PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan78085ad2-ee15-4431-b8d5-9a968064b098-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan78085ad2-ee15-4431-b8d5-9a968064b098-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్.. జగమొండి అన్న సంగతి తెలిసిందే.. ఈ విషయం ఇప్పటికే అనేక అంశాల్లో రుజువైంది. తాజాగా రఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్‌తో అది మళ్లీ రుజువైంది. అయితే రఘురామ కృష్ణంరాజు విషయంలో జగన్ ఎంత ప్రయత్నించినా.. పైచేయి మాత్రం రఘురామ కృష్ణంరాజుదే అయ్యింది. ఎలాగైనా రఘురామ కృష్ణంరాజును జైల్లోనే ఉంచాలని ప్రయత్నించిన జగన్ ఆ విషయంలో సక్సస్‌ కాలేకపోయారు. అంతే కాదు. ఆ ప్రక్రియలో భాగంగా అనేక సమస్యలు తెచ్చుకున్నారు. విషయం చివరకు సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. అక్కడ రఘురామ కృష్ణంరాజును సీఐడీ పోలీసుల వేధించారన్న విjagan;krishna;prabhakar;raghu;jagan;kanumuru raghu rama krishnam raju;andhra pradesh;police;chintamaneni prabhakar;court;king;parakala prabhakarజగన్.. సుప్రీంకోర్టుతో ఘర్షణకు దిగుతారా?జగన్.. సుప్రీంకోర్టుతో ఘర్షణకు దిగుతారా?jagan;krishna;prabhakar;raghu;jagan;kanumuru raghu rama krishnam raju;andhra pradesh;police;chintamaneni prabhakar;court;king;parakala prabhakarWed, 26 May 2021 06:00:00 GMTఏపీ సీఎం జగన్.. జగమొండి అన్న సంగతి తెలిసిందే.. ఈ విషయం ఇప్పటికే అనేక అంశాల్లో రుజువైంది. తాజాగా రఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్‌తో అది మళ్లీ రుజువైంది. అయితే రఘురామ కృష్ణంరాజు విషయంలో జగన్ ఎంత ప్రయత్నించినా.. పైచేయి మాత్రం రఘురామ కృష్ణంరాజుదే అయ్యింది. ఎలాగైనా రఘురామ కృష్ణంరాజును జైల్లోనే ఉంచాలని ప్రయత్నించిన జగన్ ఆ విషయంలో సక్సస్‌ కాలేకపోయారు.

అంతే కాదు. ఆ ప్రక్రియలో భాగంగా అనేక సమస్యలు తెచ్చుకున్నారు. విషయం చివరకు సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. అక్కడ రఘురామ కృష్ణంరాజును సీఐడీ పోలీసుల వేధించారన్న విషయమే హైలెట్ అయ్యింది. రఘురామ కృష్ణంరాజుకు సానుభూతి దొరికింది. చివరకు బెయిల్ మంజూరైంది. అయితే కథ ఇంతటితో ముగిసిపోలేదు. ఎలాగైనా రఘురామ కృష్ణంరాజును ఇబ్బంది పెట్టాలని కంకణం కట్టుకున్న జగన్.. రఘురామ కృష్ణంరాజు విడుదల కాగానే మరో కేసులో అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

అలా చేయడానికి అవకాశాలు లేకపోలేదు. గతంలో చింతమనేని ప్రభాకర్ విషయంలో ఇదే జరిగింది. ఒక కేసులో అరెస్టయి బెయిల్ పై విడుదల కాగానే మరో కేసు రెడీగా ఉండేది. ఆ కేసులో విడుదల కాగానే ఇంకో కేసు.. ఇలా చింతమనేని చాలా కాలం జైల్లోనే ఉంచారు కూడా. ఇప్పుడు రఘురామ కృష్ణంరాజు విషయంలోనూ అదే ఫార్ములా వాడే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

అదే జరిగితే.. దాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా భావించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సీఐడీ అధికారులు చిత్రహింసలు పెట్టారని రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టును కొంత వరకూ నమ్మించగలిగారు. ఇప్పుడు మళ్లీ ఆయన్ను వేరే కేసులో అరెస్టు చేస్తే.. ప్రభుత్వం నన్ను వేధిస్తోందంటూ రఘురామ కృష్ణంరాజు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు. ఇలా పదే పదే జరగడం జగన్ సర్కారుకు అది మంచిది కాదు. సుప్రీంకోర్టులో ఓ ఒపీనియన్ వస్తే అది ఇతర  కేసులపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. మరి జగన్ సుప్రీంకోర్టుతో ఘర్షణకే మొగ్గు చూపుతారా.. సంయమనం పాటిస్తారా అన్నది వేచి చూడాలి.  
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి

స్టూడెంట్‌గానే ప్రెగ్నెంట్‌... ఆ సంచ‌ల‌న సినిమాకు 21 ఏళ్లు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>