PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcr-ts-news-telangana30446046-5f1a-426f-b5e4-8481474af703-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcr-ts-news-telangana30446046-5f1a-426f-b5e4-8481474af703-415x250-IndiaHerald.jpgతెరాస ప్ర‌భుత్వం రెండ‌వ సారి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆ పార్టీ ఎమ్మెల్యేల‌పై ఆరోప‌ణ‌లు ఎక్కువ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు మంత్రుల‌పై భూక‌బ్జా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. మంత్రి మ‌ల్లారెడ్డి మేడ్చెల్ జిల్లా సూరారంలో ఒక భూమి విషయంలో కబ్జాకు పాల్పడుతున్నారని ఓ మ‌హిళ ఏకంగా మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించటం తెలంగాణ‌లో సంచలనంగా మారింది. అదేవిధంగా మ‌రో మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్‌పైనా భూక‌బ్జా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. తాజాగా తెరాస ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిపైన భూక‌బ్జా ఆరోపణలు వ‌చ్చాయి. కాప్రాలోCM KCR, TS NEWS, TELANGANA;kcr;gautham new;gautham;nithya new;telangana rashtra samithi trs;district;huzur nagar;police;mla;survey;minister;reddy;petta;malla reddy;kavuru srinivas;party;mantra;kothapalli samuel jawaharకేసీఆర్‌ను చిక్కుల్లో ప‌డేస్తున్న నేత‌లెవ‌రు ..?కేసీఆర్‌ను చిక్కుల్లో ప‌డేస్తున్న నేత‌లెవ‌రు ..?CM KCR, TS NEWS, TELANGANA;kcr;gautham new;gautham;nithya new;telangana rashtra samithi trs;district;huzur nagar;police;mla;survey;minister;reddy;petta;malla reddy;kavuru srinivas;party;mantra;kothapalli samuel jawaharWed, 26 May 2021 11:41:00 GMTరాష్ట్రంలో క‌రోనా ఉధృతిని క‌ట్ట‌డి చేసేప‌నిలో సీఎం కేసీఆర్ నిమ‌గ్న‌మ‌య్యారు. లాక్‌డౌన్ విధించ‌డంతో పాటు నిత్యం వైద్య ఆరోగ్య‌శాఖ అధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ బిజీబిజీగా ఉంటున్నారు. ఈ క్ర‌మంలో కేసీఆర్‌కు తెరాస‌లోని కొంద‌రు ఎమ్మెల్యేలు కొత్త త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతున్నార‌ట‌. ఇటీవ‌ల మెద‌క్ జిల్లా అచ్చంపేట ప్రాంతంలో అసైన్డ్ భూములు క‌బ్జాచేశారని ఈట‌ల రాజేంద‌ర్‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వెంట‌నే విచార‌ణ‌కు ఆదేశించిన కేసీఆర్‌.. ఈట‌ల‌ను మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేశారు. తాజాగా ప‌లువురు ఎమ్మెల్యేలు, మంత్రుల‌పైనా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈట‌ల వ‌లే వీరిపైనా విచార‌ణ‌కు ఆదేశించాలంటూ ప్ర‌తిప‌క్షాల‌తో పాటు ప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు.

తెరాస ప్ర‌భుత్వం రెండ‌వ సారి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆ పార్టీ ఎమ్మెల్యేల‌పై ఆరోప‌ణ‌లు ఎక్కువ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు మంత్రుల‌పై భూక‌బ్జా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. మంత్రి మ‌ల్లారెడ్డి మేడ్చెల్ జిల్లా సూరారంలో ఒక భూమి విషయంలో కబ్జాకు పాల్పడుతున్నారని ఓ మ‌హిళ ఏకంగా మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించటం తెలంగాణ‌లో సంచలనంగా మారింది. అదేవిధంగా మ‌రో మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్‌పైనా భూక‌బ్జా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. తాజాగా తెరాస  ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిపైన భూక‌బ్జా ఆరోపణలు వ‌చ్చాయి. కాప్రాలోని సర్వే నెంబర్ 152లో 90 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో ఎమ్మెల్యే పై ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే తమ నుంచి డబ్బులు డిమాండ్ చేశాడని ఆరోపిస్తూ మేకల శ్రీనివాస్‌ యాదవ్‌ అనే వ్యక్తి జవహర్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు.

దీంతో ఎమ్మెల్యేతో పాటు కాప్రా ఎమ్మార్వో గౌతమ్ కుమార్‌పై జవహర్ నగర్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే దీనిపై ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి  స్పందించారు. క‌బ్జాకు గురైన భూమికి, త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప‌లువురు తెరాస ఎమ్మెల్యేల‌పై ఇలాంటి ఆరోప‌ణ‌లే వ‌స్తున్నాయి. దీంతో ప్ర‌తిప‌క్షాల‌కు సీఎం కేసీఆర్‌ను ఇరుకున పెట్టేందుకు ఆయుధంగా మారుతుంది. భూక‌బ్జా ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఈట‌ల‌పై చ‌ర్య‌లు తీసుకున్న కేసీఆర్‌.. మిగిలిన వారిపై ఆరోప‌ణ‌లు వ‌స్తే ఎందుకు ప‌ట్టించుకోరంటూ ప్ర‌తిప‌క్షాల నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.  ఈక్ర‌మంలో ప్ర‌జ‌ల్లోసైతం తెరాస‌పై న‌మ్మ‌కం స‌న్న‌గిల్లుతుంది. మ‌రి కేసీఆర్ ఈ చిక్కుల నుండి ఎలా బ‌య‌ట‌ప‌డుతారో వేచి చూడాల్సిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సిద్ధ ప్రాముఖ్యత పై కొరటాల ఆసక్తికర కామెంట్స్ !

హీరోయిన్ అంజలి ని ,ఆమె పిన్ని, బాబాయ్ లు చంపాలని చూశారా..?

మోదీ మైండ్ గేమ్.. బెంగాల్‌లో ఆట షురూ..

కృష్ణ - బాలు వివాదం లో అసలు వాస్తవాలు ఇవే .... ??

రూటు మార్చిన లేడి సూపర్ స్టార్..?

బుద్ధ జయంతి శుభాకాంక్షలు, బుద్ధుడు చెప్పిన అత్యంత గొప్ప విషయాలు...!

ప్ర‌శాంత్ నీల్ ఆ ఇండ‌స్ట్రీని మ‌ర్చిపోవాల్సిందేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>