MoviesGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/kriti-shetty-kriti-interview-5114fd5d-cc91-430d-b18f-f3ef0a2e8447-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/kriti-shetty-kriti-interview-5114fd5d-cc91-430d-b18f-f3ef0a2e8447-415x250-IndiaHerald.jpgహీరో, హీరోయిన్లు తమకు నచ్చినవారు, తమ మనసు మెచ్చేవారు ఎలా ఉండాలో అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో చెబుతుంటారు. అలా తన మనసులో మాట బయటపెట్టింది హీరోయిన్ కృతిశెట్టి. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన కృతి.. తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పింది. అందం, ఆకర్షణ, హైట్, వెయిట్.. ఇలాంటి క్వాలిఫికేషన్లేవీ ఆమె చెప్పలేదు కానీ, ఒకే ఒక్క విషయంలో మాత్రం తన అంచనాలను అందుకోవాలని అంటోంది కృతి శెట్టి. kriti shetty, kriti interview,;mahesh;nani;jeevitha rajaseskhar;shyam;sudigali sudheer;tollywood;cinema;marriage;love;interview;hero;heroine;lover;qualificationకృతిశెట్టిని లవ్ చేయాలంటే ఈ క్వాలిఫికేషన్లు ఉండాల్సిందే..కృతిశెట్టిని లవ్ చేయాలంటే ఈ క్వాలిఫికేషన్లు ఉండాల్సిందే..kriti shetty, kriti interview,;mahesh;nani;jeevitha rajaseskhar;shyam;sudigali sudheer;tollywood;cinema;marriage;love;interview;hero;heroine;lover;qualificationTue, 25 May 2021 11:00:00 GMTహీరో, హీరోయిన్లు తమకు నచ్చినవారు, తమ మనసు మెచ్చేవారు ఎలా ఉండాలో అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో చెబుతుంటారు. అలా తన మనసులో మాట బయటపెట్టింది హీరోయిన్ కృతిశెట్టి. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన కృతి.. తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పింది. అందం, ఆకర్షణ, హైట్, వెయిట్.. ఇలాంటి క్వాలిఫికేషన్లేవీ ఆమె చెప్పలేదు కానీ, ఒకే ఒక్క విషయంలో మాత్రం తన అంచనాలను అందుకోవాలని అంటోంది కృతి శెట్టి.

ఉప్పెన సినిమాలో తన లవర్ ని కలిసేందుకు.. ఇంట్లో పదే పదే అబద్ధాలు చెప్పి బయటకు వెళ్తుంది కృతి శెట్టి. సినిమాలో అబద్ధాలు చెప్పింది కానీ, రియల్ లైఫ్ లో తనకు అబద్ధాలంటే అస్సలు పడవట. తాను ఇష్టపడాలంటే.. కచ్చితంగా అవతలి వ్యక్తి నిజాయితీగా ఉంటాడనే నమ్మకం తనకు ఉండాలని చెబుతోంది కృతిశెట్టి. అబద్దాలు చెప్పేవారంటే కృతికి అస్సలు పడదట. ఏ విషయంలో అయినా దాపరికం లేకుండా ముక్కుసూటిగా చెప్పే వ్యక్తులంటే తనకు ఇష్టమంటోంది కృతి. తన జీవితంలోకి అలాంటి వ్యక్తి వస్తే బాగుంటుందని చెప్పింది. అబద్ధాలు చెప్పే వ్యక్తులకు తాను దూరంగా ఉంటామని, నిజాయితీగా ఉండేవాడినే తన జీవితంలోకి ఆహ్వానిస్తానంటోంది కృతి. ఇప్పటి వరకూ తనకు ఎలాంటి లవ్ స్టోరీలు లేవని చెబుతున్న కృతి శెట్టి, పెళ్లి విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తనకింకా అంత వయసు రాలేదని అంటోంది. పెళ్లి గురించి చెప్పడంలేదు కానీ, పెళ్లి కొడుకు క్వాలిఫికేషన్ మాత్రం చెప్పేసింది బేబమ్మ.

ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టిన కృతి శెట్టి.. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ గా మారింది. స్టార్ హీరోలు సైతం ఆమెతో సినిమా చేయడానికి ఇష్టపడుతున్నారు. నాని హీరోగా నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్‌’, రామ్‌, సుధీర్ బాబు సినిమాల్లో కూడా కృతికి అవకాశాలొచ్చాయి. మహేష్ బాబు సినిమాలో కూడా ఆమె నటిస్తుందనే వార్తలొచ్చాయి. టాలీవుడ్ లో ఆమె ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మేనబావతో ప్రేమ.. పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. చివరికి..?

రమ్య కృష్ణను గోల్డెన్‌ లెగ్‌గా మార్చిన దర్శకేంద్రుడు.. వీరిద్దరు చేసిన సినిమాలెన్నంటే..

మరోసారి వార్ కు సిద్ధం అవుతున్న బాలకృష్ణ చిరంజీవి !

సౌందర్య సినీ జీవితాన్ని మలుపుతిప్పిన రామకృష్ణ..!

గూగుల్ లో వినిపించే ఆ కమ్మని గొంతు మన తెలుగు అమ్మాయిదే

రామ్ చరణ్ ఫ్యాన్స్ నిజంగా గ్రేటబ్బా ..!!

ఓ బేబీ సినిమాతో మరో రికార్డు క్రియేట్ చేసిన నందిని..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>