స్తున్న ‘కేజీఎఫ్ 2’ పై ఇప్పుడు ప్రేక్ష‌కుల్లో ఆకాశాన్నంటే అంచ‌నాలున్నాయి.

ఇప్పుడు సౌత్ ఇండియాలోని స్టార్ హీరోలంద‌రూ ప్ర‌శాంత్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించేందుకు ఉవ్విళ్లూరుతున్నారంటే ఏమాత్రం అతిశ‌యోక్తి కాదు. ప్ర‌స్తుతం బాహుబ‌లితో బాలీవుడ్ హీరోల‌కు పోటీగా మారిన‌ ప్ర‌భాస్ హీరోగా ‘సలార్’ చిత్రాన్నితెర‌కెక్కించే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఆ త‌రువాత తార‌క్ హీరోగా ఓ చిత్రం చేసేందుకు క‌మిట‌య్యాడు. కాగా ఇత‌డి డేట్స్ కోసం ఇప్పుడు నిర్మాత‌లు క్యూ క‌డుతున్నార‌ట‌. దీనికి కార‌ణ‌మేమిటో తెలుసా..?  ప్ర‌శాంత్ రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో ఇంకా నేల‌పైనే ఉన్నాడ‌ట‌. ఇప్పుడు అత‌డికి ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుంటే స్టార్ హీరోల‌తో స‌మానంగా పారితోషికం తీసుకునే అవ‌కాశ‌ముంది. ఇత‌ర ద‌ర్శ‌కులు అలా తీసుకుంటున్నారు కూడా. కాని ప్ర‌శాంత్‌నీల్ మాత్రం త‌న ప్రాజెక్టుల్లో నాణ్య‌త‌పైనే త‌ప్ప త‌న రెమ్యూన‌రేష‌న్ విష‌యంపై  అంత డిమాండ్ చేయ‌క‌పోవ‌డంతో అత‌డి డేట్స్ కోసం ఎదురు చూస్తున్న నిర్మాత‌లు చాలామందే ఉన్న‌ట్టు తెలుస్తోంది. కేజీఎఫ్ -2, స‌లార్ చిత్రాల త‌ర్వాత ప్ర‌శాంత్‌-తార‌క్ కాంబోలో చిత్రం మొద‌లుకానుంది. ఇవ‌న్నీ పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్క‌నున్న‌వే. ఈ చిత్రాల త‌ర్వాత ప్ర‌శాంత్‌నీల్ ద‌ర్శ‌కుడిగా ఏస్థాయికి వెళ‌తాడో వేచిచూడాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి

స్టూడెంట్‌గానే ప్రెగ్నెంట్‌... ఆ సంచ‌ల‌న సినిమాకు 21 ఏళ్లు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>