PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-149e73bd-13f1-4bbf-9de6-a21700563f63-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-149e73bd-13f1-4bbf-9de6-a21700563f63-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీకి మహానాడు ఒక పండుగ. ప్రతీ ఏటా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీయార్ జయంతి వేళ ఆ పార్టీ వార్షికోత్సవ సమావేశాలను నిర్వహించడం అనవాయితీ. ఆ విధంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో చోటు చేసుకున్న అంశాలను చర్చించి తీర్మానాలు చేస్తారు. tdp;ntr;jayanthi;jagan;telugu;festival;tdp;success;ycp;party;jayamటీడీపీ మహానాడులో జగన్... ?టీడీపీ మహానాడులో జగన్... ?tdp;ntr;jayanthi;jagan;telugu;festival;tdp;success;ycp;party;jayamWed, 26 May 2021 21:00:00 GMTతెలుగుదేశం పార్టీకి మహానాడు ఒక పండుగ. ప్రతీ ఏటా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీయార్ జయంతి వేళ ఆ పార్టీ వార్షికోత్సవ సమావేశాలను నిర్వహించడం అనవాయితీ. ఆ విధంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో చోటు చేసుకున్న అంశాలను చర్చించి తీర్మానాలు చేస్తారు.

ఈసారి కరోనా నేపధ్యంలో వర్చువల్ పద్ధతిలో టీడీపీ మహానాడు జరగనుంది. ఇదిలా ఉండగా మహనాడు అజెండా ఏంటో తెలిసిపోయింది. మహానాడులో అంశాలన్నీ కూడా జగన్ మీద గురి పెట్టినవే ఉన్నాయి. రెండేళ్ల వైసీపీ పాలనలో తప్పులు, అప్పులు, కుంభకోణాల మీద చర్చిస్తామని ఆ పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. అదే విధంగా కరోనా కట్టడి విషయంలో జగన్ సర్కార్ ఏ విధంగానూ సక్సెస్ కాలేదని, అన్ని విధాలుగా ఫెయిల్ అయిందని కూడా టీడీపీ ఆరోపిస్తోంది. ఈ అంశాన్ని కూడా మహానాడులో పెట్టి చర్చిస్తామని అంటున్నారు.

ఈ నెల 27, 28 తేదేలలో రెండు రోజుల పాటు జరిగే మహానాడు పూర్తిగా జగన్ని టార్గెట్ చేసుకుంది అన్నది అజెండాను బట్టి అర్ధమవుతోంది. దాంతో ఈ రెండు రోజులూ అనేక తీర్మానాల ద్వారా విమర్శల ద్వారా జగన్ నామస్మర‌ణ కచ్చితంగా జరుగుతూ ఉంటుందని వేరేగా చెప్పాల్సింది లేదు. మహానాడులో జగన్ ప్రత్యక్షంగా పాలుపంచుకోకపోయినా ఆయన పేరు ప్రతీ నాయకుడి నోటి వెంట కచ్చితంగా వినిపించడం ఖాయమని అంటున్నారు.

సరే జగన్ సర్కార్ ని విమర్శించడం వరకూ ఓకే అయినా రెండేళ్లలో పార్టీ ఓటమికి దారి తీసిన పరిస్థితుల మీద టీడీపీ సమీక్ష చేస్తుందా అన్న దాని మీద ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ప్రత్యర్ధిని విమర్సించడం తప్పు లేదు, అందునా విపక్షంలో ఉన్నపుడు చేయాల్సిన పని కూడా అదే.  కానీ అదే సమయంలో తాము ఎక్కడ ఉన్నామో చూసుకుని ముందుకు అడుగులు వేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తిస్తేనే ఏ పార్టీ  సమావేశాలకు అయినా సార్ధకత. మరి టీడీపీ మహానాడులో ఆ రకమైన చర్చలు సాగుతాయో లేదో  చూడాల్సిందే.
               





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్యాంకులతో ఏపీ సర్కార్ చర్చలు... ప్రజలకు గుడ్ న్యూస్ చెప్తారా...?

వివాదాల వ‌ల్లే ఒక‌ప్ప‌టి స్టార్ డైరెక్ట‌ర్ డీలా ప‌డ్డారా..?

సూపర్ స్టార్ మనసు వెన్న.. మరోసారి బయటపడ్డ మంచితనం..

మహేష్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు ఏవో తెలుసా..?

తాగి తీర్పు చెప్పిన నటి.. పోలీస్ స్టేషన్ లో భార్య ఫిర్యాదు. అసలేం జరిగింది.. ?

ఈ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త...!

నందమూరి బ్రదర్స్ సక్సెస్ వెనుక ఉన్నవారు వీళ్లే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>