MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tolliwood-hero-heroines-show-622d3b36-9b59-4d7b-87f3-5cf039eb24d3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tolliwood-hero-heroines-show-622d3b36-9b59-4d7b-87f3-5cf039eb24d3-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ నటుడిగానే కాక టెలివిజన్ హోస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 1 హోస్ట్ గా వ్యవహరించిన ఆయన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఆయన ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. అంతా బాగుంటే మే నెల చివరి వారంలో ఈ షో టెలికాస్ట్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా ఈ షో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ షో వాయిదా పడటం కాదు పూర్తిగా నిలిపివేtollywood;chiranjeevi;ntr;jr ntr;bigboss;television;nandamuri taraka rama rao;marchఎన్టీఆర్ 'మీలో ఎవరు కోటీశ్వరులు'..పనైపోయిందా?ఎన్టీఆర్ 'మీలో ఎవరు కోటీశ్వరులు'..పనైపోయిందా?tollywood;chiranjeevi;ntr;jr ntr;bigboss;television;nandamuri taraka rama rao;marchWed, 26 May 2021 11:00:00 GMTజూనియర్ ఎన్టీఆర్ నటుడిగానే కాక టెలివిజన్ హోస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 1 హోస్ట్ గా వ్యవహరించిన ఆయన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఆయన ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. అంతా బాగుంటే మే నెల చివరి వారంలో ఈ షో టెలికాస్ట్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా ఈ షో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ షో వాయిదా పడటం కాదు పూర్తిగా నిలిపివేశారనే ప్రచారం జరుగుతోంది. 

ఎందుకంటే ఇలాంటి రియాలిటీ షోస్ కి వివిధ ప్రదేశాల నుంచి కంటెస్టెంట్స్ రావాల్సి ఉంది. అనేక వడపోతల అనంతరం సరైన వాళ్లను ఎంపిక చేసి షో నిర్వాహకులు అప్పుడు ఎపిసోడ్స్ షూట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా లాక్ డౌన్ లోనే రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి.. మరో వారం పది రోజులు పొడిగించినా ఆశ్చర్యంలేదని నివేదికలు అందుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఈ ఏడాది షో నిర్వహించడం కష్టమేనని భావిస్తున్న షో నిర్వాహకులు ప్రస్తుతానికి నిలిపివేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే మరికొందరు మాత్రం షో పూర్తిగా నిలిపివేసే అవకాశం లేదని పరిస్థితులు చక్కబడితే ఆగస్టు నెల నుంచి ఈ షో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఎందుకంటే ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించినందుకుగాను ఎన్టీఆర్ ఇప్పటికే భారీ ఎత్తున రెమ్యూనరేషన్ అందుకున్నాడని ఈ క్రమంలో షో నిలిపివేయడం అయితే జరగదని అంటున్నారు. హిందీలో విజయవంతంగా నడుస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి షోని గతంలోనే మీలో ఎవరు కోటీశ్వరుడు అనే పేరుతో చిరంజీవి కొన్ని సీజన్స్ నడిపారు. దానికి పేరు మార్చి ఇప్పుడు ఎన్టీఆర్ చేత ఈ షో చేయించడానికి నిర్వాహకులు సిద్ధమయ్యారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆర్మీ ఆసుపత్రి నుంచి రఘు రామకృష్ణ రాజు డిశ్చార్జ్

హీరోయిన్ అంజలి ని ,ఆమె పిన్ని, బాబాయ్ లు చంపాలని చూశారా..?

మోదీ మైండ్ గేమ్.. బెంగాల్‌లో ఆట షురూ..

కృష్ణ - బాలు వివాదం లో అసలు వాస్తవాలు ఇవే .... ??

రూటు మార్చిన లేడి సూపర్ స్టార్..?

బుద్ధ జయంతి శుభాకాంక్షలు, బుద్ధుడు చెప్పిన అత్యంత గొప్ప విషయాలు...!

ప్ర‌శాంత్ నీల్ ఆ ఇండ‌స్ట్రీని మ‌ర్చిపోవాల్సిందేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>