PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy-ycp7b132b72-67c7-4592-a6e3-bfcccd1cd231-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy-ycp7b132b72-67c7-4592-a6e3-bfcccd1cd231-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అక్ర‌మాస్తుల కేసులో బెయిల్‌పై బ‌య‌ట ఉన్నారు. ఆయ‌న కేసుల‌కు సంబంధించి ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని సీబీఐ కోర్టులో విచార‌ణ‌లు కొన‌సాగుతున్నాయి. సీబీఐ దాఖ‌లు చేసిన ఛార్జిషీట్ల‌లో విచార‌ణ రోజురోజుకు ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలో వైసీపీ ఎంపీగా ర‌ఘురామ కృష్ణంరాజు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ సీబీఐ కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటీష‌న్‌ను స్వీక‌రించిన కోర్టు.. ఇప్ప‌టికే మూడు ద‌ఫాలు విచార‌ణ చేప‌ట్టింది. ఈ మూడుసార్లు జ‌గ‌న్ త‌ర‌పు న్యాయ‌వాది,ys jagan mohan reddy, YCP;krishna;andhra pradesh;mp;court;cbi;ycp;juneజ‌గ‌న్ కేసులో మ‌రో ట్విస్ట్‌.. ఇక లాస్ట్ ఛాన్స్ ..జ‌గ‌న్ కేసులో మ‌రో ట్విస్ట్‌.. ఇక లాస్ట్ ఛాన్స్ ..ys jagan mohan reddy, YCP;krishna;andhra pradesh;mp;court;cbi;ycp;juneWed, 26 May 2021 13:19:00 GMTఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం విధిత‌మే. ఈ వ్య‌వ‌హారం ఇంకా సాగుతూనే ఉంది. కింద‌టి సారే లాస్ట్ ఛాన్స్ అనిచెప్పిన కోర్టు.. మ‌రోసారి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి త‌ర‌పు న్యాయ‌వాది, సీబీఐ అధికారులు కూడా కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌క‌పోవ‌టంతో ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది. కౌంట‌ర్ దాఖ‌లుకు జూన్ 1 లాస్ట్ ఛాన్స్ అని స్ప‌ష్టం చేసింది. అయితే బెయిల్ ర‌ద్దు వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వం, న్యాయ‌స్థానం, సీబీఐ కానీ పిటీష‌న్ వేయాలి. వీరెవ‌రూ కాకుండా మూడో వ్య‌క్తి బెయిల్ ర‌ద్దు చేయాలంటూ పిటీష‌న్ వేయ‌టంపై జ‌గ‌న్ త‌రపు న్యాయ‌వాదులు సీబీఐ కోర్టులో ఛాలెంజ్ చేసే అవ‌కాశం ఉంది. కానీ ఆవైపుగా వారు దృష్టిసారించ‌క పోవ‌టం కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అక్ర‌మాస్తుల కేసులో బెయిల్‌పై బ‌య‌ట ఉన్నారు. ఆయ‌న కేసుల‌కు సంబంధించి ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని సీబీఐ కోర్టులో విచార‌ణ‌లు కొన‌సాగుతున్నాయి. సీబీఐ దాఖ‌లు చేసిన ఛార్జిషీట్ల‌లో విచార‌ణ రోజురోజుకు ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలో వైసీపీ ఎంపీగా ర‌ఘురామ కృష్ణంరాజు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ సీబీఐ కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటీష‌న్‌ను స్వీక‌రించిన కోర్టు.. ఇప్ప‌టికే మూడు ద‌ఫాలు విచార‌ణ చేప‌ట్టింది. ఈ మూడుసార్లు జ‌గ‌న్ త‌ర‌పు న్యాయ‌వాది, సీబీఐ అధికారులు కోర్టుకు హాజ‌రవున్న‌ప్ప‌టికీ కౌంట‌ర్ మాత్రం దాఖ‌లు చేయ‌డం లేదు. ఇదే విష‌యంపై కోర్టు ఇరువురిని హెచ్చ‌రించింది. లాస్ట్ ఛాన్స్ అంటూ మే 26కు విచార‌ణ వాయిదా వేసింది.

బుధ‌వారం విచార‌ణ‌కు హాజ‌రైన జ‌గ‌న్ త‌ర‌పు న్యాయ‌వాదులు, సీబీఐ  అధికారులు కౌంట‌ర్ పిటీష‌న్ దాఖ‌లు చేయ‌లేదు. లాక్‌డౌన్ కార‌ణం వ‌ల్ల కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌లేక‌పోయామ‌ని జ‌గ‌న్ త‌ర‌పు న్యాయ‌వాది పేర్కొన‌గా, త‌మ‌కు  త‌మ సంస్థ నుంచి కౌంట‌ర్ దాఖ‌లుకు ఎలాంటి ఆదేశాలు రాలేద‌ని తెలిపింది. ఈ క్ర‌మంలో సీబీఐ కోర్టు ఇరువురిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇక ఛాన్స్‌లు ఇవ్వ‌లేమ‌ని, జూన్ 1వ‌ర‌కు అవ‌కాశం ఇస్తామ‌ని, ఈ లోపు ఇరువురు కౌంట‌ర్ దాఖ‌లు వేయాల‌ని స్ప‌ష్టం చేసింది. లేకుంటే మేమే స్వ‌యంగా బెయిల్ ర‌ద్దుపై వ‌చ్చిన పిటీష‌న్‌పై విచార‌ణ చేప‌డ‌తామ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ క్ర‌మంలో జూన్‌1 నాటికి ఏం జ‌రుగుతుందోన‌న్న అంశం ఉత్కంఠ‌గా మారింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దృశ్యం-2 రిలీజ్ డేట్‌పై కీలక నిర్ణయం..?

ఉద‌య్‌కిర‌ణ్ కేరీర్‌లో మిస్సైన సినిమాలు ఇవే...!

రామ్ చరణ్ ని ఊరిస్తున్న సరికొత్త రికార్డు.!!

ఆస్థి కోసం కోర్టు మెట్లెక్కిన శ్రీదేవి చెల్లెలు..ఏం జరిగింది .. ?

సిద్ధ ప్రాముఖ్యత పై కొరటాల ఆసక్తికర కామెంట్స్ !

హీరోయిన్ అంజలి ని ,ఆమె పిన్ని, బాబాయ్ లు చంపాలని చూశారా..?

మోదీ మైండ్ గేమ్.. బెంగాల్‌లో ఆట షురూ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>