MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar-2873ac56-eca8-4f79-bc96-832f0a0b78ed-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar-2873ac56-eca8-4f79-bc96-832f0a0b78ed-415x250-IndiaHerald.jpg ‘శ్రీమంతుడు’ మూవీలో మహేష్ ఈ సమాజానికి ఎంతోకొంత చేయకపోతే ‘లావైపోతారు’ అంటూ ఒక ఆలోచనను కలగచేసే మాటను కొరటాల శివ మహేష్ తో చెప్పించాడు. డైలాగ్ చెప్పిన మహేష్ ఈ డైలాగ్ వ్రాసిన కొరటాల మౌనంగా ఉన్నప్పటికీ ఈ డైలాగ్ తో సంబంధంలేని సుకుమార్ తూర్పు గోదావరి జిల్లాలో అనేక ప్రాంతాలలో కోవిడ్ బాదితులకు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.సుకుమార్ కంటే అత్యంత భారీ పారితోషికం తీసుకుంటున్న రాజమౌళి త్రివిక్రమ్ కొరటాల లాంటి దర్శకులు ఇప్పటివరకు కరోనా విలయతాండవం వల్ల దెబ్బతిన్న ప్రజలకు ఏమాత్రsukumar;;mahesh;kumaar;shiva;koratala siva;manu;rajamouli;sukumar;trivikram srinivas;godavari river;sambandam;district;cinema;industry;lord siva;oxygen;rajolu;razoleటాప్ డైరెక్టర్స్ లో ముందడుగు వేసిన సుకుమార్ !టాప్ డైరెక్టర్స్ లో ముందడుగు వేసిన సుకుమార్ !sukumar;;mahesh;kumaar;shiva;koratala siva;manu;rajamouli;sukumar;trivikram srinivas;godavari river;sambandam;district;cinema;industry;lord siva;oxygen;rajolu;razoleWed, 26 May 2021 10:00:00 GMT
‘శ్రీమంతుడు’ మూవీలో మహేష్ ఈ సమాజానికి ఎంతోకొంత చేయకపోతే ‘లావైపోతారు’ అంటూ ఒక ఆలోచనను కలగచేసే మాటను కొరటాల శివ మహేష్ తో చెప్పించాడు. డైలాగ్ చెప్పిన మహేష్ ఈ డైలాగ్ వ్రాసిన కొరటాల మౌనంగా ఉన్నప్పటికీ ఈ డైలాగ్ తో సంబంధంలేని సుకుమార్ తూర్పు గోదావరి జిల్లాలో అనేక ప్రాంతాలలో కోవిడ్ బాదితులకు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.



సుకుమార్ కంటే అత్యంత భారీ పారితోషికం తీసుకుంటున్న రాజమౌళి త్రివిక్రమ్ కొరటాల లాంటి దర్శకులు ఇప్పటివరకు కరోనా విలయతాండవం వల్ల దెబ్బతిన్న ప్రజలకు ఏమాత్రం సేవా స్పూర్తిని కలిగించకపోయినా వీరికన్నా ముందు వరసలో ఇప్పుడు సుకుమార్ ఉన్నాడు. సుమారు నలభై లక్షల వ్యయంతో తూర్పు గోదావరి జిల్లా రాజోలులో ఆక్సిజన్ ప్లాంట్ ను 40 లక్షలతో ప్లాంట్‌ ను సుకుమార్ ఏర్పాటు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.



సుకుమార్ లెక్చరర్ గా కొనసాగుతున్న రోజుల నుండే సుకుమార్ కు తూర్పు గోదావరి జిల్లాతో అవినాభావ సంబంధం ఉంది. గోదావరి అన్నా ఆ చుట్టూ ఉన్న నదీ ప్రాంతం అన్నా అక్కడి మనుషులు అన్నా అభిమానం చూపించే సుకుమార్ తన సినిమాలో వీలైనంత వరకు గోదావరి ప్రాంత సంస్కృతిని చూపించడానికి తపన పడుతూ ఉంటాడు. అంతేకాకుండా కోనసీమలోని కరోనా బాధితులకు ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు ఇప్పటికే అందించాడు.


మొదట్లో 25 లక్షలతో ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించాలనుకున్న సుకుమార్‌ ఏకంగా ఆక్సిజన్‌ ప్లాంట్‌ ను 40 లక్షల ఖర్చుతో నిర్మిస్తున్నాడు. వాస్తవానికి గోదావరి జిల్లాలకు సంబంధించిన అనేకమంది పారిశ్రామిక వేత్తలు ప్రముఖ రాజకీయ నాయకులు సినిమా సెలెబ్రెటీలు ఎందరో ఉన్నారు. వారందరూ తలుచుకుంటే అసలు గోదావరి జిల్లాలలో ఆక్సిజన్ కొరత లేకుండా పోతుంది. ఏది ఏమైనా సుకుమార్ తన సొంత జిల్లా వాసులకు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రశంసలు లభిస్తున్నాయి..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేజ్రీవాల్ బాట‌లో కేసీఆర్ ..! అలా అయితేనే సేఫ్‌

కిషన్ రెడ్డి క్లారిటీ.. ఈటల సీక్రెట్ వెలుగులోకి..

ఓటీటీ స్టార్ట్ చేసే ఆలోచనలో స్టార్ ప్రొడ్యూసర్ .. ?

కృష్ణపట్నంలో 144 సెక్షన్.. అప్పటి దాకా నో ఎంట్రీ!

చిరంజీవి పాత టైటిల్స్‌తో వచ్చిన కొత్త సినిమాలివే..!

యాస్‌ తుఫాన్ : రాష్ట్రాలకు రెడ్ అల‌ర్ట్

ఈట‌ల వ్య‌వ‌హారంలో ట్విస్ట్ .. మ‌ద్ద‌తు కోస‌మేన‌ట‌!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>