MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/narayan-murhi-movies-help-friendes-8e584dfc-4847-45c1-8428-c902422d9afc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/narayan-murhi-movies-help-friendes-8e584dfc-4847-45c1-8428-c902422d9afc-415x250-IndiaHerald.jpgఆర్.నారాయణమూర్తి పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను తెరమీద చూపించే ఫిలాసఫీ ఉన్న స్టార్ నటుడు. పేదలపై జరుగుతున్న అన్యాయాలను తన సినిమాలలో చూపించే ఏకైక హీరో ఆర్.నారాయణ మూర్తి. ఈయన సినిమా ఇండస్ట్రీలో 40 ఏళ్లుగా ఉన్నారు. ఈయన ముక్కుసూటి మనిషి అని కూడా చెప్పవచ్చు. అప్పట్లో ఈయన తీసిన సినిమాలు చాలా అద్భుత విజయాలు సాధించాయి. అయితే మంచితనానికి మారుపేరు అయిన నారాయణ మూర్తి కష్టాలను అనుభవిస్తున్నాడు. మంచితనానికి పోయి కష్టాలు తెచ్చుకున్నాడు. ఆయన పరిస్థితి ఎందుకNARAYAN MURHI MOVIES HELP FRIENDES;cbn;mithra;narayana murthy;cinema;producer;director;producer1;hero;vegetable market;success;ishtam;pulaparthi narayanamurthyఆయన మంచితనమే ఆయనకు శాపంగా మారిందా ?ఆయన మంచితనమే ఆయనకు శాపంగా మారిందా ?NARAYAN MURHI MOVIES HELP FRIENDES;cbn;mithra;narayana murthy;cinema;producer;director;producer1;hero;vegetable market;success;ishtam;pulaparthi narayanamurthyTue, 25 May 2021 10:00:00 GMT
ఆర్.నారాయణమూర్తి  పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను తెరమీద చూపించే ఫిలాసఫీ ఉన్న స్టార్ నటుడు. పేదలపై జరుగుతున్న అన్యాయాలను తన సినిమాలలో చూపించే ఏకైక హీరో ఆర్.నారాయణ మూర్తి. ఈయన సినిమా ఇండస్ట్రీలో 40 ఏళ్లుగా ఉన్నారు. ఈయన ముక్కుసూటి మనిషి అని కూడా చెప్పవచ్చు. అప్పట్లో ఈయన తీసిన సినిమాలు చాలా అద్భుత విజయాలు సాధించాయి. అయితే మంచితనానికి మారుపేరు అయిన నారాయణ మూర్తి కష్టాలను అనుభవిస్తున్నాడు. మంచితనానికి పోయి కష్టాలు తెచ్చుకున్నాడు. ఆయన పరిస్థితి ఎందుకు ఇలా మారిపోయిందో ?  ఇప్పుడు తెలుసుకుందాం.


పూర్తి వివరాల్లోకి వెళితే, అప్పట్లో నారాయణమూర్తి సినిమా అంటే బాక్సాఫీస్ ను షేక్ చేసేది. పైగా విప్లవ సినిమాలు ఆడుతున్న తరుణం అది. అందువల్లే ఎంతో మంది నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి పోటీ పడ్డారు. కానీ ఆయన స్వతహాగానే వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టి, తనకు వచ్చిన సక్సెస్ ను క్యాష్ చేసుకోవాలని ఆయన ఏనాడూ ప్రయత్నించలేదు. అయితే నారాయణమూర్తి మొదటి సినిమా చేయడానికి తనకు సహకరించిన కొంతమంది మిత్రుల రుణం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎలా అయినా సరే మంచి పనులు చేసి , తన మిత్రులకు ఆర్థికంగా లాభం చేకూర్చేలాన్నదే ఆయన ఆశయం.

ఇక అదే సమయంలో నిర్మాత పోకూరి బాబూరావు తో ఒక సినిమా చేయాలని నారాయణమూర్తి అనుకున్నారు. నారాయణమూర్తి హీరోగా మారుతున్న సమయంలో బాబురావుకి మాట సాయం చేశారట. ఇక అదే సమయంలోనే అతను కథను రెడీ చేయించి, ఆయనకు డేట్స్ ఇచ్చాడు. బాబురావు కి డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య అంటే నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకంతోనే ఆయన దగ్గరికి వెళ్లి నువ్వే డైరెక్ట్ చేయాలని కోరాడు. ఆ విధంగా తెరకెక్కిన సినిమా నే "ఎర్రోడు" .

తను చాలా ఇష్టంతో చేసిన సినిమా అంతగా ఆడలేదు. అంతేకాకుండా నారాయణమూర్తి మార్కెట్ తగ్గిపోవడానికి కారణం కూడా ఈ సినిమానే. అయితే అప్పట్లో ఆ సినిమా మీద చాలా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా హిట్ అవ్వకపోవడానికి ముఖ్య కారణం నారాయణ మూర్తి పై డ్యూయెట్లు పెట్టడమే ముఖ్య కారణమట. ఎందుకంటే నారాయణమూర్తిని అభిమానించే వాళ్లకి అసలు నచ్చలేదు. నారాయణ మూర్తిని కొత్తగా చూపించాలనే తపనతో దర్శకుడు ముత్యాల సుబ్బయ్య కొత్త ప్రయత్నం చేసి విఫలమయ్యాడు.


కానీ ఈ సినిమా వల్ల నిర్మాతకి బాబురావు బాగా లాభపడ్డారు. సినిమాను మంచి రేట్ కి అమ్మారు. కానీ నారాయణమూర్తి పై నమ్మకంతో కొంతమంది బయ్యర్లు సినిమాను ఎక్కువ పెట్టి కొన్నారు. దానితో వాళ్లంతా భారీ నష్టపోయారు. నష్టాల వల్ల నారాయణ మూర్తి తన సొంత సినిమాలను తక్కువ రేట్లకే అమ్మవలసి వచ్చింది. అందువల్లనే ఆయన మంచితనమే ఆయనకు శాపంగా మారిందని సినీ ప్రజలు చెప్పుకుంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రామ్ చరణ్ ఫ్యాన్స్ నిజంగా గ్రేటబ్బా ..!!

ఓ బేబీ సినిమాతో మరో రికార్డు క్రియేట్ చేసిన నందిని..!

సినిమాలకు చంద్రమోహన్ గుడ్ బై ..కారణం ఇదే.. !

బ్లాక్ ఫంగస్ కలకలం.. ఒకే రోజు అన్ని కేసులా?

ఆ హీరో కూతురిని పెళ్లి చేసుకోవాలంటే ఈ కండిషన్ తప్పనిసరి..?

ఏంది సామి ఇది : 555 విద్యార్ధుల పట్టివేత ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీనే కాదు జనాలను కూడా విజయసాయి భలే టెన్షన్లో పెట్టేశారే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>