PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/corona-bengal-mamatha-modi-upa393151f-1af4-43c2-bf67-6505a0080751-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/corona-bengal-mamatha-modi-upa393151f-1af4-43c2-bf67-6505a0080751-415x250-IndiaHerald.jpgప‌శ్చిమ‌బెంగాల్ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌నే త‌ప‌న‌తో కోట్ల మంది ప్ర‌జ‌ల ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టారంటూ కేంద్ర ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రెండోద‌శ ఉధృతి గురించి తాము ముందుగానే హెచ్చ‌రించామంటూ ఎయిమ్స్, ఐఐటీ నిపుణులు కూడా ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. అయినా వీట‌న్నింటినీ ప‌క్క‌న‌పెట్టిన కేంద్రం బెంగాల్‌పైనే దృష్టిసారించింది. ప‌ర్య‌వ‌సాన‌మే.. దేశంలో ఇప్పుడు నెల‌కొన్న దుస్థితి. శ్వాస ఆడ‌క ప్రాణాలు ఉంటాయో? ఉండ‌వో? తెలియ‌ని సందిగ్ధ‌స్థితి.. ఆసుప‌త్రుల్లో బెడ్ల కొర‌త‌.. విదేశాల‌కcorona, bengal, mamatha, modi, up;modi;bharatiya janata party;west bengal - kolkata;chief minister;assembly;mla;uttar pradesh;central government;mantraబెంగాల్ కోసం క‌రోనాను పెంచారు.. యూపీ కోసం త‌గ్గిస్తారా?బెంగాల్ కోసం క‌రోనాను పెంచారు.. యూపీ కోసం త‌గ్గిస్తారా?corona, bengal, mamatha, modi, up;modi;bharatiya janata party;west bengal - kolkata;chief minister;assembly;mla;uttar pradesh;central government;mantraWed, 26 May 2021 10:45:32 GMTప‌శ్చిమ‌బెంగాల్ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌నే త‌ప‌న‌తో కోట్ల మంది ప్ర‌జ‌ల ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టారంటూ కేంద్ర ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రెండోద‌శ ఉధృతి గురించి తాము ముందుగానే హెచ్చ‌రించామంటూ ఎయిమ్స్, ఐఐటీ నిపుణులు కూడా ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. అయినా వీట‌న్నింటినీ ప‌క్క‌న‌పెట్టిన కేంద్రం బెంగాల్‌పైనే దృష్టిసారించింది. ప‌ర్య‌వ‌సాన‌మే.. దేశంలో ఇప్పుడు నెల‌కొన్న దుస్థితి. శ్వాస ఆడ‌క ప్రాణాలు ఉంటాయో? ఉండ‌వో?  తెలియ‌ని సందిగ్ధ‌స్థితి.. ఆసుప‌త్రుల్లో బెడ్ల కొర‌త‌.. విదేశాల‌కు ఎగ‌మ‌త‌వుతోన్న టీకాలు.. దిగ‌జారిన ప్ర‌జ‌ల ఆర్థిక స్థితిగ‌తులు.. ఈ ప‌రిస్థితి నుంచి ఎప్పుడు బ‌య‌ట ప‌డ‌తామో తెలియ‌ని అయోమ‌యం.. అయినా స‌రే ఎక్క‌డా త‌గ్గేదేలేదు అంటోంది కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తాపార్టీ. అందుకు నిద‌ర్శ‌న‌మే ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌ర్వాత కూడా మంత్రులు, ఎమ్మెల్యే అరెస్ట్‌. త్వ‌ర‌లోనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీకి ఎన్నిక‌లు రాబోతున్నాయి. బెంగాల్ కోసం క‌రోనాను పెంచారు.. ఇప్పుడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వ‌డానికి క‌రోనా త‌గ్గించి చూపుతారా? అంటూ ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నారు. ష‌రామాములుగానే కేంద్ర ప్ర‌భుత్వం నుంచి మౌన‌మే స‌మాధాన‌మ‌వుతోంది.

అత్యంత భీక‌రంగా యూపీ ఎన్నిక‌లు?
కరోనా కొద్దిగా తగ్గుముఖం పట్టిన వెంటనే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అగ్రనేతలు పూర్తిగా ఉత్తరప్రదేశ్‌లో తమ బలాలను మోహరించడం ఖాయం. మ‌రో తొమ్మిది నెలల్లో యూపీకి అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 2024 ఎన్నిక‌ల‌కు ముందు మోడీ యూపీ ఎన్నిక‌ల‌కు సెమీఫైన‌ల్‌గా భావించ‌డం ఖాయం. బెంగాల్ కంటే అత్యంత భీకరంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోలేదు. కానీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నికలకు దిగేముందు దేశ ప్రజలకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ అనేక ప్రశ్నలకు జవాబు చెప్పవలసి ఉన్నది. ‘వాక్సిన్ సర్టిఫికెట్ పై మోడీ తన చిత్రం ముద్రించుకున్నారు.. ఈ దేశంలో మరణించిన లక్షలాది ప్రజల డెత్ సర్టిఫికెట్లపై కూడా ఆయన చిత్రాన్ని ముద్రించాలి’.. అని బీహార్‌లో బీజేపీ మిత్రపక్షం హెచ్‌.ఎ.ఎమ్ నేత, మాజీ ముఖ్యమంత్రి జీతన్‌రామ్ మాంఝీ చేసిన వ్యాఖ్య ఈ దేశంలో అనేకమంది ఆలోచనలను ప్రతిఫలిస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ విషయంలో టీ సర్కార్ కీలక ఆదేశాలు!

హీరోయిన్ అంజలి ని ,ఆమె పిన్ని, బాబాయ్ లు చంపాలని చూశారా..?

మోదీ మైండ్ గేమ్.. బెంగాల్‌లో ఆట షురూ..

కృష్ణ - బాలు వివాదం లో అసలు వాస్తవాలు ఇవే .... ??

రూటు మార్చిన లేడి సూపర్ స్టార్..?

బుద్ధ జయంతి శుభాకాంక్షలు, బుద్ధుడు చెప్పిన అత్యంత గొప్ప విషయాలు...!

ప్ర‌శాంత్ నీల్ ఆ ఇండ‌స్ట్రీని మ‌ర్చిపోవాల్సిందేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>