MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/controversies-of-hero-heroine1542e21f-6ecc-4c1e-8b29-b8bdb6052bbb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/controversies-of-hero-heroine1542e21f-6ecc-4c1e-8b29-b8bdb6052bbb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా సినిమాలు బాహుబలి, బాహుబలి 2. అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో ఒకటైన శివగామి పాత్రని రమ్యకృష్ణ పోషించగా, మరొక పాత్రైన కట్టప్ప రోల్ ని సత్యరాజ్ పోషించిన విషయం తెలిసిందే. భారీ యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్స్ గా తెరకెక్కిన ఈ రెండు సినిమాలు ఒకదానిని మించేలా మరొకటి ఎంతటి గొప్ప విజయాలు అందుకున్నాయో మనకు తెలిసిందే. Controversies-of-hero-heroine;prabhas;anoushka;sridevi kapoor;nayana harshita;ramya krishnan;rajamouli;sathyaraj;tamannaah bhatia;india;tollywood;cinema;rajani kanth;bahubali;hindi;heroine;nijam;anandamశ్రీదేవి, రాజమౌళి వివాదంలో ... అసలు వాస్తవాలు ఇవే .... ??శ్రీదేవి, రాజమౌళి వివాదంలో ... అసలు వాస్తవాలు ఇవే .... ??Controversies-of-hero-heroine;prabhas;anoushka;sridevi kapoor;nayana harshita;ramya krishnan;rajamouli;sathyaraj;tamannaah bhatia;india;tollywood;cinema;rajani kanth;bahubali;hindi;heroine;nijam;anandamWed, 26 May 2021 19:42:31 GMTటాలీవుడ్ దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా సినిమాలు బాహుబలి, బాహుబలి 2. అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో ఒకటైన శివగామి పాత్రని రమ్యకృష్ణ పోషించగా, మరొక పాత్రైన కట్టప్ప రోల్ ని సత్యరాజ్ పోషించిన విషయం తెలిసిందే. భారీ యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్స్ గా తెరకెక్కిన ఈ రెండు సినిమాలు ఒకదానిని మించేలా మరొకటి ఎంతటి గొప్ప విజయాలు అందుకున్నాయో మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమాలోని శివగామి పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి ని తీసుకోవాలని భావించారు రాజమౌళి. అయితే ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూ లో భాగంగా వెల్లడించిన రాజమౌళి, వాస్తవానికి మొదట శివగామి పాత్ర కోసం రమ్యకృష్ణ నే తీసుకుందాం అని అనుకున్నప్పటికీ, మరొక పెద్ద స్టార్ నటి అయితే తమ సినిమాకు కొంత హెల్ప్ అవుతారని భావించి శ్రీదేవి గారిని అడిగాం అని, అయితే ఆమె భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో పాటు ఫైవ్ స్టార్ హోటల్ లో ఏకంగా ఫ్లోర్ బుక్ చేయమనడంతో పాటు, హిందీ రైట్స్ లో కొంత పర్సెంటేజ్, అలానే మరికొన్ని లగ్జరీ కోరికలు కోరారని అన్నారు. కాగా ఈ విషయమై శ్రీదేవి పై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఒకింత దుమారాన్నే రేపాయి.

ఆపై కొన్నాళ్ల అనంతరం ఒక ఇంటర్వ్యూ లో భాగంగా బాహుబలి మూవీ విషయమై రాజమౌళి వ్యాఖ్యలను ప్రస్తావించిన శ్రీదేవి, నిజంగా తాను ఆయన చెప్తున్నట్లుగా భారీ రెమ్యునరేషన్, పలు రకాల లగ్జరి హంగులు, సూట్ రూమ్ లు డిమాండ్ చేసి ఉంటె తనకు ఇన్ని సినిమాల అవకాశాలు వచ్చేవి కాదని, అలా డిమాండ్ చేస్తే ఎందరో దర్శక, నిర్మాతలు నన్ను దాదాపుగా మూడు వందల సినిమాల్లో హీరోయిన్ గా ఎలా తీసుకునేవారని అన్నారు. కాగా శివగామి పాత్ర కోసం నిర్మాతలు తనను సంప్రదించింది నిజమే అని, అయితే అప్పట్లో కొన్ని కారణాల వలన తాను చేయలేకపోయానని, ఇక విడుదల తరువాత ఆ సిరీస్ లోని రెండు సినిమాలు ఎంతో గొప్ప విజయాలు అందుకోవడం తనకు ఆనందంగా ఉందని అన్నారు శ్రీదేవి. ఇక అప్పట్లో ఈ వివాదం ఎంతో వైరల్ అయింది..... !!  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ రాష్ట్రాల్లో బాగా వృధా అవుతున్న కరోనా వ్యాక్సిన్లు...

బ్యాంకులతో ఏపీ సర్కార్ చర్చలు... ప్రజలకు గుడ్ న్యూస్ చెప్తారా...?

వివాదాల వ‌ల్లే ఒక‌ప్ప‌టి స్టార్ డైరెక్ట‌ర్ డీలా ప‌డ్డారా..?

సూపర్ స్టార్ మనసు వెన్న.. మరోసారి బయటపడ్డ మంచితనం..

మహేష్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు ఏవో తెలుసా..?

తాగి తీర్పు చెప్పిన నటి.. పోలీస్ స్టేషన్ లో భార్య ఫిర్యాదు. అసలేం జరిగింది.. ?

ఈ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>