MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywoodc72ad0ca-85e3-477e-a467-766161caac84-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywoodc72ad0ca-85e3-477e-a467-766161caac84-415x250-IndiaHerald.jpg టాలీవుడ్ కి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు కావాలి. ఎందుకంటే ఒక సినిమా చేసి హిట్ కొట్టిన వెంటనే హీరోయిన్లు తమ డిమాండ్లు, రెమ్యూనరేషన్ భారీగా పెంచేస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు కొత్త భామలకి, ఇతర బాషలలో సత్తా చాటిన వారికీ అవకాశాలు ఇవ్వడానికి టాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తుంటారు.. మరీ ముఖ్యంగా తెలుగు దర్శక నిర్మాతలు తమిళ మలయాళ భామలను నటింపజేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు రవితేజ హీరోగా నటిస్తున్న సినిమాలో నటించేందుకుగానూ మలయాళ భామను రంగంలోకి దింపుతున్నtollywood;beauty;ravi;naga chaitanya;ram gopal varma;bhama;dhanush;divyansha kaushik;kaushik;naga;ramesh varma;ravi teja;sharath;sudhakar;tollywood;cinema;naga aswin;majili;heroine;chaitanya 1;krack;sharrath marar1;tamilటాలీవుడ్ ఎంట్రీకి మరో మల్లూ బ్యూటీ సిద్దం?టాలీవుడ్ ఎంట్రీకి మరో మల్లూ బ్యూటీ సిద్దం?tollywood;beauty;ravi;naga chaitanya;ram gopal varma;bhama;dhanush;divyansha kaushik;kaushik;naga;ramesh varma;ravi teja;sharath;sudhakar;tollywood;cinema;naga aswin;majili;heroine;chaitanya 1;krack;sharrath marar1;tamilTue, 25 May 2021 14:00:00 GMT 

టాలీవుడ్ కి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు కావాలి. ఎందుకంటే ఒక సినిమా చేసి హిట్ కొట్టిన వెంటనే హీరోయిన్లు తమ డిమాండ్లు, రెమ్యూనరేషన్ భారీగా పెంచేస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు కొత్త భామలకి, ఇతర బాషలలో సత్తా చాటిన వారికీ అవకాశాలు ఇవ్వడానికి టాలీవుడ్ దర్శక నిర్మాతలు  ప్రయత్నాలు చేస్తుంటారు.. మరీ ముఖ్యంగా తెలుగు దర్శక నిర్మాతలు తమిళ మలయాళ భామలను నటింపజేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు రవితేజ హీరోగా నటిస్తున్న సినిమాలో నటించేందుకుగానూ మలయాళ భామను రంగంలోకి దింపుతున్న ట్లు తెలుస్తోంది. 


రవితేజ హీరోగా శరత్ మండవ అనే కొత్త దర్శకుడు సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా 29 ఏళ్ల రెజిషా విజయన్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన ధనుష్ కర్ణన్ సినిమాలో ఆమె నటించింది. కర్ణన్ సినిమాలో ధనుష్ సరసన ఆమె హీరోయిన్ గా నటించింది. 


స్వతహాగా మలయాళీ అయిన ఈ భామ మలయాళంలో పలు అవార్డులు, రివార్డులు కూడా అందుకుంది. రవితేజ సరసన ఆమె హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో నాగ చైతన్య సరసన మజిలీ సినిమాలో నటించిన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా ఎంపికైంది. ఆ భామ తో పాటు రెజిషా విజయన్ ని కూడా హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చాలా సంవత్సరాలుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రవితేజ ఈ ఏడాది రిలీజ్ అయిన క్రాక్ సినిమాతో హిట్ కొట్టాడు. ప్రస్తుతం అయిన రమేష్ వర్మ దర్శకత్వంలో కిలాడి అనే సినిమా చేస్తున్నాడు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సీనియర్ నటి జయసుధ ఏకంగా 27 సినిమాలు ఆయన దర్శకత్వంలోనే చేసిందట.!

కేజిఎఫ్ 2 లో రావు రమేష్ పాత్ర ఇదే...!

మాటల మాంత్రికుడు, పూజ హెగ్డే ల కాంబో అందుకే సూపర్ సక్సెస్..!!

ఆ మీటింగ్ తోనే అలర్ట్ అయిన ఎన్టీఆర్!

రాఘవేంద్ర రావు-జయసుధ కాంబో అంటేనే ఓ మ్యాజిక్..

కృష్ణవంశీ, రమ్యకృష్ణ ల కాంబో లో వచ్చిన సూపర్ హిట్ సినిమా లేంటో తెలుసా..?

కాజల్ - పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>