MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/controversies-of-hero-heroine9f7e6b74-8084-4029-8f48-b2958e7fca12-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/controversies-of-hero-heroine9f7e6b74-8084-4029-8f48-b2958e7fca12-415x250-IndiaHerald.jpgలేడి సూపర్ స్టార్ నయనతార గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె లేడి ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను మరింత దగ్గరైంది. తమిళం, తెలుగులో దాదాపు అందరు స్టార్‌ హీరోలతో నటించింది ఈ భామ. లేటెస్ట్‌గా తన స్టైల్ మార్చుకొనే పనిలో పడిందట ఆమె. Controversies-of-hero-heroine;hansika motwani;trisha krishnan;bhama;nayantara;raghava lawrence;sundar;cinema;telugu;rajani kanth;tamil;kanchana;lakshmi devi;success;rashi khannaరూటు మార్చిన లేడి సూపర్ స్టార్..?రూటు మార్చిన లేడి సూపర్ స్టార్..?Controversies-of-hero-heroine;hansika motwani;trisha krishnan;bhama;nayantara;raghava lawrence;sundar;cinema;telugu;rajani kanth;tamil;kanchana;lakshmi devi;success;rashi khannaWed, 26 May 2021 11:00:00 GMTలేడి సూపర్ స్టార్ నయనతార గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె లేడి ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను మరింత దగ్గరైంది. తమిళం, తెలుగులో దాదాపు అందరు స్టార్‌ హీరోలతో నటించింది ఈ భామ. లేటెస్ట్‌గా తన స్టైల్ మార్చుకొనే పనిలో పడిందట ఆమె. తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన సినిమాల సిరీస్ ఏదైనా ఉందంటే.. అది రాఘవ లారెన్స్ రూపొందించిన కాంచన సిరీసే.

ఇక ఈ సిరీస్‌లో వచ్చిన నాలుగు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. హారర్‌ జోనర్‌లో రూపొందే ఈ సినిమా సిరీస్‌లో అద్భుతమైన కామెడీతో పాటు మంచి సందేశం అందించే ప్రయత్నం చేస్తాడు లారెన్స్‌ దీంతో తమిళంలోనే కాదు.. తెలుగులోనూ కాంచన సిరీస్‌కి మంచి క్రేజ్ ఉంది.

అయితే కాంచన అంత కాకపోయినా దర్శకుడు సుందర్.సి రూపొందించే ‘అరణ్మనై’ సిరీస్‌ కూడా మంచి సక్సెస్ సాధించింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు సినిమాలు వచ్చాయి. త్వరలో మూడో సినిమా కూడా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రెండు సినిమాల్లో హన్సిక ఆత్మ పాత్రలో నటించగా.. మొదటి సినిమాలో ఆండ్రియా, లక్ష్మీ రాయ్, రెండో భాగంలో త్రిష హీరోయిన్లుగా చేశారు. ఇక మూడో సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఆండ్రియా ఆత్మగా రాశీ ఖన్నా హీరోయిన్‌గా కనిపించనున్నట్లు టాక్.

ఇక ఈ సినిమా తర్వాత ‘అరణ్మనై-4’ కూడా ప్లాన్ చేస్తున్నరట సుందర్.సి. మూడో సినిమా విడుదల అయిన తర్వాత ఈ సినిమాపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నయనతారను అనుకుంటున్నారట. ఇప్పటికే ఆమెతో దీనిపై చర్చ కూడా జరిపినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా దాదాపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న నయనతార సరైన హిట్ అందుకోలేదు. దీంతో ఇప్పుడు అరణ్మనైకి నయనతారా ఓకే చెబితే మంచి గుర్తింపు వస్తుందని అంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ విషయంలో టీ సర్కార్ కీలక ఆదేశాలు!

హీరోయిన్ అంజలి ని ,ఆమె పిన్ని, బాబాయ్ లు చంపాలని చూశారా..?

మోదీ మైండ్ గేమ్.. బెంగాల్‌లో ఆట షురూ..

కృష్ణ - బాలు వివాదం లో అసలు వాస్తవాలు ఇవే .... ??

బుద్ధ జయంతి శుభాకాంక్షలు, బుద్ధుడు చెప్పిన అత్యంత గొప్ప విషయాలు...!

ప్ర‌శాంత్ నీల్ ఆ ఇండ‌స్ట్రీని మ‌ర్చిపోవాల్సిందేనా ?

టాప్ డైరెక్టర్స్ లో ముందడుగు వేసిన సుకుమార్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>