PoliticsMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/twitter-facebook-block-kaanunnaayaacd83d900-2883-4dcf-914c-174a56dfa0ba-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/twitter-facebook-block-kaanunnaayaacd83d900-2883-4dcf-914c-174a56dfa0ba-415x250-IndiaHerald.jpgఅభివృద్ది చెందిన సాంకేతిక‌త‌ను ఆధారం చేసుకుని దశాబ్ద కాలం క్రితం చిన్న అల‌లా ప్రారంభ‌మైన సోష‌ల్ మీడియా నేడు ప్ర‌పంచాన్ని సుడిగాలిలా చుట్టేసింది. దీని ధాటికి ప్ర‌ధాన స్ర‌వంతి మీడియా మ‌నుగ‌డ కోసం పోరాటం చేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్ వంటివ‌న్నీఈ సోష‌ల్ మీడియా సాధ‌నాలే.fb twitter ban;prasad;suma;suma kanakala;ravi shankar prasad.;whatsapp;facebook;media;twitter;february;minister;instagram;news;central government;lie;jandhyala ravishankarట్విట్ట‌ర్, ఫేస్‌బుక్ బ్లాక్ కానున్నాయా..?ట్విట్ట‌ర్, ఫేస్‌బుక్ బ్లాక్ కానున్నాయా..?fb twitter ban;prasad;suma;suma kanakala;ravi shankar prasad.;whatsapp;facebook;media;twitter;february;minister;instagram;news;central government;lie;jandhyala ravishankarTue, 25 May 2021 06:00:00 GMTఅభివృద్ది చెందిన సాంకేతిక‌త‌ను ఆధారం చేసుకుని దశాబ్ద కాలం క్రితం చిన్న అల‌లా ప్రారంభ‌మైన సోష‌ల్ మీడియా నేడు ప్ర‌పంచాన్ని సుడిగాలిలా చుట్టేసింది. దీని ధాటికి ప్ర‌ధాన స్ర‌వంతి మీడియా మ‌నుగ‌డ కోసం పోరాటం చేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్ వంటివ‌న్నీఈ సోష‌ల్ మీడియా సాధ‌నాలే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీటి ప్ర‌భావం ప్ర‌జ‌ల‌పై ఎంత బ‌లంగా ఉందంటే.. ప్ర‌భుత్వాలను మార్చేసిన, నాయ‌కుల త‌ల‌రాత‌ల‌ను తిప్పిరాసిన ఘ‌న‌త వీటిది. కాగా భార‌త్‌లో ఇవి ప్ర‌స్తుతం నిషేధం ముప్పు ముంగిట నిల‌బ‌డి ఉన్నాయా..? రేప‌టి నుంచి అవి నిషేధిత జాబితాలోకి వెళ్లనున్నాయా అన్న‌ అనుమానాలు బలపడుతున్నాయి. దీనికి నేప‌థ్యం ఏమిటంటే మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం సోష‌ల్ మీడియాకు సంబంధించి కొన్ని నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రి చేసింది. అయితే ప్ర‌భుత్వ ఆదేశాల‌పై ట్విట్టర్, ఫేస్‌బుక్ యాజమాన్యాలు ఇప్పటికీ స్పందించ‌లేదు. కేంద్ర‌ ప్రభుత్వం ఇచ్చిన మూడు నెలల గడువు మే 26తో ముగుస్తోంది. దీంతో ఆ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి ఇండియాలో త‌మ సంస్థ‌ల కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగించేందుకు ఆ సంస్థ‌లు సుముఖంగా లేవ‌న్న అభిప్రాయాలు విన‌ప‌డుతున్నాయి.

 ప్ర‌భుత్వం విధించిన నిబంధ‌న‌లేమిటంటే..ఒక సమాచారాన్ని తొలగించాలని ప్రభుత్వపరమైన లేదా చట్టబద్ధమైన ఆదేశాలిస్తే 36 గంటలు దాటకుండా దాన్ని పాటించాల్సిందే. అలాగే ఏదైనా దర్యాప్తు లేదా సైబర్ సంబంధిత ఘటనలపై స‌మాచారం అడిగిన 72 గంటల్లోగా ఆయా సంస్థలు సహకారం అందించాలి.లైంగిక చర్యలకు సంబంధించిన సమాచారంపై ఫిర్యాదు అందిన రోజునే తప్పనిసరిగా స్పందించాలి

‘ఓటీటీ మాద్యమాల్లో మూడు అంచె వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని, ఓటీటీ, డిజిటల్ న్యూస్‌ మాధ్యమాలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి వెల్లడించాల‌ని, రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాద‌ని, కేవలం వాటి నుంచి సమాచారం మాత్రమే కోరుతున్నాం’’ అని ఫిబ్రవరి 26న ఈ నిబంధనల విడుదల సమయంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్ర‌క‌టించారు. జాతి, మతపరమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించేందుకు, అలాగే ఫిర్యాదుల పరిష్కారానికి ప్ర‌త్యేకంగా అధికారుల‌ను ఆ సంస్థ‌లు నియ‌మించాల‌న్న‌ది ప్ర‌భుత్వ ఆదేశం. ఈ అధికారులు తప్పని సరిగా భారతీయులై ఉండాలని కొత్త నిబంధనల్లో కేంద్రం పేర్కొన్నట్టు తెలుస్తోంది. వీటిని అమ‌లు చేసేందుకు కేంద్రం ఇచ్చిన గడువు మరో రేప‌టితో ముగియ‌నుంది. అయితే కేంద్ర ప్రభుత్వం విధించిన ఈ నిబంధనలకు ప్ర‌ధాన సంస్థ‌ల‌నుంచి సానుకూల స్పంద‌న వెలువ‌డ‌లేదు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ చ‌ర్య‌లు ఎలా ఉండ‌నున్నాయ‌నే అంశంపై నెటిజ‌న్ల‌లో ఉత్కంఠ వ్య‌క్త‌మ‌వుతోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భర్త చెంప పగులగొట్టిన నటి..!

దమ్ముంటే అలా చేయండి.. ఏబీఎన్ ఆర్కేకు ప్రొ. కె.నాగేశ్వర్ సవాల్..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : సీఐడీ ‘ఆ జాగ్రత్త’ తీసుకునుంటే పరిస్దితి వేరుగా ఉండేదా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: గొట్టిపాటి బలం తగ్గలేదా?

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>