PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/red-sandal-crime395ac31e-9d17-4367-8ca7-bd49b1f61371-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/red-sandal-crime395ac31e-9d17-4367-8ca7-bd49b1f61371-415x250-IndiaHerald.jpg ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల ఆగ‌డాల‌కు అంతులేకుండా పోతోంది. అరెస్ట్ అయిన‌వారే బెయిల్‌పై వ‌చ్చి మ‌ళ్లీ మ‌ళ్ల అరెస్ట్ అవుతున్నారంటే వారు ఎంత య‌థేచ్చ‌గా ఈ దుంగ‌ల‌ను కొట్టేస్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. చిత్తూరు, క‌డ‌ప జిల్లాల్లో విస్త‌రించివున్న శేషాచ‌లం అడ‌వుల్లో ఎర్ర‌చంద‌నం చెట్లు రోజురోజుకూ త‌రిగిపోతున్నాయంటూ ఇప్ప‌టికే ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయినా స్మ‌గ్లింగ్ మాత్రం ఆగ‌డంలేదు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఎనిమిది మంది స్మ‌గ్ల‌ర్ల‌ను అట‌వీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. red sandal, crime;tiru;andhra pradesh;tirupati;air;husband;arrest;chandragiriఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల అరెస్ట్‌.. జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ హ‌రి ప‌రారీ!!ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల అరెస్ట్‌.. జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ హ‌రి ప‌రారీ!!red sandal, crime;tiru;andhra pradesh;tirupati;air;husband;arrest;chandragiriTue, 25 May 2021 12:13:06 GMT
ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల ఆగ‌డాల‌కు అంతులేకుండా పోతోంది. అరెస్ట్ అయిన‌వారే బెయిల్‌పై వ‌చ్చి మ‌ళ్లీ మ‌ళ్ల అరెస్ట్ అవుతున్నారంటే వారు ఎంత య‌థేచ్చ‌గా ఈ దుంగ‌ల‌ను కొట్టేస్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. చిత్తూరు, క‌డ‌ప జిల్లాల్లో విస్త‌రించివున్న శేషాచ‌లం అడ‌వుల్లో ఎర్ర‌చంద‌నం చెట్లు రోజురోజుకూ త‌రిగిపోతున్నాయంటూ ఇప్ప‌టికే ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయినా స్మ‌గ్లింగ్ మాత్రం ఆగ‌డంలేదు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఎనిమిది మంది స్మ‌గ్ల‌ర్ల‌ను అట‌వీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు.

11 దుంగ‌లు, రెండు నాటు తుపాకులు స్వాధీనం
చంద్రగిరి మండలం నాగపట్ల బీట్‌లో ఎనిమిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. వీరినుంచి 11 దుంగలను, రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. చామల రేంజ్‌ ఎఫ్‌ఆర్వో పట్టాభికి అందిన సమచారం మేరకు అర్థ‌రాత్రి చీకుమానుకోనలో కూంబింగ్‌ చేపట్టారు. కొంతమంది స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తూ అధికారులకు తారసపడ్డారు. వీరిపై అధికారులు దాడులు నిర్వహించగా స్మగ్లర్లు దుంగలను పడేసి అడవుల్లోకి పరారయ్యారు. వీరిని వెంబడించి ఎనిమిది మందిని అరెస్ట్ చేయ‌డంతోపాటు రెండు నాటు తుపాకులను, 11 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ మార్కెట్‌లో మొద‌టిశ్రేణి ఎర్ర‌చంద‌నం ట‌న్నుధ‌ర రూ.50 నుంచి రూ.80 లక్ష‌ల వ‌ర‌కు ప‌లుకుతోంది.

ప‌రారైన హ‌రి
పరారైన స్మగ్లర్‌ తిరుపతి టీఎంసీ కాలనీలోని జబర్ధ‌స్త్ ఫేమ్ హరిగా గుర్తించిన అధికారులు.. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హ‌రిపై గ‌తంలోనే ప‌లు కేసులు న‌మోద‌య్యాయి. అరెస్ట్ అయిన‌వారిలో క‌డ‌ప‌, చిత్తూరు జిల్లాల‌కు చెందిన‌వారున్నార‌ని అధికారులు తెలిపారు. డీఆర్వో కుమారస్వామి ఆధ్వ‌ర్యంలో చాక‌చ‌క్యంగా జ‌రిగిన కూంబింగ్‌పై ఉన్న‌తాధికారులు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందంటూ ఇప్ప‌టికే అన్ని వ‌ర్గాల నుంచి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జ‌రిగిన సంఘ‌ట‌న‌ను దృష్టిలో ఉంచుకొని ప్ర‌భుత్వం స్మ‌గ్లింగ్‌ను అరిక‌ట్టడానికి ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో వేచిచూడాలి మ‌రి.!!





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సుకుమార్ లెక్కలకు సమంత ఇలా సెట్ అయ్యిందా?

కృష్ణవంశీ, రమ్యకృష్ణ ల కాంబో లో వచ్చిన సూపర్ హిట్ సినిమా లేంటో తెలుసా..?

కాజల్ - పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా ?

ఆ డైరెక్టర్ కు తమన్నా లక్కీ దేవత..

రమ్య కృష్ణను గోల్డెన్‌ లెగ్‌గా మార్చిన దర్శకేంద్రుడు.. వీరిద్దరు చేసిన సినిమాలెన్నంటే..

మరోసారి వార్ కు సిద్ధం అవుతున్న బాలకృష్ణ చిరంజీవి !

సౌందర్య సినీ జీవితాన్ని మలుపుతిప్పిన రామకృష్ణ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>