MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/controversies-of-hero-heroine92c4cc90-68c3-4ce4-a420-37c7ea30e173-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/controversies-of-hero-heroine92c4cc90-68c3-4ce4-a420-37c7ea30e173-415x250-IndiaHerald.jpgసినీ పరిశ్రమ అంటేనే ఎన్నో వివాదాలు ఉంటాయి. అందులోనూ బాలీవుడ్ వంటి భారీ ఇండస్ట్రీలో వివాదాలకు కొదవ ఉండదు. వివాదాలకు దూరం పాటిస్తూ ఎటువంటి అనవసరపు మాటలు మాట్లాడని వారైనా ఈ ఊబిలో పడాల్సిందే. తమ కెరీర్‌లో ఒక్కసారైనా ఎదోఒక వివాదంలో చిక్కుకుని ప్రజల నోళ్లలో నానాల్సిందే. అలా చిక్కుకున్న నటుల్లో బాలీవుడ్ కండల వీరుడు హృతిక్..Controversies-of-hero-heroine;hrithik roshan;kangana ranaut;prema;roshan;mumbai;bollywood;industries;police;marriage;love;film industry;interview;hero;chatting;local language;nijamహృతిక్-కంగనా వివాదం ఎంత ముదిరిందో తెలుసా..?హృతిక్-కంగనా వివాదం ఎంత ముదిరిందో తెలుసా..?Controversies-of-hero-heroine;hrithik roshan;kangana ranaut;prema;roshan;mumbai;bollywood;industries;police;marriage;love;film industry;interview;hero;chatting;local language;nijamWed, 26 May 2021 11:05:00 GMTసినీ పరిశ్రమ అంటేనే ఎన్నో వివాదాలు ఉంటాయి. అందులోనూ బాలీవుడ్ వంటి భారీ ఇండస్ట్రీలో వివాదాలకు కొదవ ఉండదు. వివాదాలకు దూరం పాటిస్తూ ఎటువంటి అనవసరపు మాటలు మాట్లాడని వారైనా ఈ ఊబిలో పడాల్సిందే. తమ కెరీర్‌లో ఒక్కసారైనా ఎదోఒక వివాదంలో చిక్కుకుని ప్రజల నోళ్లలో నానాల్సిందే. అలా చిక్కుకున్న నటుల్లో బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కూడా ఒకడు. అగ్ర కథానాయకుడైనప్పటికీ ఓ వివాదంలో చిక్కుకొని గత కొన్ని సంవత్సరాలుగా బయటపడలేక పోతున్నాడు. తన గురించి వచ్చిన అపవాదును తొలగించుకునేందుకు హృతిక్ 2016 నుంచి పోరాడుతున్నాడు.


అయితే బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్, బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ మధ్య మొదలైన ఓ చిన్ని తగాదా పెద్ద వివాదంగా మారింది. 2016లో మొదలైన  ఈ తంతు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 2016లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా తనకు, హృతిక్‌కు మధ్య ప్రేమ బంధం ఉందని, తామిద్దరూ ఎన్నో సార్లు షికారుకు వెళ్లామని చెప్పింది. ఆ మాటలకు షాకయిన హృతిక్ స్పందిస్తూ అవన్ని అసత్యాలని, తనకు కంగనాకు ఎటువంటి సంబంధం లేదని, కేవలం నటీనటులుగా మాత్రం పరిచయం అని అన్నాడు. అయినా కంగనా తన తీరు మార్చుకోకుండా తామిద్దరూ చాటింగ్ చేసుకున్నామని, వాటికి రుజువులు కూడా ఉన్నాయని అనడంతో హృతిక్ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు.

 

అయితే అప్పుడు మొదలైన ఈ వివాదం ఇప్పటికీ చల్లారలేదు. ఇటీవల వీరిద్దరిని ముంబై క్రైం బ్రాంచ్ విచారణకు పిలిచింది. ఈ విచారణలో భాగంగా వీరిద్దరి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. అయితే హృతిక్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా కంగనా ఏమాత్రం పట్టించుకోకుండా ‘నా బాయ్ ఫ్రండ్ అంతే.. చాలా సిల్లీ’ అంటూ కామెంట్ చేసింది. దాంతో హృతిక్ కోపం నషాళానికి తాకింది. దాంతో ఈ కేసును హృతిక్ మరింత సీరియస్‌గా తీసుకున్నాడు. అయితే వారిద్దరి మధ్య నిజంగా ప్రేమ ఉందని, వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరు విడిపోయారని కూడా వార్తలు అనేకం వస్తున్నాయి. వీటిలో ఏది నిజమనేది తెలియాల్సి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ విషయంలో టీ సర్కార్ కీలక ఆదేశాలు!

హీరోయిన్ అంజలి ని ,ఆమె పిన్ని, బాబాయ్ లు చంపాలని చూశారా..?

మోదీ మైండ్ గేమ్.. బెంగాల్‌లో ఆట షురూ..

కృష్ణ - బాలు వివాదం లో అసలు వాస్తవాలు ఇవే .... ??

రూటు మార్చిన లేడి సూపర్ స్టార్..?

బుద్ధ జయంతి శుభాకాంక్షలు, బుద్ధుడు చెప్పిన అత్యంత గొప్ప విషయాలు...!

ప్ర‌శాంత్ నీల్ ఆ ఇండ‌స్ట్రీని మ‌ర్చిపోవాల్సిందేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>