TechnologySuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/face-book-new-rules-green-singal---------fb--------654997f7-2861-41d2-b585-c0682e23eb1a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/face-book-new-rules-green-singal---------fb--------654997f7-2861-41d2-b585-c0682e23eb1a-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో తీసుకొచ్చిన ‘కోడ్‌ ఆఫ్‌ ఎథిక్స్‌’ నిబంధనలకు ఫేస్ బుక్ ఆమోదం తెలిపింది. ఫేస్‌బుక్‌ సేవలు బుధవారం నుంచి నిలిచిపోనున్నాయనే ప్రచారానికి ఇప్పుడు బ్రేక్ పడింది. డిజిటల్‌ కంటెంట్‌ ను కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నూతన నిబంధనలు తీసుకొచ్చింది. వాటిని అమలు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది. అయితే, ఆ నిబంధనల్లో కొన్ని సమస్యలు నెలకొన్నాయని, వాటిపై కేంద్రంతో సంప్రదింపులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. డిజిటల్‌ కంటెంట్‌ విషయంలో ‘కోడ్‌ ఆఫ్‌ ఎథిక్స్‌’, face book, new rules, green singal,కొత్త రూల్స్ కు FB గ్రీన్ సిగ్నల్;amala akkineni;facebook;central governmentన్యూ రూల్స్‌కు ఫేస్‌బుక్ గ్రీన్ సిగ్నల్..?న్యూ రూల్స్‌కు ఫేస్‌బుక్ గ్రీన్ సిగ్నల్..?face book, new rules, green singal,కొత్త రూల్స్ కు FB గ్రీన్ సిగ్నల్;amala akkineni;facebook;central governmentWed, 26 May 2021 10:15:00 GMTకేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో తీసుకొచ్చిన ‘కోడ్‌ ఆఫ్‌ ఎథిక్స్‌’ నిబంధనలకు ఫేస్ బుక్ ఆమోదం తెలిపింది. ఫేస్‌బుక్‌ సేవలు బుధవారం నుంచి నిలిచిపోనున్నాయనే ప్రచారానికి ఇప్పుడు బ్రేక్ పడింది. డిజిటల్‌ కంటెంట్‌ ను కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నూతన నిబంధనలు తీసుకొచ్చింది. వాటిని అమలు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది. అయితే, ఆ నిబంధనల్లో కొన్ని సమస్యలు నెలకొన్నాయని, వాటిపై కేంద్రంతో సంప్రదింపులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. డిజిటల్‌ కంటెంట్‌ విషయంలో ‘కోడ్‌ ఆఫ్‌ ఎథిక్స్‌’, ఫిర్యాదుల పరిష్కారం కోసం మూడంచెల వ్యవస్థల ఏర్పాటుపై విధించిన డెడ్‌ లైన్‌ మే 25వ తేదీన ముగియడంతో ఫేస్‌బుక్‌ ఇలా స్పందించింది.

ఐటీ నిబంధనలకు అనుగుణంగా తమ సామర్థ్యాలను ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటు అందుకు కావాల్సిన కార్యాచరణ ప్రక్రియను మొదలు పెట్టామని ఫేస్ బుక్ తెలిపింది. అంతేకాకుండా ఫేస్ బుక్ వేదికగా యూజర్లు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించేందుకు ఫేస్‌బుక్‌ కట్టుబడి ఉందని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.

డిజిటల్‌ కంటెంట్‌ ను కంట్రోల్ చేయడం కోసం కేంద్రం తీసుకొచ్చిన నూతన నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనలను అమలు చేయని సంస్థలకు ఇంటర్మీడియరీ స్టేటస్‌ రద్దవుతుందని, ఆ సంస్థలు క్రిమినల్‌ చర్యలను కూడా ఎదుర్కోవాల్సి రావొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలు అమలు చేయని సంస్థలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వార్తా సైట్లు, ఓటీటీలకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం..  నిబంధనలను అమలు చేయడానికి ఆయా కంపెనీలు భారత్‌ లో అధికారులను నియమించుకోవాలి. వారి పేరు, అడ్రెస్ లను వెల్లడించాలి. యూజర్ల నుంచి వచ్చే ఫిర్యాదులను  పరిష్కరించాలి. అభ్యంతకర కంటెంట్‌ ఉంటే దానిని పర్యవేక్షించి వాటిని తొలగించాలి. ఇలాంటి నిబంధనలకు కట్టుబడడానికి కేంద్రం 3 నెలల గడువును కల్పించింది. అది మే 25తో ముగిసింది. ఇప్పటివరకు ‘కూ’ కంపెనీ తప్ప ఏ కంపెనీ కూడా ఇండియాలో ప్రత్యేక అధికారులను నియమించలేదు. అమెరికాలో తమ హెడ్ ఆఫీస్ ల నుంచి సూచనల కోసం ఎదురుచూస్తున్నామని, అందువల్ల 6 నెలల గడువు ఇవ్వాలని కంపెనీలు కోరుతున్నాయి. తాజాగా స్పందించిన ఫేస్‌బుక్‌, ఐటీ నిబంధనలకు అనుగుణంగా పని చేస్తామని, అందులో ఉన్న పలు సమస్యలపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని ప్రకటించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అనాథ‌లైన చిన్నారులు.. మృత్యుఒడిలో వైద్యులు..

ప్ర‌శాంత్ నీల్ ఆ ఇండ‌స్ట్రీని మ‌ర్చిపోవాల్సిందేనా ?

టాప్ డైరెక్టర్స్ లో ముందడుగు వేసిన సుకుమార్ !

కేజ్రీవాల్ బాట‌లో కేసీఆర్ ..! అలా అయితేనే సేఫ్‌

కిషన్ రెడ్డి క్లారిటీ.. ఈటల సీక్రెట్ వెలుగులోకి..

ఓటీటీ స్టార్ట్ చేసే ఆలోచనలో స్టార్ ప్రొడ్యూసర్ .. ?

కృష్ణపట్నంలో 144 సెక్షన్.. అప్పటి దాకా నో ఎంట్రీ!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>