PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/karanam-balaram4e1d059f-9c0e-4ce4-aacc-629569543f95-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/karanam-balaram4e1d059f-9c0e-4ce4-aacc-629569543f95-415x250-IndiaHerald.jpgకరణం బలరాం...దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న నాయకుడు. ఎన్నో ఏళ్ళు టీడీపీలో సేవలు చేసిన కరణం...ఇప్పుడు వైసీపీలో పనిచేస్తున్నారు. కరణం ఎమ్మెల్యేగా ఉంటే, ఆయన తనయుడు కరణం వెంకటేష్ వైసీపీ నాయకుడుగా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. అయితే భవిష్యత్‌లో తన తనయుడుని ఎమ్మెల్యేని చేయాలని కరణం చూస్తున్నారు. 2014లోనే కరణం వారసుడుకు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ దక్కింది.karanam balaram;venkatesh;jagan;karanam balarama krishna murthy;2019;k s ravikumar;mla;tdp;karanam balaram krishna murthy;chirala;ycp;gottipati ravi kumar;karanam venkatesh;addanki;varasudu;racchaకరణం వారసుడుకు ఛాన్స్ ఉంటుందా?కరణం వారసుడుకు ఛాన్స్ ఉంటుందా?karanam balaram;venkatesh;jagan;karanam balarama krishna murthy;2019;k s ravikumar;mla;tdp;karanam balaram krishna murthy;chirala;ycp;gottipati ravi kumar;karanam venkatesh;addanki;varasudu;racchaWed, 26 May 2021 11:00:00 GMTకరణం బలరాం...దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న నాయకుడు. ఎన్నో ఏళ్ళు టీడీపీలో సేవలు చేసిన కరణం...ఇప్పుడు వైసీపీలో పనిచేస్తున్నారు. కరణం ఎమ్మెల్యేగా ఉంటే, ఆయన తనయుడు కరణం వెంకటేష్ వైసీపీ నాయకుడుగా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు.  అయితే భవిష్యత్‌లో తన తనయుడుని ఎమ్మెల్యేని చేయాలని కరణం చూస్తున్నారు. 2014లోనే కరణం వారసుడుకు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ దక్కింది.


టీడీపీ తరుపున అద్దంకి నియోజకవర్గం నుంచి పోటీ చేసి వెంకటేష్ ఓటమి పాలయ్యారు. అప్పుడు వైసీపీ తరుపున పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించారు. అయితే తర్వాత గొట్టిపాటి టీడీపీలోకి వచ్చేయడంతో అసలు సమస్య మొదలైంది. ఒకే పార్టీలో ఉన్నా సరే  కరణం, గొట్టిపాటిలకు సరిగ్గా పడేది కాదు. వీరి మధ్య చాలాసార్లు రచ్చ జరిగింది. పలుసార్లు చంద్రబాబు, వీరి పంచాయితీని పరిష్కరించడానికి చూశారుగానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.


చివరికి కరణం బలరాంకు 2019 ఎన్నికల్లో చీరాల టిక్కెట్ ఇచ్చారు. ఇటు అద్దంకిలో గొట్టిపాటి పోటీ చేశారు. జగన్ వేవ్ ఉన్నా సరే ఈ ఇద్దరు టీడీపీ తరుపున గెలిచారు. ఇక మధ్యలో కరణం, తన కుమారుడుతో కలిసి వైసీపీ వైపుకు వెళ్లారు. ఇలా వైసీపీలోకి వెళ్ళాక చీరాలలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో విభేదాలు మొదలయ్యాయి. గత కొంతకాలంగా కరణం, ఆమంచి వర్గాల మధ్య రచ్చ జరుగుతూనే ఉంది.


అదే సమయంలో అద్దంకి నియోజకవర్గంలో కరణం వర్గం హడావిడి ఉంటూనే ఉంది. దీంతో అక్కడ ఉండే వైసీపీ ఇన్‌చార్జ్ బాచిన చైతన్యతో, కరణం వర్గానికి పడటం లేదు. ఇలా రెండుచోట్ల కరణం వర్గం విభేదాలు పెట్టుకుని ముందుకు నడుస్తుంది. అయితే వచ్చే ఎన్నికల్లో కరణం పరిస్తితి పక్కనబెడితే, ఆయన వారసుడుకి టిక్కెట్ దొరుకుతుందా లేదా అనేది తెలియడం లేదు. కాకపోతే ప్రకాశం జిల్లాలో కరణంకు బలం బాగానే ఉంది. కాబట్టి జగన్, కరణం ఫ్యామిలీని పక్కనబెట్టడం అయితే జరగదు. మరి చూడాలి నెక్స్ట్ కరణం వారసుడుకు ఛాన్స్ ఉంటుందేమో.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ విషయంలో టీ సర్కార్ కీలక ఆదేశాలు!

హీరోయిన్ అంజలి ని ,ఆమె పిన్ని, బాబాయ్ లు చంపాలని చూశారా..?

మోదీ మైండ్ గేమ్.. బెంగాల్‌లో ఆట షురూ..

కృష్ణ - బాలు వివాదం లో అసలు వాస్తవాలు ఇవే .... ??

రూటు మార్చిన లేడి సూపర్ స్టార్..?

బుద్ధ జయంతి శుభాకాంక్షలు, బుద్ధుడు చెప్పిన అత్యంత గొప్ప విషయాలు...!

ప్ర‌శాంత్ నీల్ ఆ ఇండ‌స్ట్రీని మ‌ర్చిపోవాల్సిందేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>