HistorySuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/may-252b34e7b8-d293-4718-b6c3-c278d454a0c8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/may-252b34e7b8-d293-4718-b6c3-c278d454a0c8-415x250-IndiaHerald.jpgక్యాలెండర్ లో ప్రతిరోజుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు మే 25 కాగా.. ఈ తేదీకి చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందో.. ఈరోజు జరిగిన విశేషాలు ఏంటో.. ఇదే రోజున ఏ ఏ ప్రముఖులు జన్మించారో.. ఏ ఏ ప్రముఖులు మరణించారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ప్రముఖుల జననాలు: 1865: పీటర్ జీమన్, నోబెల్ బహుమతి గ్రహీత, డచ్ భౌతిక శాస్త్రవేత్త. (మ. 1943) 1886 - రాష్ బిహారీ బోస్, భారత సైనికుడు, కార్యకర్త (మ .1945) 1897: కల్లూరు సుబ్బారావు, అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1973) 1899: ఖాజీ నజ్రుల్ ఇస్లాం, బెంగాmay 25;karan johar;kumaar;sunil dutt;sunil;tiru;united states;congress;nobel award;tamil;2020;writer;producer;air;producer1;prize;murder.;gift;international;bengali;sardar vallabhai patelమే 25వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?మే 25వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?may 25;karan johar;kumaar;sunil dutt;sunil;tiru;united states;congress;nobel award;tamil;2020;writer;producer;air;producer1;prize;murder.;gift;international;bengali;sardar vallabhai patelTue, 25 May 2021 05:59:23 GMT
ప్రముఖుల జననాలు:

1865: పీటర్ జీమన్, నోబెల్ బహుమతి గ్రహీత, డచ్ భౌతిక శాస్త్రవేత్త. (మ. 1943)

1886 - రాష్ బిహారీ బోస్, భారత సైనికుడు, కార్యకర్త (మ .1945)

1897: కల్లూరు సుబ్బారావు, అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1973)

1899: ఖాజీ నజ్రుల్ ఇస్లాం, బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు. (మ.1976).

1936: రూసీ సూత్రీ, భారత క్రికెటర్ (మ .2013)

1940: ఎం.డి.నఫీజుద్దీన్, తెలుగు రచయిత, సంపాదకుడు, ఆంగ్ల అధ్యాపకుడు. ఎం.డి.సౌజన్య అనే కలం పేరుతో సుపరిచితుడు. (మ.2020)

1954 - మురళీ, భారతీయ నటుడు, నిర్మాత, రాజకీయవేత్త (మ .2009)

1972 - కరణ్ జోహార్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత మరియు స్క్రీన్ రైటర్

1977: కార్తీ, తమిళ, తెలుగు నటుడు.

1985: లియాటి జోసెఫ్ అనోయి(రోమన్ రైన్స్) అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్, నటుడు, మాజీ ప్రొఫెషనల్ గ్రిడిరోన్ ఫుట్‌బాల్ ఆటగాడు.

ప్రముఖుల మరణాలు:

1924: అశుతోష్ ముఖర్జీ, శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త. (జ.1864)

1964: గాలి పెంచల నరసింహారావు, చలనచిత్ర సంగీతదర్శకుడు. (జ. 1903)

1989: బులుసు వెంకట రమణయ్య, తెలుగు కవి, రచయిత. (జ.1907)

2005: సునీల్ దత్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయవేత్త (జ .1929)

2005: ఇస్మాయిల్ మర్చంట్, భారతీయ సంతతి చిత్ర నిర్మాత, దర్శకుడు (జ .1936)

2013: మహేంద్ర కర్మ, భారత రాజకీయవేత్త (జ. 1950)

2013: నంద్ కుమార్ పటేల్, భారత రాజకీయ నాయకుడు (జ. 1953)

2018: కడువెట్టి గురు, భారత రాజకీయ నాయకుడు, వీర వన్నియార్ కుల నాయకుడు (జ .1961)

సంఘటనలు:

1979: అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 191 చికాగోలోని ఓ'హేర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో కూలిపోవడంతో, విమానంలో ఉన్న మొత్తం 271 మంది, గ్రౌండ్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించారు.

2013: ఛత్తీస్‌గడ్ లో భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకుల కాన్వాయ్‌పై మావోయిస్టు తిరుగుబాటుదారులు దాడి చేసి కనీసం 28 మందిని చంపి, 32 మంది గాయపర్చారు.

2020: మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్ లో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు హత్య చేయబడ్డాడు. అరెస్టు సమయంలో జార్జ్ ని 9 నిమిషాల కంటే ఎక్కువసేపు నెలకు అదిమిపట్టి, మెడను మోకాలితో నొక్కిపట్టి కూర్చోని ఓ యునైటెడ్ స్టేట్స్ పోలీసు అధికారి చంపేశాడు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

జాతీయ దినాలు:

అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దమ్ముంటే అలా చేయండి.. ఏబీఎన్ ఆర్కేకు ప్రొ. కె.నాగేశ్వర్ సవాల్..?

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>