PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaganf063738c-bff3-4741-af7e-73ba2735c257-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaganf063738c-bff3-4741-af7e-73ba2735c257-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్ కొందరికి థ్యాంక్స్ చెబుతూ వరుసగా ట్వీట్లు పెట్టారు. ఇంతకీ ఆయన థ్యాంక్స్ చెప్పిందెవరికో తెలుసా.. ముకేశ్ అంబానీకీ, జిందాల్ స్టీల్, టాటా స్టీల్ యాజమాన్యాలకు జగన్ కృతజ్ఞతలు చెప్పారు. ఎందుకంటారా ? కష్టకాలంలో ఏపీకి ఆక్సిజన్ అందించినందుకు జగన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి ఆక్సిజన్‌ పంపిస్తున్న సంస్థలకు కృతజ్ఞతలు తెలిపిన జగన్.. కరోనా వేళ అండగా నిలిచారంటూ ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు. రిలయన్స్‌ ఫౌండేషన్‌, ముకేశ్ అంబానీకి కృతజ్ఞతలు తెలిపిన జగన్.. భవిష్యత్తులోనూ రిలయన్స్ అjagan;tiru;jagan;andhra pradesh;reliance;rayalaseema;twitter;central government;oxygen;nijamవాళ్లకు థ్యాంక్స్ చెబుతూ వరుసగా జగన్‌ ట్వీట్లు..!వాళ్లకు థ్యాంక్స్ చెబుతూ వరుసగా జగన్‌ ట్వీట్లు..!jagan;tiru;jagan;andhra pradesh;reliance;rayalaseema;twitter;central government;oxygen;nijamTue, 25 May 2021 09:00:00 GMTఏపీ సీఎం జగన్ కొందరికి థ్యాంక్స్ చెబుతూ వరుసగా ట్వీట్లు పెట్టారు. ఇంతకీ ఆయన థ్యాంక్స్ చెప్పిందెవరికో తెలుసా.. ముకేశ్ అంబానీకీ, జిందాల్ స్టీల్, టాటా స్టీల్ యాజమాన్యాలకు జగన్ కృతజ్ఞతలు చెప్పారు. ఎందుకంటారా ? కష్టకాలంలో ఏపీకి ఆక్సిజన్ అందించినందుకు జగన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి ఆక్సిజన్‌ పంపిస్తున్న సంస్థలకు కృతజ్ఞతలు తెలిపిన జగన్.. కరోనా వేళ అండగా నిలిచారంటూ ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు.

రిలయన్స్‌ ఫౌండేషన్‌, ముకేశ్ అంబానీకి కృతజ్ఞతలు తెలిపిన జగన్.. భవిష్యత్తులోనూ రిలయన్స్ అండదండలు కొనసాగాలని ఆకాంక్షించారు. టాటా స్టీల్‌, జిందాల్‌ స్టీల్స్‌కు కృతజ్ఞతలు తెలిపిన సీఎం జగన్‌.. టాటా స్టీల్‌ ఇప్పటివరకు ఏపీకి వెయ్యి టన్నుల ఆక్సిజన్‌ పంపిందని ట్వీట్‌ లో వివరించారు. రాయలసీమ ప్రాంతానికి సజ్జన్ జిందాల్‌ ఆక్సిజన్ పంపిందని గుర్తు చేసుకున్న జగన్.. రాష్ట్రానికి 500 టన్నుల ఆక్సిజన్‌ను నవీన్ జిందాల్‌ పంపారని సీఎం జగన్‌ అన్నారు.

నిజంగానే.. ఈ సంస్థలు ఏపీలో వందల ప్రాణాలు కాపాడినట్టే చెప్పుకోవాలి. ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్‌లో చాలామందికి ఆక్సిజన్ అవసరం వచ్చింది. కేంద్రం నుంచి ఆశించినంత మేర ఆక్సిజన్ సరఫరా లేని సమయంలో ఈ సంస్థలు తమ పరిశ్రమల నుంచి ఏపీకి ఆక్సిజన్ అందించాయి. వందల మంది ప్రాణాలు నిలబెట్టాయని చెప్పొచ్చు.

తిరుపతిలో ఓ ఆక్సిజన్ ట్యాంకర్‌ సమయానికి రాలేకపోవడం.. ఏకంగా 11 మందికిపైగా కొవిడ్ రోగుల ఉసురు తీసిన సంగతి తెలిసిందే. కేవలం ఐదంటే ఐదు నిమిషాలు ఆక్సిజన్  ట్యాంకర్ ఆలస్యంగా  రావడం కారణంగా కరోనా రోగులు ఊపిరి ఆగిపోయింది. అంతకుముందు విశాఖలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. కొవిడ్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా ఎంత ముఖ్యమో ఈ ఘటనలు తెలిపాయి. ఇలాంటి సమయంలో ఆక్సిజన్ అందిస్తున్న సంస్థలకు సీఎం కృతజ్ఞతలు చెప్పడం ఎంతైనా మెచ్చుకోవాల్సిన విషయమే.
" style="height: 328px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నియోజకవర్గంలో కొడాలి నానీ కొత్త కార్యక్రమం... ఇది సూపర్...?

సినిమాలకు చంద్రమోహన్ గుడ్ బై ..కారణం ఇదే.. !

బ్లాక్ ఫంగస్ కలకలం.. ఒకే రోజు అన్ని కేసులా?

ఆ హీరో కూతురిని పెళ్లి చేసుకోవాలంటే ఈ కండిషన్ తప్పనిసరి..?

ఏంది సామి ఇది : 555 విద్యార్ధుల పట్టివేత ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీనే కాదు జనాలను కూడా విజయసాయి భలే టెన్షన్లో పెట్టేశారే ?

దమ్ముంటే అలా చేయండి.. ఏబీఎన్ ఆర్కేకు ప్రొ. కె.నాగేశ్వర్ సవాల్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>