PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpafdb1211-5da5-4126-a1dd-445c8e62b7f6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpafdb1211-5da5-4126-a1dd-445c8e62b7f6-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఏపీ రాజకీయాలు కులాల ఆధారంగానే నడుస్తాయనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా కమ్మ, రెడ్డి సామాజికవర్గాల మధ్యే ఆధిపత్య పోరు ఎక్కువ నడుస్తుంది. ఎందుకంటే ఈ రెండు వర్గాలే ఇప్పుడు, అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలని నడిపిస్తున్నాయి. ఇక అధికారం కూడా ఈ రెండు వర్గాల మధ్యే ఉంటుంది. టీడీపీలో కమ్మ వర్గం హవా ఎక్కువగా ఉంటే, వైసీపీ రెడ్డి వర్గం డామినేషన్ ఉంటుంది.YSRCP;cbn;nani;kodali nani;shankar;kamma;annabathuni siva kumar;andhra pradesh;government;mla;chirala;ycp;reddy;vinukonda;siva kumar;tenali;vamsiఆ కమ్మ ఎమ్మెల్యేలు వైసీపీలో హైలైట్ అవుతున్నారా?ఆ కమ్మ ఎమ్మెల్యేలు వైసీపీలో హైలైట్ అవుతున్నారా?YSRCP;cbn;nani;kodali nani;shankar;kamma;annabathuni siva kumar;andhra pradesh;government;mla;chirala;ycp;reddy;vinukonda;siva kumar;tenali;vamsiWed, 26 May 2021 04:00:00 GMTసాధారణంగా ఏపీ రాజకీయాలు కులాల ఆధారంగానే నడుస్తాయనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా కమ్మ, రెడ్డి సామాజికవర్గాల మధ్యే ఆధిపత్య పోరు ఎక్కువ నడుస్తుంది. ఎందుకంటే ఈ రెండు వర్గాలే ఇప్పుడు, అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలని నడిపిస్తున్నాయి. ఇక అధికారం కూడా ఈ రెండు వర్గాల మధ్యే ఉంటుంది. టీడీపీలో కమ్మ వర్గం హవా ఎక్కువగా ఉంటే, వైసీపీ రెడ్డి వర్గం డామినేషన్ ఉంటుంది.


అయితే టీడీపీలో రెడ్డి వర్గం నాయకులు, వైసీపీలో కమ్మ సామాజికవర్గం నేతలు ఉన్నారు. కాకపోతే వారు పూర్తి స్థాయిలో హైలైట్ కాలేరు. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున కమ్మ ఎమ్మెల్యేలు బాగానే గెలిచారు. తెనాలి నుంచి అన్నాబత్తుని శివకుమార్, వినుకొండ నుంచి బొల్లా బ్రహ్మనాయుడు, పెదకూరపాడు నుంచి నంబురు శంకర్ రావు, మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్, దెందులూరు నుంచి అబ్బయ్య చౌదరీలు విజయం సాధించారు.


ఇక గుడివాడలో గెలిచిన కొడాలి నాని వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. అటు టీడీపీని వదిలి వైసీపీలోకి వచ్చిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలే. అయితే నాని, వంశీ, కరణంల గురించి పక్కనబెడితే మిగిలిన కమ్మ ఎమ్మెల్యేలు వైసీపీలో పెద్దగా హైలైట్ అయినట్లు కనిపించడం లేదు. మామూలుగా కొడాలి అంటే రాష్ట్రంలో మంచి క్రేజ్ ఉంది. అటు వంశీ, కరణంలకు కూడా రాష్ట్ర స్థాయిలో మంచి ఫాలోయింగ్ ఉంది. 


కానీ మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయిలో పెద్దగా హైలైట్ అయిన సందర్భాలు లేవు. వీరంతా నియోజకవర్గ స్థాయికే పరిమితమైనట్లు తెలుస్తోంది. అలాగే వీరు చంద్రబాబుపై కూడా పెద్ద విమర్శలు చేసిన సందర్భాలు లేవు. ఒకవేళ ఈ కమ్మ ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు చంద్రబాబుని తిడితే, అప్పుడు పరిస్తితి వేరేగా ఉండొచ్చని తెలుస్తోంది. ఏదేమైనా వైసీపీలో కమ్మ ఎమ్మెల్యేలు హైలైట్ అవ్వడం తక్కువే.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ క్రేజీ డైరెక్ట‌ర్ రెమ్యూన‌రేష‌న్ ఇంకా పెంచ‌లేద‌ట‌..?

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>