ముగిసిన చంద్రగ్రహణం: సూపర్ బ్లడ్ మూన్‌గా, భారీ పరిమాణంలో దర్శనం(వీడియో)

National

oi-Rajashekhar Garrepally

|

న్యూఢిల్లీ: బుధవారం సంభవించిన చంద్రగ్రహణం ముగిసింది. యూటీసీ (సార్వత్రిక సమన్వయ సమయం) ప్రకారం ఉదయం 11.11 గంటలకు, భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4.41కి చంద్రగ్రహణం ప్రారంభమైంది. అయితే, ఈ మొత్తం చంద్రగ్రహణం భారతదేశంలో అంతగా కనిపించలేదు.

ఈ చంద్రగ్రహణం బుధవారం రాత్రి 7.19 గంటలకు ముగిసింది. ఈరోజు సంభవించిన గ్రహణాన్ని సూపర్ బ్లడ్ మూన్‌గా పిలవడం జరిగింది. భూమికి చాలా దగ్గరగా రావడంతో చంద్రుడు పరిమాణంలో భారీగా కనిపించాడు. రెడిష్ ఆరెంజ్ కలర్‌లో చంద్రుడు దర్శనమిచ్చాడు. జనవరి 2019 తర్వాత సంభవించిన తొలి సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే కావడం గమనార్హం.

 Total lunar eclipse is over, check out images of Super Blood Moon

పశ్చిమాసియా ప్రాంతంలో ఆస్ట్రేలియా, కెనడా, అమెరికాలో పలు ప్రాంతాలు, మెక్సికో, హవాయ్, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, పసిఫిక్ మహా సముద్రం, తదితర ప్రాంతాల వారు చంద్ర గ్రహణాన్ని వీక్షించారు. భారత్ లో అయితే కొన్ని ప్రాంతాల్లోనే చంద్రగ్రహణం కనిపిస్తుంది. సూపర్ బ్లడ్ మూన్, చంద్రగ్రహణం కొంత సమయం మాత్రమే కనిపిస్తుంది. సిక్కిం మినహా ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్, ఒడిశా, అండమాన్, నికోబార్ దీవుల ప్రాంతాలవారు చంద్రగ్రహణం విడిచే సమయాన్ని వీక్షించారు.

కాగా, ఈ ఏడాదిలో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. మొదటిది మే 26న సంభవించింది. రెండోది మరో ఆరు నెలల తర్వాత నవంబర్ 19న ఏర్పడనుంది. జూన్ 10న తొలి సూర్య గ్రహణం, డిసెంబర్ 4వ తేదీన రెండో సూర్య గ్రహణం ఏర్పడనుంది.

English summary

The lunar eclipse is now over. The full eclipse began at 11.11 am UTC, which was around 4.41 pm IST. But the total lunar eclipse was not visible in India. The total lunar event will last till 7.19 pm IST.

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *