PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/corona56147e37-9abb-4b4b-9aeb-e3fea940867d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/corona56147e37-9abb-4b4b-9aeb-e3fea940867d-415x250-IndiaHerald.jpgఅన్నాడీఎంకేపై ఆధిపత్యం కోసం పోరు జ‌రుగుతోంది. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక పోరు.. అధికారంలో లేన‌ప్పుడు మ‌రో పోరు.. ఏదేమైన‌ప్ప‌టికీ క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరైన అన్నాడీఎంకేలో జ‌య‌ల‌లిత లేని లోటు స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పరాజయం అనంతరం.. పార్టీని హస్తగతం చేసేకునేందుకు ప‌న్నీర్ సెల్వం, ప‌ళ‌నిస్వామి వ్యూహాలు ర‌చించారు. అయితే ఇతర నేతలు అందుకు సంసిద్ధత కనబరచకపోవడంతో ప్రస్తుతానికి ఆ పనికి ఫుల్‌స్టాప్‌ పెట్టిన వీరిద్ద‌రూ అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత పదవి కోసcorona;cm;chief minister;assembly;chennai;partyఅన్నాడీఎంకేలో ఆధిప‌త్య పోరు?అన్నాడీఎంకేలో ఆధిప‌త్య పోరు?corona;cm;chief minister;assembly;chennai;partyWed, 26 May 2021 16:01:34 GMT
అన్నాడీఎంకేపై ఆధిపత్యం కోసం పోరు జ‌రుగుతోంది. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక పోరు.. అధికారంలో లేన‌ప్పుడు మ‌రో పోరు.. ఏదేమైన‌ప్ప‌టికీ క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరైన అన్నాడీఎంకేలో జ‌య‌ల‌లిత లేని లోటు స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పరాజయం అనంతరం.. పార్టీని హస్తగతం చేసేకునేందుకు ప‌న్నీర్ సెల్వం, ప‌ళ‌నిస్వామి  వ్యూహాలు ర‌చించారు. అయితే ఇతర నేతలు అందుకు సంసిద్ధత కనబరచకపోవడంతో ప్రస్తుతానికి ఆ పనికి ఫుల్‌స్టాప్‌ పెట్టిన వీరిద్ద‌రూ అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. ఆఖరికి ఈపీఎస్‌దే పైచేయి అయింది. పదవి ఆయన్నే వరించింది. పార్టీలోని నేతల్లో అత్యధికులు ఈపీఎస్‌ వైపు మొగ్గుచూపడం, తనకు అంతంతమాత్రంగానే మద్దతు రావడంతో ఓపీఎస్‌ వెనక్కి తగ్గారు.

ముభావంగా ఉంటున్న ఓపీఎస్‌?
శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా ప‌ళ‌నిస్వామి ఎంపికైన‌ప్ప‌టి నుంచి ప‌న్నీర్ సెల్వం ముభావంగా ఉంటున్నారు. పార్టీకి సంబంధించిన పలు అధికారిక ప్రకటనల్లో గతంలో సమన్వయకర్తగా వున్న ఓపీఎస్‌, ఉప సమన్వయకర్తగా వున్న ఈపీఎస్‌ సంతకం పెట్టేవారు. కానీ ఇటీవలి కాలంలో అన్నాడీఎంకే అధికారిక ప్రకటనలు వేర్వేరుగా వస్తుండడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈనెల 7వ తేదీ నుంచే ఇద్దరు నేతల ప్రకటనలు వేర్వేరుగా వెలువడుతున్నాయి. ఆ క్రమంలో, చెన్నై కార్పొరేషన్‌లో కొవిడ్‌-19 ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ వ్యవహారంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ జోక్యం చేసుకోవాలని ఓపీఎస్‌ ఓ ప్రకటనలో కోరారు. ఆ ప్రకటన విడుదలైన కొద్ది గంటల్లో చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌సింగ్‌, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ను తొలగించే ఆలోచన లేదని స్పష్టం చేస్తూ ప్రకటన జారీచేశారు. తన కోర్కెను మన్నించిన సీఎంకు ఓపీఎస్‌ కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో, అసంఘటిత కార్మికులను ఆదుకోవాలని, కడలూరు ప్రభుత్వాస్పత్రిలో అవినీతికి పాల్పడుతున్న వైద్యసిబ్బందిపై చర్యలు చేపట్టాలని ఎడప్పాడి పళనిస్వామి కోరారు. ఈ ఇద్ద‌రి నేతల వైఖరి పార్టీ కార్యకర్తలతో పాటు నేతలనూ అయోమయానికి గురి చేస్తోంది. ఈ వ్యవహారం ఎటు నుంచి ఎటువైపు దారి తీస్తుందోనని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెల రాజేంద్ర దారెటు...?

నందమూరి బ్రదర్స్ సక్సెస్ వెనుక ఉన్నవారు వీళ్లే..

చావు బతుకుల్లో ప్రముఖ సీరియల్ నటి.. ఏకంగా అన్ని సర్జరీలు..?

చిన్మయి కెరీర్‌ను నాశనం చేసిన మీటూ వివాదం.. కెరీర్ పూర్తిగా నాశనం..!!

సౌత్ లో టాప్ 5 సినిమా టీజర్స్ ఇవే ..

ఆర్జీవీ - అల్లు అరవింద్ వివాదం అప్పట్లో హాట్ టాపిక్ ... ?

శ‌ర‌త్‌బాబు, ర‌మాప్ర‌భ గొడ‌వ‌కు అస‌లు కార‌ణ‌మిదే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>