PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/mahanadu-tdp-ntr-babu8d24fd7c-0f61-4b69-817f-be6ff95006bf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/mahanadu-tdp-ntr-babu8d24fd7c-0f61-4b69-817f-be6ff95006bf-415x250-IndiaHerald.jpgమ‌హానాడు అంటేనే తెలుగుదేశం పార్టీకి ఒక సంబ‌రం. విజ‌య‌వాడ‌లో మ‌హానాడును నిర్వ‌హించాల‌నుకున్న ఆనాటి ముఖ్య‌మంత్రి ఎన్టీ రామారావు ఆ బాధ్య‌త‌ల‌ను దేవినేని నెహ్రూకు అప్ప‌జెప్పారు. నెహ్రూ ఈ కార్య‌క్ర‌మాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. క‌న‌క‌దుర్గ‌మ్మ వార‌ధి ద‌గ్గ‌ర ఉన్న స్థ‌లంలో ఏర్పాట్లు చేశారు. ఎన్టీరామారావుకు ఏనుగు అంబారీల‌తో స్వాగ‌తం ప‌ల‌క‌డంతోపాటు ఊరేగింపు నిర్వ‌హించారు. ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న స‌మ‌యంలో జ‌ర‌గ‌డంతో వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన‌వారంద‌రికీ ఎక్క‌డా లోటురాకుండా భోజ‌న ఏర్పాట్లు కూడాmahanadu, tdp, ntr, babu;ntr;telugu desam party;devineni avinash;telugu;local language;nandamuri taraka rama rao;vangaveeti;partyమ‌హానాడు నేర్పుతున్న పాఠాలు?మ‌హానాడు నేర్పుతున్న పాఠాలు?mahanadu, tdp, ntr, babu;ntr;telugu desam party;devineni avinash;telugu;local language;nandamuri taraka rama rao;vangaveeti;partyWed, 26 May 2021 16:31:00 GMT
మ‌హానాడు అంటేనే తెలుగుదేశం పార్టీకి ఒక సంబ‌రం. విజ‌య‌వాడ‌లో మ‌హానాడును నిర్వ‌హించాల‌నుకున్న ఆనాటి ముఖ్య‌మంత్రి ఎన్టీ రామారావు ఆ బాధ్య‌త‌ల‌ను దేవినేని నెహ్రూకు అప్ప‌జెప్పారు. నెహ్రూ ఈ కార్య‌క్ర‌మాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. క‌న‌క‌దుర్గ‌మ్మ వార‌ధి ద‌గ్గ‌ర ఉన్న స్థ‌లంలో ఏర్పాట్లు చేశారు. ఎన్టీరామారావుకు ఏనుగు అంబారీల‌తో స్వాగ‌తం ప‌ల‌క‌డంతోపాటు ఊరేగింపు నిర్వ‌హించారు. ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న స‌మ‌యంలో జ‌ర‌గ‌డంతో వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన‌వారంద‌రికీ ఎక్క‌డా లోటురాకుండా భోజ‌న ఏర్పాట్లు కూడా జ‌రిగాయి. సిద్ధార్థ క‌ళాశాల‌లో ఏర్పాటు చేసిన వేదిక‌పై పార్టీ నేత‌లంతా మాట్లాడారు. అదంతా ఒక చ‌రిత్ర అని, ఆ కార్య‌క్ర‌మం చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అప్ప‌ట్లో దేవినేని నెహ్రూకు, వంగవీటి రంగాకు విభేదాలుండ‌టంతో మ‌హానాడు ముగిసిన త‌ర్వాత అదే స్థానంలో రంగా ఆధ్వ‌ర్యంలో కాపునాడు జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి కూడా ప్ర‌జ‌లు భారీసంఖ్య‌లో హాజ‌ర‌య్యార‌ని గుర్తుచేస్తున్నారు. ఇద్ద‌రూ చెరో సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు కావ‌డంలో ఆ త‌ర్వాత నుంచి ఎవ‌రికివారు ప్ర‌త్యేక‌మైన పేర్ల‌తో స‌మావేశాలు నిర్వ‌హింప‌చేసుకుంటూ వ‌స్తున్నార‌ని గుర్తుచేస్తున్నారు.

అంత‌ర్గ‌త ప‌రిపాల‌న‌కు నిద‌ర్శ‌నం!
ఎన్టీఆర్ త‌ర్వాత చంద్ర‌బాబునాయుడు బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత కూడా మ‌హానాడును ఒక సిస్ట‌మాటిక్ కార్య‌క్ర‌మంగా తీర్చిదిద్దార‌నేది సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల‌ అభిప్రాయం. ఆ పార్టీలో అంత‌ర్గ‌త ప‌రిపాల‌న ఎలా ఉంటుంద‌నేదానికి మ‌హానాడు నిదర్శ‌న‌మంటున్నారు. అంత‌ర్జాతీయ మీడియాకు, జాతీయ మీడియాకు, రాష్ట్ర మీడియాకు, స్థానిక మీడియాకు ప్ర‌త్యేకంగా ఏర్పాట్లు చేయ‌డం, కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేవారంద‌రికీ ఎక్క‌డా లోటుపాట్లు రాకుండా చూడ‌టం, వ‌స‌తి సౌక‌ర్యం, భోజ‌న సౌక‌ర్యంలో లోటుపాట్లు లేకుండా చూడ‌టం కూడా ఆ పార్టీకి అడ్మినిస్ట్రేష‌న్‌పై ఉండే ప‌ట్టుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెబుతున్నారు. అలాగే ఈనెల 27, 28 తేదీల్లో జ‌రిగే మ‌హానాడును కూడా వ‌ర్చువ‌ల్‌గా నిర్వ‌హించ‌డం తెలుగుదేశం పార్టీ సాంకేతికంగా సాధించిన ప‌ట్టుకు నిద‌ర్శ‌న‌మంటున్నారు. ఒకే స‌మ‌యంలో వంద‌లాది పార్టీ ప్ర‌తినిధులు పాల్గొన‌డం ఒక రికార్డులాంటిదేన‌ని, ఇత‌ర పార్టీలు కూడా ఈ త‌ర‌హా ప‌రిపాల‌న‌ను అందిపుచ్చుకోవాల‌ని సూచిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తాత జయంతికి మనవడి సినిమా టైటిట్

వివాదాల వ‌ల్లే ఒక‌ప్ప‌టి స్టార్ డైరెక్ట‌ర్ డీలా ప‌డ్డారా..?

సూపర్ స్టార్ మనసు వెన్న.. మరోసారి బయటపడ్డ మంచితనం..

మహేష్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు ఏవో తెలుసా..?

తాగి తీర్పు చెప్పిన నటి.. పోలీస్ స్టేషన్ లో భార్య ఫిర్యాదు. అసలేం జరిగింది.. ?

ఈ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త...!

నందమూరి బ్రదర్స్ సక్సెస్ వెనుక ఉన్నవారు వీళ్లే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>