MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/directors--heroines--combinations6feb6f8a-869f-4ccf-b410-501f0526dc3d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/directors--heroines--combinations6feb6f8a-869f-4ccf-b410-501f0526dc3d-415x250-IndiaHerald.jpgకాజల్ - పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల గురించి తెలుసుకునే ముందు వీరిద్దరి గురించి తెలుసుకుందాం.. కాజల్ అగర్వాల్ మొదట తేజ నిర్మించిన లక్ష్మీ కళ్యాణం చిత్రం ద్వారా 2007లో, తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. ఇందులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కాజల్ 2009లో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంలో నటించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో ఓవర్నైట్ లోనే కాజల్ స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరింది. ఆdirectors - heroines - combinations;pawan;chiranjeevi;mahesh;ntr;ram charan teja;prakash raj;jr ntr;kajal aggarwal;kalyan;kalyan ram;puri jagannadh;raj;ram pothineni;teja;venkat;cinema;january;businessman;director;lakshmi devi;temper;heroine;nandamuri taraka rama rao;march;magadheera;pawan-kalyan;badri;chitram;rajamouli;rajani kanthకాజల్ - పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా ?కాజల్ - పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా ?directors - heroines - combinations;pawan;chiranjeevi;mahesh;ntr;ram charan teja;prakash raj;jr ntr;kajal aggarwal;kalyan;kalyan ram;puri jagannadh;raj;ram pothineni;teja;venkat;cinema;january;businessman;director;lakshmi devi;temper;heroine;nandamuri taraka rama rao;march;magadheera;pawan-kalyan;badri;chitram;rajamouli;rajani kanthTue, 25 May 2021 12:00:00 GMT
కాజల్ - పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల గురించి తెలుసుకునే ముందు  వీరిద్దరి గురించి తెలుసుకుందాం.. కాజల్ అగర్వాల్ మొదట తేజ నిర్మించిన లక్ష్మీ కళ్యాణం చిత్రం ద్వారా 2007లో, తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. ఇందులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కాజల్ 2009లో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంలో నటించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో ఓవర్నైట్ లోనే కాజల్ స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది కాజల్.


ఇక పూరీ జగన్నాథ్ సినిమాలను దర్శకత్వం చేయడానికి అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో, పవన్ కళ్యాణ్ "బద్రి" సినిమా ద్వారా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా మంచి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇదిలా ఉండగా ఇప్పుడు కాజల్ అగర్వాల్  - పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఏంటంటే, 2012 లో  బిజినెస్ మ్యాన్ చిత్రం. ఈ చిత్రాన్ని ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, ఆర్ ఆర్ వెంకట్ నిర్మించాడు. ఇందులో ప్రకాష్ రాజ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, కాజల్ అగర్వాల్, నాజర్ ముఖ్య పాత్రల్లో నటించారు. 2012 జనవరి 13న భారీ ఎత్తున విడుదలైన ఈచిత్రం, సంచలనాత్మక విజయాన్ని సాధించింది.


ఇక వీరిద్దరి కాంబినేషన్ లో మరొక చిత్రం టెంపర్. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు కాజల్ హీరోయిన్ గా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం టెంపర్. ఇక ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ నే మార్చిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఎన్నడూ చూడని విధంగా సరికొత్త కోణంలో ఎన్టీఆర్ ను చూపించాడు పూరి జగన్నాథ్. ఇక ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ సాధించడంతో , కాజల్ కెరియర్ కూడా మరింత స్టార్ స్టేటస్ కు వెళ్ళింది.. ఏది ఏమైనా పూరి దర్శకత్వంలో కాజల్ కు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాఘవేంద్ర రావు-జయసుధ కాంబో అంటేనే ఓ మ్యాజిక్..

కృష్ణవంశీ, రమ్యకృష్ణ ల కాంబో లో వచ్చిన సూపర్ హిట్ సినిమా లేంటో తెలుసా..?

ఆ డైరెక్టర్ కు తమన్నా లక్కీ దేవత..

రమ్య కృష్ణను గోల్డెన్‌ లెగ్‌గా మార్చిన దర్శకేంద్రుడు.. వీరిద్దరు చేసిన సినిమాలెన్నంటే..

మరోసారి వార్ కు సిద్ధం అవుతున్న బాలకృష్ణ చిరంజీవి !

సౌందర్య సినీ జీవితాన్ని మలుపుతిప్పిన రామకృష్ణ..!

గూగుల్ లో వినిపించే ఆ కమ్మని గొంతు మన తెలుగు అమ్మాయిదే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>