SportsDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/zembobi-cricket-ryan-burel-shoow-f1f66b08-206a-4b0c-93d3-076958d550e8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/zembobi-cricket-ryan-burel-shoow-f1f66b08-206a-4b0c-93d3-076958d550e8-415x250-IndiaHerald.jpgక్రికెట్ అంటే ఇష్టం వుండని వారంటూ ఎవరూ ఉండరు. ఎక్కువగా టీ 20 క్రికెట్ మ్యాచెస్ ఎప్పుడు ఎప్పుడు జరుగుతాయా అని క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఐపీఎల్ ద్వారా క్రికెటర్లు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారని, మిగతా దేశాలతో పోలిస్తే ముఖ్యంగా మన దేశంలోని క్రికెటర్లు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు అని అందరికీ తెలుసు. ఇక అందుకే మన భారతదేశంలోని క్రికెటర్లు బాగా లగ్జరీగా బతుకుతూ ఉంటారు . అయితే కొంతమంది క్రికెటర్ల మాత్రం తమ పరిస్థితి చాలా దీనస్థితిలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.. అయితే ఆ క్రికెటర్ ఎవరూ చూద్దZEMBOBI CRICKET RYAN BUREL SHOOW;mumbai;cricket;india;pakistan;bangladesh;australia;ireland;zimbabwe;2019;bcci;october;international;sakshi;parugu;twitterస్పోర్ట్స్: కనీసం షూస్ కొనే స్థితిలో కూడా లేనంటున్న క్రికెటర్ !స్పోర్ట్స్: కనీసం షూస్ కొనే స్థితిలో కూడా లేనంటున్న క్రికెటర్ !ZEMBOBI CRICKET RYAN BUREL SHOOW;mumbai;cricket;india;pakistan;bangladesh;australia;ireland;zimbabwe;2019;bcci;october;international;sakshi;parugu;twitterTue, 25 May 2021 18:06:56 GMT
క్రికెట్ అంటే ఇష్టం వుండని వారంటూ ఎవరూ ఉండరు. ఎక్కువగా టీ 20 క్రికెట్ మ్యాచెస్ ఎప్పుడు ఎప్పుడు జరుగుతాయా అని క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక  ఐపీఎల్ ద్వారా క్రికెటర్లు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారని, మిగతా దేశాలతో పోలిస్తే ముఖ్యంగా మన దేశంలోని క్రికెటర్లు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు అని అందరికీ తెలుసు.  ఇక అందుకే మన భారతదేశంలోని  క్రికెటర్లు బాగా లగ్జరీగా బతుకుతూ ఉంటారు . అయితే కొంతమంది క్రికెటర్ల మాత్రం తమ పరిస్థితి చాలా దీనస్థితిలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.. అయితే  ఆ క్రికెటర్ ఎవరూ చూద్దాం.



జింబాబ్వే ప్రముఖ క్రికెట్ ఆటగాడు ర్యాన్ బర్ల్. ఈయన మాట్లాడుతూ.. "మేము చాలా దయనీయ స్థితిలో ఉన్నాం.. సిరీస్ ముగిసిన ప్రతిసారి మా షూస్ కు గ్లూ రాసుకుని వాటిని కాసేపు ఎండబెట్టుకుని, ఆ తర్వాత మ్యాచ్ కు  మళ్ళీ అవే  షూతోనే వెళుతున్నాం. ఇలా దాదాపుగా కొన్ని నెలలపాటు చేస్తూనే ఉన్నాం. కనీసం షూ కొనే స్థోమత కూడా లేదు.  ఎవరైనా స్పాన్సర్ ఉంటే సహాయం చేయండి.. అంటూ  ఆవేదన వ్యక్తం చేశాడు.
" style="height: 786px;">



ఇలా తన ఆవేదనను  వ్యక్తం చేయడం ద్వారా జింబాబ్వే క్రికెట్ ఆటగాళ్లు  ఎంత దయనీయ స్థితిలో ఉన్నారో  అందరికి అర్ధం అవుతోంది. అయితే అతను అలా పోస్ట్ పెట్టడం ద్వారా ఒక షూ స్పోర్ట్స్ కంపెనీ అతనితో ఒప్పందం చేసుకోవడమే కాక జింబాబ్వే ఆటగాళ్లకు షూస్ ను  గిఫ్టుగా పంపి తన ఉదారతను చాటుకుంది.  దీంతో "బీసీసీఐ, ఈసీబీ, క్రికెట్ ఆస్ట్రేలియా మీకు ఒక విజ్ఞప్తి.. దయచేసి జింబాబ్వేతో సీరీస్ ఉంటే పోస్ట్ పోన్ చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు వారితో క్రికెట్ ఆడితే వచ్చే డబ్బులు వారికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి కచ్చితంగా జింబాబ్వే తో ఆడమని" ఒక అభిమాని ఆవేదన చెందాడు.

ర్యాన్ బర్ల్ 2017లో జింబాబ్వే తరఫున ఆడిన 3 టెస్టులో 24 పరుగులు, 18 వన్డేల్లో 243 పరుగులతో పాటు7 వికెట్లను తీశాడు. అంతేకాకుండా 25 టి-20లో 393 పరుగులతో పాటు 11 వికెట్లు తీశాడు ర్యాన్ బర్ల్.


ఇక ప్రపంచంలో పేదరికంతో అలమటిస్తున్న దేశాలలో జింబాబ్వే కూడా ఒకటి. వీరు నల్లజాతీయులు అనే వివక్షత ఉండడంతో దశాబ్ద కాలం నుంచి కనీసం ఏ క్రీడలో కూడా ఆడేందుకు అనుమతించలేదు. అలాంటిది కాస్తోకూస్తో జింబాబ్వే పేరు వచ్చిందటే , అది కేవలం క్రికెట్ ద్వారానే అని చెప్పవచ్చు. అయితే ఒకప్పుడు జింబాబ్వే జట్టు లో కాస్త పేరున్న ఆటగాళ్లు ఎక్కువగా కనిపించేవారు. హిత్ స్ట్రీక్, ఆండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్, హెన్రీ ఒలాంగా, తైబూ మరికొందరు ఆటగాళ్లు ఉండేవారు. వారు ఉన్నంతకాలం జింబాబ్వే ఆటతీరు కాస్త మెరుగ్గానే ఉండేది. బలహీన జట్టుగా ఉన్న కూడా కాస్త పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించేది.
" style="height: 881px;">



ఈ ఆటగాళ్లంతా రిటైరయ్యాక జింబాబ్వే ఆటతీరు మరింత క్లిష్టంగా మారిపోయింది. అంతే కాకుండా బంగ్లాదేశ్ ,ఐర్లాండ్ ,ఆఫ్ఘనిస్తాన్ కంటే ఎంతో ముందు అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చిన జింబాబ్వే వారి చేతిలో కూడా పరాజయం పాలైంది. దీనికి తోడు క్రికెట్ ను కూడా రాజకీయాలతో ముడిపెట్టడం తో 2019 జులైలో ఐసీసీ జింబాబ్వే ఆట నుంచి బహిష్కరించింది. దీంతో వారికి కష్టాలు రెట్టింపయ్యాయి. ఎంతలా అంటే కనీసం ముంబై క్రికెట్ బోర్డు వారి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు కూడా చెల్లించలేకపోతోంది. కానీ ఆ తరువాత 2019లో అక్టోబర్ లో ఐసీసీ జింబాబ్వే పై ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. తాజాగా పాకిస్థాన్ తో రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడగా పాకిస్తాన్ 2-0 సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది.ఆ తర్వాత 3 టీ 20 సిరీస్ లో ఒక మ్యాచ్ గెలిచి , జింబాబ్వే మిగతా రెండు మ్యాచ్ లు ఓడిపోయింది.


ఏది ఏమైనప్పటికీ జింబాబ్వే ఆటగాళ్లు పెట్టిన పోస్ట్ చాలా బాధాకరంగా ఉంది.
" style="height: 857px;">






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అమ్మా నాన్న విడిపోయినందుకు నేను హ్యాపీ...శృతి షాకింగ్ కామెంట్స్.. !

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>