MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/drushyam-26c367849-565d-4146-992e-c4742743bb11-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/drushyam-26c367849-565d-4146-992e-c4742743bb11-415x250-IndiaHerald.jpgవిక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం 2 సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం - 2 కి రీమేక్. మలయాళం దర్శకుడు జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించిన ఒరిజినల్ సినిమాలో మోహన్‌లాల్‌, మీనా హీరో హీరోయిన్లుగా నటించారు. ఐతే తెలుగు చిత్రంలో కూడా హీరోయిన్ గా మీనా నటించనున్నారు. ఈ సినిమాకి జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్ ఈ రీమేక్ చిత్రం తో పాటు అసురన్ మూవీకి తెలుగు రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి "నారప్ప" గా టైటిల్ ఖరారు చేశారు. drushyam 2;business;venkatesh;suresh;meena;cinema;asuran;producer;remake;producer1;hero;heroine;narappa;chitramదృశ్యం-2 రిలీజ్ డేట్‌పై కీలక నిర్ణయం..?దృశ్యం-2 రిలీజ్ డేట్‌పై కీలక నిర్ణయం..?drushyam 2;business;venkatesh;suresh;meena;cinema;asuran;producer;remake;producer1;hero;heroine;narappa;chitramWed, 26 May 2021 13:30:00 GMTవిక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం 2 సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం - 2 కి రీమేక్. మలయాళం దర్శకుడు జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించిన ఒరిజినల్ సినిమాలో మోహన్‌లాల్‌, మీనా హీరో హీరోయిన్లుగా నటించారు. ఐతే తెలుగు చిత్రంలో కూడా హీరోయిన్ గా మీనా నటించనున్నారు. ఈ సినిమాకి జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్రీమేక్ చిత్రం తో పాటు అసురన్ మూవీకి తెలుగు రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి "నారప్ప" గా టైటిల్ ఖరారు చేశారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది కానీ ముందు ఏ సినిమా రిలీజ్ చేయాలన్న విషయం పై గత కొద్ది రోజులుగా సందిగ్ధత నెలకొంది. అయితే ఎట్టకేలకు ఈ సందిగ్ధతకి తెర పడిందని తెలుస్తోంది. వాస్తవానికి మొదట దృశ్యం 2 సినిమాని ఓటీటీలో విడుదల చేయాలని భావించారు కానీ నిర్మాత సురేష్ బాబు అందుకు ఒప్పుకోలేదు. మరోవైపు నారప్ప సినిమా థియేటర్లలోనే విడుదల చేయాలని వెంకటేష్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే దృశ్యం 2 సినిమా విడుదల విషయంలో చిత్రబృందం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుత పరిస్థితులలో సినిమా విడుదల చేయడం అసాధ్యం కాబట్టి దృశ్యం 2 సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర బృందం ఓ నిర్ణయానికి వచ్చిందట. ఓటీటీ లో 'దృశ్యం 2' మూవీని విడుదల చేసి.. పరిస్థితులు చక్కబడిన తరువాత థియేటర్లు పూర్తి కెపాసిటీతో తెరుచుకున్నప్పుడు 'నారప్ప' సినిమాను విడుదల చేద్దామని హీరో వెంకటేష్ అభిప్రాయపడ్డారని సమాచారం. నిజానికి “నారప్ప” సినిమాని దృశ్యం-2 రీమేక్ కంటే ముందస్తుగా ప్రారంభించారు. ఈ సినిమానే మొదటగా రిలీజ్ చేయాలని భావించారు. కానీ ప్రస్తుతం ఈ రెండు సినిమాల టీమ్స్ కొన్ని బిజినెస్ లెక్కలను పరిగణలోకి తీసుకొని “దృశ్యం-2″ చిత్రాన్ని నారప్ప కంటే ముందుగా ఓటీటీ వేదికగా రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మినీ కథకి మూలం అదే.. రచయిత ఆసక్తికర కామెంట్స్!

ఉద‌య్‌కిర‌ణ్ కేరీర్‌లో మిస్సైన సినిమాలు ఇవే...!

రామ్ చరణ్ ని ఊరిస్తున్న సరికొత్త రికార్డు.!!

ఆస్థి కోసం కోర్టు మెట్లెక్కిన శ్రీదేవి చెల్లెలు..ఏం జరిగింది .. ?

సిద్ధ ప్రాముఖ్యత పై కొరటాల ఆసక్తికర కామెంట్స్ !

హీరోయిన్ అంజలి ని ,ఆమె పిన్ని, బాబాయ్ లు చంపాలని చూశారా..?

మోదీ మైండ్ గేమ్.. బెంగాల్‌లో ఆట షురూ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>