MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/controversies--of--hero--heroine65617081-a216-4f5f-8bdb-692728800557-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/controversies--of--hero--heroine65617081-a216-4f5f-8bdb-692728800557-415x250-IndiaHerald.jpgప్రత్యూష నల్గొండ జిల్లా , భువనగిరిలో 1981 ఆగస్టు 29వ తేదీన ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. దురదృష్టవశాత్తు చిన్నప్పుడే ఈమె తండ్రి మరణించాడు. ఇక తల్లి సరోజినీదేవి ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఆయన పేరు ప్రణీత్ చంద్ర. ప్రస్తుతం సినిమాల్లో హీరోగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తండ్రి చనిపోవడంతో పిల్లల భారమంతా తల్లిపై పడింది. ఇక సరోజినీ దేవి తన కూతురు ప్రత్యూష ను హోటల్ మేనేజ్మెంట్ వరకు చదివింది. ఇక ప్రత్యూష మోడల్ గా రాణించి , ఉత్తమ స్మైల్ విభాగంలో అవార్డును కూడా పControversies - of - hero - heroine;soundarya;abinaya;editor mohan;jeevitha rajaseskhar;rachana;rani;district;cinema;school;television;tamil;nalgonda;february;doctor;heroine;success;father;prasthanamఅప్పట్లో వివాదాస్పదంగా మారిన నటి ప్రత్యూష మరణం..అప్పట్లో వివాదాస్పదంగా మారిన నటి ప్రత్యూష మరణం..Controversies - of - hero - heroine;soundarya;abinaya;editor mohan;jeevitha rajaseskhar;rachana;rani;district;cinema;school;television;tamil;nalgonda;february;doctor;heroine;success;father;prasthanamWed, 26 May 2021 16:00:00 GMT
ప్రత్యూష నల్గొండ జిల్లా , భువనగిరిలో 1981 ఆగస్టు 29వ తేదీన ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. దురదృష్టవశాత్తు చిన్నప్పుడే ఈమె తండ్రి  మరణించాడు. ఇక తల్లి సరోజినీదేవి ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఆయన పేరు ప్రణీత్ చంద్ర. ప్రస్తుతం సినిమాల్లో హీరోగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తండ్రి చనిపోవడంతో పిల్లల భారమంతా తల్లిపై పడింది. ఇక సరోజినీ దేవి తన కూతురు ప్రత్యూష ను హోటల్ మేనేజ్మెంట్ వరకు చదివింది.

ఇక ప్రత్యూష మోడల్ గా రాణించి , ఉత్తమ స్మైల్ విభాగంలో అవార్డును కూడా పొందింది. ఈమె అందం, అభినయం కలగలసి ఉండడంతో 17 సంవత్సరాల వయసులోనే సినీ పరిశ్రమలో అవకాశం కొట్టేసింది.  రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా రచన ,  సౌందర్య లు హీరోయిన్లుగా 1998 లో తెరకెక్కిన చిత్రం రాయుడు. ఈ చిత్రం ద్వారా ప్రత్యూష సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమాలో మోహన్ బాబు గారాలపట్టిగా రాణి పాత్రలో నటించిన ప్రత్యూష అద్భుతంగా నటించింది.

ఈ చిత్రం భారీ సక్సెస్ ను అందుకోవడంతో ఈమెకు తిరిగి 1999లో శ్రీరాములయ్య సినిమా లో మరొక అవకాశం లభించింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ,మంచి స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. తన సినీ ప్రస్థానంలో  ఐదు తెలుగు , 12 తమిళ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత టీవీ ధారావాహిక కార్యక్రమాల్లో  కూడా నటించింది. అతి తక్కువ కాలంలో మంచి హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ప్రత్యూష జీవితం  అర్ధంతరంగా ముగిసింది.


ముగ్గురు ప్రముఖ రాజకీయ నాయకుల కుమారులు  ఈమెను అత్యంత దారుణంగా రేప్ చేసి చంపారట. కానీ ఈమె మరణాన్ని  ఆత్మహత్యగా  చిత్రీకరించారు. ఎంతలా అంటే ప్రత్యూష డెడ్ బాడీ ని పోస్టుమార్టం చేసిన డాక్టరు, రేప్ కేసుగా తేల్చి చెప్పడంతో ఆయనను కూడా సస్పెండ్ చేశారు. అంటే ఒక డాక్టర్ ను సస్పెండ్ చేశారు అంటే అవతల ఎంత పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారో చెప్పకనే తెలుస్తోంది.. కానీ ప్రత్యూష తన చిన్ననాటి స్నేహితుడు సిద్ధార్థ రెడ్డిని ప్రేమించిందని, ఇక వారి వివాహాన్ని పెద్దలు అంగీకరించకపోవడంతో 2002 ఫిబ్రవరి 23న కోకోకోలలో విషం కలుపుకొని ఇద్దరు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. అని సాక్ష్యాలు కూడా సృష్టించారు.  ఇవన్నీ ప్రత్యూష తల్లి కొట్టిపారేసింది. ప్రత్యూష మరణం వెనుక ఉన్న కారణం అప్పట్లో వివాదాస్పదంగా మారింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు ఏవో తెలుసా..?

తాగి తీర్పు చెప్పిన నటి.. పోలీస్ స్టేషన్ లో భార్య ఫిర్యాదు. అసలేం జరిగింది.. ?

ఈ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త...!

నందమూరి బ్రదర్స్ సక్సెస్ వెనుక ఉన్నవారు వీళ్లే..

చావు బతుకుల్లో ప్రముఖ సీరియల్ నటి.. ఏకంగా అన్ని సర్జరీలు..?

చిన్మయి కెరీర్‌ను నాశనం చేసిన మీటూ వివాదం.. కెరీర్ పూర్తిగా నాశనం..!!

సౌత్ లో టాప్ 5 సినిమా టీజర్స్ ఇవే ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>