TechnologyDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/led-was-lcd-tv-differentes-e3db519f-0020-4c1f-9584-1a4728994bf7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/led-was-lcd-tv-differentes-e3db519f-0020-4c1f-9584-1a4728994bf7-415x250-IndiaHerald.jpgనాటి నుంచి నేటి వరకు వినోదాన్ని పంచుతున్న సాధనాలలో టీవీ లు ప్రత్యేకమైనవి. ఈ టీవీ లు సెల్ ఫోన్లు రాకముందే అందుబాటులోకి వచ్చి, ప్రపంచం నలుమూలల జరుగుతున్న అన్ని విషయాలను న్యూస్ ఛానల్ ద్వారా మనకు నిర్దిష్ట కాలంలోనే అందజేసేవి. కాలం మారుతున్న కొద్దీ ఈ టీవీలలో కూడా టెక్నాలజీ పెరిగిపోయి, రకరకాల టీవీలు వినోదాన్ని పంచడానికి ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్నాయి. అందులోనూ ఈ టీవీ లు సరికొత్త టెక్నాలజీతో ముందుకు రావడం మరో విశేషం. అయితే కొంత మంది ప్రేక్షకులు ఈ టీవీలను కొనుగోలు చేసేటప్పుడు సతమతమవుతూ ఉంటారు. అLED WAS LCD TV DIFFERENTES;technology;vidya;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;korcha;kanna lakshminarayana;television;electricityబుల్లి పిట్ట : ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీల మధ్య తేడా ఏంటో తెలుసా ?బుల్లి పిట్ట : ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీల మధ్య తేడా ఏంటో తెలుసా ?LED WAS LCD TV DIFFERENTES;technology;vidya;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;korcha;kanna lakshminarayana;television;electricityTue, 25 May 2021 13:00:00 GMT
నాటి నుంచి నేటి వరకు వినోదాన్ని పంచుతున్న సాధనాలలో టీవీ లు ప్రత్యేకమైనవి. ఈ టీవీ లు సెల్ ఫోన్లు రాకముందే అందుబాటులోకి వచ్చి, ప్రపంచం నలుమూలల జరుగుతున్న అన్ని విషయాలను న్యూస్ ఛానల్ ద్వారా మనకు నిర్దిష్ట కాలంలోనే అందజేసేవి. కాలం మారుతున్న కొద్దీ ఈ టీవీలలో కూడా టెక్నాలజీ పెరిగిపోయి, రకరకాల టీవీలు వినోదాన్ని పంచడానికి ప్రేక్షకులకు అందుబాటులోకి  వస్తున్నాయి. అందులోనూ ఈ టీవీ లు సరికొత్త టెక్నాలజీతో ముందుకు రావడం మరో విశేషం. అయితే కొంత మంది ప్రేక్షకులు ఈ టీవీలను కొనుగోలు చేసేటప్పుడు సతమతమవుతూ ఉంటారు. అంటే ఏ టీవీని తీసుకోవడం మేలు , దేనిలో ఎంత టెక్నాలజీ ఉంది అనే విషయాలు తెలియక ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీ ల మధ్య తేడా ఏంటో?  వాటి ఉపయోగాలు ఏమిటో? అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


ముందుగా బ్లాక్ అండ్ వైట్ టీవీలు  అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత కొంచెం నవీకరణ చేసి, కలర్ టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక  చాలా సంవత్సరాలకు ఈ LCD - లిక్విడ్-క్రిస్టల్ డిస్ప్లే  టీవీలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అప్పుడు వీటికి బాగా డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు మరికొన్ని నవీకరణలు చేసి ఎల్‌ఈడీ (లైట్-ఎమిటింగ్ డయోడ్) టీవీలను ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత వీటికి కూడా బాగా డిమాండ్ పెరిగిపోయింది.

ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటో తెలుసుకుందాం.. ఎల్సీడీ టీవీ స్క్రీన్‌లు 1 అంగుళం వరకు మందంగా ఉండగా, వీటితో పోల్చితే ఎల్‌ఈడీ టీవీ స్క్రీన్లు 1 అంగుళం తక్కువ మందంగా ఉంటాయి.

ఎల్సీడీ టీవీలు ఎక్కువ విద్యుత్ శక్తిని వినియోగిస్తుండగా, ఎల్‌ఈడీ టీవీలు తక్కువ విద్యుత్ శక్తిని వినియోగిస్తాయి. ఎల్సీడీ టీవీలు, ఎల్‌ఈడీ టీవీల కన్నా కొంచెం చౌకగా ఉండగా, ఎల్‌ఈడీ టీవీలు కాస్త ఖరీదైనవి. ఎల్‌ఈడీ టీవీలు ఎల్సీడీ టీవీల  కంటే ఎక్కువ  ప్రకాశవంతంగా ఉండడం తోపాటు ఎక్కువ రంగులు కలిగి ఉంటాయి. ఎల్సీడీ టీవీలను 165 డిగ్రీల  కోణం వరకు చూడవచ్చు. కానీ ఈ ఎల్సీడీ టీవీ స్క్రీన్‌పై ఉన్న చిత్రాలు ఇంటి అన్ని మూలల్లోనూ స్పష్టంగా కనిపించవు, టీవీ ముందు ఒక నిర్దిష్ట స్థలంలో కూర్చుంటే మాత్రమే కనిపిస్తుంది. ఎల్ఈడీ టీవీలు 180 డిగ్రీల వీక్షణలను అందిస్తున్నాయి. కనుక మీరు ఇంటి ఏ మూలన కూర్చున్న టీవీ తెరపై చిత్రాన్ని స్పష్టంగా చూడవచ్చు..మొత్తానికి చూసుకుంటే ఎల్సీడీ టీవీ ల కంటే ఎల్ఈడీ టీవీలు కొంచెం బెటర్ అని చెప్పవచ్చు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మమత ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

మాటల మాంత్రికుడు, పూజ హెగ్డే ల కాంబో అందుకే సూపర్ సక్సెస్..!!

ఆ మీటింగ్ తోనే అలర్ట్ అయిన ఎన్టీఆర్!

రాఘవేంద్ర రావు-జయసుధ కాంబో అంటేనే ఓ మ్యాజిక్..

కృష్ణవంశీ, రమ్యకృష్ణ ల కాంబో లో వచ్చిన సూపర్ హిట్ సినిమా లేంటో తెలుసా..?

కాజల్ - పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా ?

ఆ డైరెక్టర్ కు తమన్నా లక్కీ దేవత..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>