MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgతెలుగులో వివాదాస్పద నటి శ్రీరెడ్డి అంటే తెలియని వారు ఉండరు. నిజానికి మూడేళ్ళ క్రితం వరకు ఆమె ఎవరికీ తెలియదు. అప్పటికి 1,2 సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ భామ క్యాస్టింగ్ కౌచ్ అనే అంశం తెర మీదకు తీసుకువచ్చి హైలైట్ అయింది. మొదట్లో సాక్షి ఛానల్ న్యూస్ రీడర్ గా తన కెరీర్ మొదలు పెట్టిన ఈ భామ సినిమా రంగంలో తన టాలెంట్, అందచందాలతో రాణించాలని భావించింది.. అలా సినిమా అవకాశాల కోసం చేస్తున్న ఉద్యోగం మానేసి ఫిలింనగర్ చేరిన ఈ భామ ఇప్పటికీ సరైన అవకాశం దక్కించుకోలేక పోయింది.. ఇండస్ట్రీలో సరైన గైడెన్సControversies-of-hero-heroine;pawan;bhama;kalyan;rani;hyderabad;cinema;telugu;huzur nagar;facebook;media;tamil;youtube;you tube;chennai;hero;local language;sri reddy;sakshi;pawan-kalyanవివాదాలకు కేరాఫ్ శ్రీరెడ్డి.. సాధించింది ఏంటి?వివాదాలకు కేరాఫ్ శ్రీరెడ్డి.. సాధించింది ఏంటి?Controversies-of-hero-heroine;pawan;bhama;kalyan;rani;hyderabad;cinema;telugu;huzur nagar;facebook;media;tamil;youtube;you tube;chennai;hero;local language;sri reddy;sakshi;pawan-kalyanWed, 26 May 2021 08:00:00 GMTతెలుగులో వివాదాస్పద నటి శ్రీరెడ్డి అంటే తెలియని వారు ఉండరు. నిజానికి మూడేళ్ళ క్రితం వరకు ఆమె ఎవరికీ తెలియదు. అప్పటికి 1,2 సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ భామ క్యాస్టింగ్ కౌచ్ అనే అంశం తెర మీదకు తీసుకువచ్చి హైలైట్ అయింది. మొదట్లో సాక్షి ఛానల్ న్యూస్ రీడర్ గా తన కెరీర్ మొదలు పెట్టిన ఈ భామ సినిమా రంగంలో తన టాలెంట్, అందచందాలతో రాణించాలని భావించింది.. అలా సినిమా అవకాశాల కోసం చేస్తున్న ఉద్యోగం మానేసి ఫిలింనగర్ చేరిన ఈ భామ ఇప్పటికీ సరైన అవకాశం దక్కించుకోలేక పోయింది.. 


ఇండస్ట్రీలో సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు దొరక్కపోవడంతో అందరు అమ్మాయిలలాగే మోసపోయినా, తర్వాత ఆ మోసపోయాను అన్న విషయం అర్థం అయి ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలని అనేక ప్రయత్నాలు చేసింది. అలా ఆమె క్యాస్టింగ్ కౌచ్ వ్యతిరేక ఉద్యమం మొదలు పెట్టింది. చేస్తున్న ఉద్యమం మంచిదే అయినా నా దాని తీరుతెన్నులు తెలియక ఒక స్టార్ హీరో ని తిడితే ఉద్యమం పాపులర్ అవుతుందని ఎవరో సలహా ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ ను అసభ్యంగా తిట్టి, అనేక సంచలనాలకు కారణమైంది.. ఇంత చేశాక కూడా కనీసం ఆమె అనుకున్న అవకాశాలు దక్కాయా అంటే లేదు అని చెప్పాలి.. 


ఆ దెబ్బకు హైదరాబాద్ వదిలి చెన్నై వెళ్లి సెటిల్ అయిన ఈ భామకి తమిళంలో కూడా అవకాశాలు లేవు. అక్కడ తన కోసం క్యూ కడుతున్నారని ఈ భామ చెప్పుకుంటున్నా అక్కడ అవకాశాలు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. ఒకప్పుడు ఆమె చేసిన క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం గురించి పాజిటివ్ గా మాట్లాడిన వాళ్లు సైతం ఇప్పుడు ఆమె ఫేస్బుక్ వేదికగా పెడుతున్న పోస్టులు, వీడియోలను చూసి అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ  సమాజంలో ఒక వ్యక్తి అందరికీ నచ్చాలని రూల్ లేదు, కానీ ఒక వ్యక్తిని అసభ్యంగా దూషించే అధికారం కూడా ఎవరికీ లేదు.


 కానీ ఈ భామ ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా కొందరు వ్యక్తులను టార్గెట్ చేసుకుని కురిపిస్తున్న బూతుల దండకం ఆమెను అందరికీ దూరం చేస్తోంది. అమ్మాయిల కోసం ఉద్యమం మొదలు పెట్టాను అని చెప్పుకున్న ఆమె ఈరోజు ఏం సాధించింది అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు అని చెప్పాలి. ఆ అమ్మాయిలు కూడా ఈ భామ వాడుతున్న బాష చూసి అసహ్యించుకునే పరిస్థితి. ఇక ఈ భామకి పెద్దగా అవకాశాలు లేని కారణంగా యూట్యూబ్ చానల్స్ పెట్టుకుని వాటి ద్వారా ఆదాయం పొందడానికి ప్రయత్నాలు చేస్తోంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎయిర్‌టెల్‌ మరో ముందడుగు

చిరంజీవి పాత టైటిల్స్‌తో వచ్చిన కొత్త సినిమాలివే..!

యాస్‌ తుఫాన్ : రాష్ట్రాలకు రెడ్ అల‌ర్ట్

ఈట‌ల వ్య‌వ‌హారంలో ట్విస్ట్ .. మ‌ద్ద‌తు కోస‌మేన‌ట‌!

హెరాల్డ్ సెటైర్ : మాస్కు ధరించని జనాలకు జగనే ఆదర్శమా ?

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>