PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/seethakka0f03756a-85e6-4d1e-b3d7-6bb5e8c28e6d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/seethakka0f03756a-85e6-4d1e-b3d7-6bb5e8c28e6d-415x250-IndiaHerald.jpgదేశంలో క‌రోనా విజృంభ‌ణ కొనసాగుతుంది. రోజు రోజుకు కేసుల సంఖ్య‌తో పాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా పెరగ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఒక‌ప్పుడు గౌర‌వం ఉన్న‌వాళ్లు, డ‌బ్బు ఉన్న‌వాళ్లు చ‌నిపోతే భారీ సంఖ్య‌లో బంధువులు స్నేహితులు వ‌చ్చేవారు. కానీ ఇప్పుడు ఇన్నోడు చ‌నిపోయినా లేనోడు చ‌నిపోయినా ఆ న‌లుగురే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇక కొంత‌మంది అయితే ఇంట్లో ఎవ‌రైనా పెద్ద‌వాళ్లు చ‌నిపోతే మాకు ఎలాంటి సంబంధం లేదు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాంటి వారి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌seethakka;district;mlaసొంత‌వాళ్లు దూరంగా ఉండ‌టంతో సీత‌క్కే అన్నీ తానై.. !సొంత‌వాళ్లు దూరంగా ఉండ‌టంతో సీత‌క్కే అన్నీ తానై.. !seethakka;district;mlaWed, 26 May 2021 09:46:15 GMTదేశంలో క‌రోనా విజృంభ‌ణ కొనసాగుతుంది. రోజు రోజుకు కేసుల సంఖ్య‌తో పాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా పెరగ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఒక‌ప్పుడు గౌర‌వం ఉన్న‌వాళ్లు, డ‌బ్బు ఉన్న‌వాళ్లు చ‌నిపోతే భారీ సంఖ్య‌లో బంధువులు స్నేహితులు వ‌చ్చేవారు. కానీ ఇప్పుడు ఇన్నోడు చ‌నిపోయినా లేనోడు చ‌నిపోయినా ఆ న‌లుగురే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇక కొంత‌మంది అయితే ఇంట్లో ఎవ‌రైనా పెద్ద‌వాళ్లు చ‌నిపోతే మాకు ఎలాంటి సంబంధం లేదు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాంటి వారి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌లు, మ‌న‌సున్న మ‌హ‌రాజులు ముందుకు వ‌స్తున్నారు. ఇక తాజాగా చ‌నిపోయిన వ్య‌క్తి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు కుంటుంబ స‌భ్యులు వెన‌క‌డుగు వేయ‌డంతో ఎమ్మెల్యే వ‌చ్చి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించింది. ఆ ఎమ్మెల్యే మ‌రెవ‌రో కాదు ములుగు జిల్లా ఎమ్మెల్యే సీత‌క్క‌. ములుగు నియోజ‌క‌వ‌ర్గంలో ఓ వృద్ధుడు క‌రోనాతో మ‌ర‌ణించాడు. అయితే అత‌డి అంత్య క్రియ‌లు నిర్వ‌హించేందుకు కుటుంబ స‌భ్యులు ముందుకు రాలేదు. 

ఈ విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్యే సీత‌క్క త‌న టీం తో క‌లిసి వ‌చ్చి శ‌వానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించింది. పీపీఈ కిట్లు ధ‌రించి సీత‌క్క వెంట వ‌చ్చిన స‌భ్యులు అంత్య‌క్రియ‌లు పూర్తి చేశారు. సీతక్క చేసిన ప‌నికి నెట్టింట ప్ర‌శంలు అందుతున్నాయి. క‌రోనా ప‌రిస్థితుల్లో ఎమ్మెల్యేలు అడ్ర‌స్ లేకుండా పోతే సీతక్క మాత్రం ప్ర‌జ‌ల్లోనే ఉండి స‌హాయ కార్య‌క్రమాలు నిర్వ‌హిస్తోంద‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మాకు కూడా ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే భాగుండేద‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. ఇదిలా ఉండ‌గా సీత‌క్క గ‌త లాక్ డౌన్ స‌మ‌యంలోనూ ఆదివాసీ గిరిజ‌న గూడెం ల‌లో సంచ‌రిస్తూ స‌రుకులు పంపిణీ చేసింది. ఎర్ర‌ని ఎండ‌లో అడ‌విలో న‌డుచుకుంటూ వెళ్లి మ‌రీ వారికి స‌రుకులు అంద‌జేసింది. అంతే కాకుండా ప్ర‌స్తుతం కూడా ప్ర‌తిరోజూ త‌న నియోజ‌క‌వర్గంలో ఆక‌లితో అల‌మ‌టిస్తున్న‌వారికి త‌న టీంతో క‌లిసి ఆహారాన్ని అంద‌జేస్తుంది. దాంతో సీత‌క్క చేస్తున్న స‌హాయ‌కార్య‌క్ర‌మాల‌పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు అందుతున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాప్ డైరెక్టర్స్ లో ముందడుగు వేసిన సుకుమార్ !

కేజ్రీవాల్ బాట‌లో కేసీఆర్ ..! అలా అయితేనే సేఫ్‌

కిషన్ రెడ్డి క్లారిటీ.. ఈటల సీక్రెట్ వెలుగులోకి..

ఓటీటీ స్టార్ట్ చేసే ఆలోచనలో స్టార్ ప్రొడ్యూసర్ .. ?

కృష్ణపట్నంలో 144 సెక్షన్.. అప్పటి దాకా నో ఎంట్రీ!

చిరంజీవి పాత టైటిల్స్‌తో వచ్చిన కొత్త సినిమాలివే..!

యాస్‌ తుఫాన్ : రాష్ట్రాలకు రెడ్ అల‌ర్ట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>