
గాంధీలో ప్రతి రోజు వెయ్యి మందికి ఉచిత భోజనం.. 12 రోజులు కొనసాగుతున్న రేవంత్ ఉచిత భోజనాలు
వేలాది మంది నిరుపేదలకు వైద్య సేవలు అందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో డాక్టర్లకు, సిబ్బందికి, రోగులకు, వారి బంధువులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గాంధీ ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవు.గాంధీకి వచ్చే రోగుల సహాయకులు తాగేందుకు కూడా మంచినీళ్లు లేవు.గాంధీలో పని చేసే డాక్టర్లు, నర్సులకు కూడా భోజన వసతి ఏర్పాటు చేయలేదు.గాంధీ ఆస్పత్రికి వచ్చే రోగులకు, వారి సహాయకులకు భోజనం,మంచినీళ్లు దొరగడం లేదనే విషయం కాంగ్రెస్ పార్టీ దృష్టికి వచ్చిందన్నారు.

గాంధీలో తాగేందుకు ళ్లు కూడా లేవు. కనీస సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న రేవంత్
రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరోనా రోగులకు సహాయం అందించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా గాంధీ ఆస్పత్రి దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి రోజు వెయ్యి మందికి ఉచిత భోజన సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. లాక్ డౌన్ ఉన్నంత వరకు ఉచిత భోజన సౌకర్యం కొనసాగిస్తామన్నారు. లాక్‌డౌన్ సమయంలో అన్నపూర్ణ క్యాంటీన్స్‌ను నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకురావడం లేదని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ విధానంలో విఫలం అయ్యాయని, వ్యాక్సిన్ అందించేందుకు సరైన ప్రణాళికలు లేక వ్యాక్సిన్ మొదటి డోస్ ,రెండో డోస్ మధ్య వ్యవధి పెంచుతూ పోతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

ఆస్పత్రుల దగ్గర అన్నపూర్ణ క్యాంటీన్స్ ఏర్పాటు చేయాలి.. ప్రభుత్వానికి రేవంత్ సూచన..
మరోవైపు రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఉందని, మందులు బ్లాక్ మార్కెట్ తరలిపోతున్నాయని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. ప్రగతి భవన్‌లో భేటిలు నిర్వమిస్తున్న టాస్క్‌ఫోర్స్ కమిటీ దృష్టికి ఈ సమస్యలు రాలేదా అని రేవంత్ ప్రశ్నించారు. టాస్క్‌ఫోర్స్ కమిటీలో ఒక్కరైన ఆయా రంగాలకు సంబంధించిన నిపుణులు ఉన్నారా అని నిలదీశారు. కరోనా పేరిట టాస్క్‌ఫోర్స్ కమిటీ అంటూ మళ్లీ వసూళ్లకు తెగబడుతున్నారని, ప్రగతి భవన్‌లో సమావేశమై కార్పొరేట్ కంపెనీల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని, ఆ సమావేశంలో కనీసం వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చజరగకపోవడం శోచనీయమన్నారు రేవంత్.

కార్పొరేట్ ఆస్పత్రుల చేతుల్లో కేసీఆర్ కీలుబొమ్మ..ఆరోగ్య శ్రీ లో కరోనాను చేర్చాలని రేవంత్ డిమాండ్.
అంతే కాకుండా కార్పొరేట్ ఆస్పపత్రుల చేతిలో సీఎం చంద్రశేఖర్ రావు కీలు బొమ్మగా తయారైయ్యారని, అందుకే కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చడం లేదన్నారు. వెంటనే ఆరోగ్య శ్రీ పథకం కింద కరోనా రోగులకు చికిత్స అందిచాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయిన ఆటో, ట్యాక్సీ, మెకానిక్ కుటుంబాలకు ప్రతి నెల ఐదు వేల రూపాయలు చెల్లించాలని, రాష్ట్రంలోని కోవిడ్ ఆస్పత్రుల దగ్గర అన్నపూర్ణ క్యాంటీన్స్ ప్రారంభించి భోజన సౌకర్యం కల్పించాలన్నారు. రాష్ట్రానికి అవసరమైన రెండో డోస్ వ్యాక్సిన్ 30 లక్షలు వెంటనే సమకూర్చి, రెండొ డోస్ వ్యాక్సినేషన్ వెంటనే పూర్తి చేయాలన్నారు రేవంత్ రెడ్డి.