PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/botsa-satyanarayanaa96e74cb-f0b9-4e6c-9339-3cb154ca8d07-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/botsa-satyanarayanaa96e74cb-f0b9-4e6c-9339-3cb154ca8d07-415x250-IndiaHerald.jpgబొత్స సత్యనారాయణ.. వైసీపీలో చాలా సీనియర్ నేత. జగన్ కేబినెట్‌లో కీలక మంత్రి కూడా. కీలకమైన శాఖ కూడా నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా మంత్రి బొత్స సత్యనారాయణ సైలంట్‌గా కనిపిస్తున్నారు. పెద్దగా హడావిడి కూడా లేదు. అసలు ఉన్నారా.. ఎక్కడికైనా వెళ్లారా అన్నట్టుగా ఉంది ఆయన ఉనికి. మరి మంత్రి బొత్స ఎందుకు ఇలా సైలంటయ్యారు.. ఎందుకు పెద్దగా మీడియా ముందుకు కూడా రావడం లేదు అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బొత్స సత్యనారాయణ గతంలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. జగన్ మూడు రాజధానుల నిర్ణయం తర్వాతbotsa-satyanarayana;amala akkineni;jagan;amaravati;botcha satyanarayana;vishakapatnam;media;minister;press;tiger;central government;ycp;coronavirusఅసలు.. మంత్రి బొత్స ఏమైపోయారబ్బా..?అసలు.. మంత్రి బొత్స ఏమైపోయారబ్బా..?botsa-satyanarayana;amala akkineni;jagan;amaravati;botcha satyanarayana;vishakapatnam;media;minister;press;tiger;central government;ycp;coronavirusTue, 25 May 2021 10:09:00 GMTబొత్స సత్యనారాయణ.. వైసీపీలో చాలా సీనియర్ నేత. జగన్ కేబినెట్‌లో కీలక మంత్రి కూడా. కీలకమైన శాఖ కూడా నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా మంత్రి బొత్స సత్యనారాయణ సైలంట్‌గా కనిపిస్తున్నారు. పెద్దగా హడావిడి కూడా లేదు. అసలు ఉన్నారా.. ఎక్కడికైనా వెళ్లారా అన్నట్టుగా ఉంది ఆయన ఉనికి. మరి మంత్రి బొత్స ఎందుకు ఇలా సైలంటయ్యారు.. ఎందుకు పెద్దగా మీడియా ముందుకు కూడా రావడం లేదు అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

బొత్స సత్యనారాయణ గతంలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. జగన్ మూడు రాజధానుల నిర్ణయం  తర్వాత బొత్స మరింత యాక్టివ్ అయ్యారు. తరచూ మీడియా సమావేశాలు నిర్వహించి.. మూడు రాజధానుల నిర్ణయాన్ని డిఫెండ్ చేసేవారు. తరచూ అమరావతి అంశంపై కామెంట్లు చేసేవారు. అంతే కాదు.. విశాఖ కేంద్రంగా వైసీపీ సర్కారు నిర్ణయాలు పెరిగాక మంత్రి బొత్స జోరు.. ఇంకాస్త పెరిగింది. విశాఖను ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నదీ.. ప్రభుత్వ ప్రణాళికలు అన్నీ వివరస్తూ ప్రెస్ మీట్లు పెట్టేవారు.

కానీ.. కొంత కాలంగా మంత్రి బొత్స ఎక్కడా కనిపించడం లేదు. ఆయన వాయిస్ పెద్దగా వినిపించడం లేదు. మూడు రాజధానుల నిర్ణయం అమలులో విపరీతమైన జాప్యం జరుగుతోంది. అది ఇప్పట్లో అయ్యేలా కనిపించడం లేదు. పులి మీద పుట్రలా ఏపీని కరోనా వైరస్ వేధిస్తోంది. దీంతో మూడు రాజధానుల నిర్ణయం అమలు అంశం ఇప్పుడు ప్రాధాన్యం కోల్పోయింది. బహుశా.. అందుకే మంత్రి బొత్స వాయిస్ వినిపించడం లేదేమో అన్న వాదన వినిపిస్తోంది.

దీనికి తోడు... మంత్రి బొత్స సైలెన్స్ కావడానికి రాజకీయంగా ఇతర కారణాలు కూడా ఉండొచ్చు.  జగన్ సర్కారులో ఏ మంత్రికి ఎప్పుడు ప్రాధాన్యత లభిస్తుందో తెలియదన్న వాదన కూడా ఉంది. ఏదేమైనా పార్టీలోనే సీనియర్ అయిన మంత్రి బొత్స మాత్రం కొంతకాలంగా సైలంట్‌గా ఉన్నారు. మళ్లీ ఆయన ఎప్పుడు ఫామ్‌లోకి వస్తారో.. ఏమో.. చూడాలి.. ఏం జరుగుతుందో..?



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సౌందర్య సినీ జీవితాన్ని మలుపుతిప్పిన రామకృష్ణ..!

గూగుల్ లో వినిపించే ఆ కమ్మని గొంతు మన తెలుగు అమ్మాయిదే

రామ్ చరణ్ ఫ్యాన్స్ నిజంగా గ్రేటబ్బా ..!!

ఓ బేబీ సినిమాతో మరో రికార్డు క్రియేట్ చేసిన నందిని..!

సినిమాలకు చంద్రమోహన్ గుడ్ బై ..కారణం ఇదే.. !

బ్లాక్ ఫంగస్ కలకలం.. ఒకే రోజు అన్ని కేసులా?

ఆ హీరో కూతురిని పెళ్లి చేసుకోవాలంటే ఈ కండిషన్ తప్పనిసరి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>