PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/congress-03f1441b-d777-4376-818a-5fb1418363fa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/congress-03f1441b-d777-4376-818a-5fb1418363fa-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వీక్ అవ్వడంతో, ఆ స్థానాన్ని భర్తీ చేయాలని కమలదళం చూస్తుంది. అందుకు తగ్గట్టుగానే రాజకీయం చేస్తుంది. అలాగే ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ సత్తా చాటింది. అధికార టీఆర్ఎస్‌ని ఓడించి సంచలనం సృష్టించింది. అటు జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు దాదాపు చెక్ పెట్టినంత పని చేసింది.congress;venkatesh;kcr;revanth;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;congress;government;huzur nagar;nalgonda;assembly;cheque;ranga reddy;medak;adilabad;karimnagar;partyకమలానికి ఛాన్స్ ఇస్తున్న కాంగ్రెస్...సీనియర్లు మారాల్సిందేనా?కమలానికి ఛాన్స్ ఇస్తున్న కాంగ్రెస్...సీనియర్లు మారాల్సిందేనా?congress;venkatesh;kcr;revanth;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;congress;government;huzur nagar;nalgonda;assembly;cheque;ranga reddy;medak;adilabad;karimnagar;partyTue, 25 May 2021 03:00:00 GMTతెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వీక్ అవ్వడంతో, ఆ స్థానాన్ని భర్తీ చేయాలని కమలదళం చూస్తుంది. అందుకు తగ్గట్టుగానే రాజకీయం చేస్తుంది. అలాగే ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ సత్తా చాటింది. అధికార టీఆర్ఎస్‌ని ఓడించి సంచలనం సృష్టించింది. అటు జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు దాదాపు చెక్ పెట్టినంత పని చేసింది.


దీంతో నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు అసలైన పోటీ ఇచ్చేది బీజేపీనే అని విశ్లేషణలు కూడా మొదలైపోయాయి. కానీ బీజేపీకి ఆ సత్తా లేదని తాజాగా జరిగిన వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో రుజువైంది. ఈ రెండుచోట్ల టీఆర్‌ఎస్‌కు వన్‌సైడ్ విక్టరీ లభించింది. ఇక టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీ మాత్రం మూడో స్థానానికి పరిమితమైంది. అంటే బీజేపీ బలం హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో కాస్త ఎక్కువగా ఉన్నట్లు కనబడుతుంది. అలాగే నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్, బీజేపీలు రెండోస్థానం కోసం పోటీ పడుతున్నాయి.


కానీ వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు ఎక్కువ బలం కనిపిస్తుంది. ఈ పరిస్తితిని బట్టి చూస్తే తెలంగాణలో బీజేపీ కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ బలం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పోరాడితే మరింత బలపడవచ్చు. లేదంటే వారిలో వారే విభేదాలు పెట్టుకుని రాజకీయం చేస్తే, బీజేపీకి ఛాన్స్ ఇచ్చినట్లే.


కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డితో పాటు మరో నలుగురు, ఐదుగురు నేతలు మాత్రమే కేసీఆర్ ప్రభుత్వంపై బలంగా పోరాడుతున్నారు. మిగిలిన వారంతా సైలెంట్‌గానే ఉంటున్నారు. పైగా పోరాడే నాయకులకు అడ్డుపడుతున్నారు. దీని వల్ల కాంగ్రెస్ మరింత నష్టపోతుంది. ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలు వల్ల పార్టీ చాలా నష్టపోయింది. ఇక అదే అడ్వాంటేజ్‌గా తీసుకుని బీజేపీ పుంజుకుంది. అయితే కాంగ్రెస్ ఇంకా మారకపోతే, నెక్స్ట్ టీడీపీలాగా అంతరించిపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?

బాలీవుడ్ బడా డైరెక్టర్ తో విభేదాల్లో ఉన్న హీరో హీరోయిన్లు వీరే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>