ViralSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/carona-vuris-china-cave37cbe118-4153-4c11-bd73-6ed091c530c9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/carona-vuris-china-cave37cbe118-4153-4c11-bd73-6ed091c530c9-415x250-IndiaHerald.jpgగత సంవత్సరం కరోనా వైరస్ పుట్టి అలజడి రేపింది. చైనాలో ఈ వైరస్ పుట్టి ప్రపంచ వ్యాప్తంగా పాకింది. ప్రస్తుతం చాలా మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంటోంది. అయితే ఈ వైరస్ కు సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. చైనాలోని ఓ గుహలో కరోనా మూలాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ గుహ నుంచే వైరస్ మూలాలను తీసుకొచ్చి చైనా ల్యాబ్ లో పరీక్షించారని, ఆ తర్వాతే ఆ ల్యాబ్ నుంచి వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని ప్రజలు భయపడుతున్నారు. ఈ విషయాన్నే అమెరికా ఇంటెలిజెన్స్‌ నివేదిక బయటపెట్టింది. తాజాగా వాల్‌స్ట్రీట్‌ కూడాcarona vuris, china cave;american samoa;wuhan;coronavirus;helloవైరల్: కరోనాకి కారణం ఆ గుహేనా...?వైరల్: కరోనాకి కారణం ఆ గుహేనా...?carona vuris, china cave;american samoa;wuhan;coronavirus;helloTue, 25 May 2021 14:00:00 GMTగత సంవత్సరం కరోనా వైరస్ పుట్టి అలజడి రేపింది. చైనాలో ఈ వైరస్ పుట్టి ప్రపంచ వ్యాప్తంగా పాకింది. ప్రస్తుతం చాలా మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంటోంది. అయితే ఈ వైరస్ కు సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. చైనాలోని ఓ గుహలో కరోనా మూలాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ గుహ నుంచే వైరస్ మూలాలను తీసుకొచ్చి చైనా ల్యాబ్ లో పరీక్షించారని, ఆ తర్వాతే ఆ ల్యాబ్ నుంచి వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని ప్రజలు భయపడుతున్నారు. ఈ విషయాన్నే అమెరికా ఇంటెలిజెన్స్‌ నివేదిక బయటపెట్టింది. తాజాగా వాల్‌స్ట్రీట్‌ కూడా ఈ విషయాన్ని బయటపెట్టింది. చైనాలో సార్స్‌కు కారణమైన వైరస్‌ మూలాలు ఉన్న గుహను కనుగొన్నట్లు 2017లో ఓ కథనం వెలువడింది. ఆ టైంలో ఇలాంటి వ్యాధులు మున్ముందు వస్తాయనే భావనను వ్యక్తం చేసింది. ఆసియా పసిఫిక్‌ కరస్పాండెంట్‌ డేవిడ్‌ సైరనోస్కీ 2017లో ఈ విషయాన్ని తెలియజేశారు. 2002లో 800 మరణాలతో గ్లోబల్‌ ఎమర్జెన్సీకి కారణమైన సార్స్‌ వంటి ఒక వైరస్‌ మూలాలను చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌లోని గుహల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడ ఉన్న ‘హర్స్‌హు’ గబ్బిలాల్లో ఇవి ఉన్నాయి. భవిష్యత్తులో అంటువ్యాధులకు కారణం అయ్యే లక్షణాలు వీటిల్లో పుష్కలంగా ఉన్నాయని తేల్చి చెప్పారు.


కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ను గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో జంతుమార్కెట్‌లో విక్రయించే సివిట్‌ అనే జీవిలో గుర్తించారు. ఆ తర్వాత హార్స్‌హు గబ్బిలాలు వీటికి మూలావాసాలుగా గుర్తించారు. ఈ క్రమంలో వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీకి చెందిన షి జంగ్‌ లీ, క్యూ జీ అనే శాస్త్రవేత్తల నేతృత్వంలోని బృందం దేశ వ్యాప్తంగా వేలాది గబ్బిలాల నుంచి నమూనాలు సేకరించారు. 2012 ఏప్రిల్‌లో యునాన్‌ ప్రావిన్స్‌లోని మోజియాంగ్‌లోని టోంగ్‌గువాన్‌లో కొందరు కూలీలు గబ్బిలాల విసర్జితాలను తొలగిస్తూ జబ్బుపడ్డారు. వీరిలో సార్స్‌ వంటి లక్షణాలు కనిపంచాయి. ముగ్గురు మరణించారు. బతికిన వారిని పరిశీలించగా సార్స్‌కు వచ్చే యాంటీబాడీలు వారి శరీరంలో ఉన్నాయి. ఈ గుహల్లోని గబ్బిలాలపై ఐదేళ్లపాటు పరిశోధనలు చేశారు. ఆ గబ్బిలాల మలం నమూనాలు, మలద్వార స్వాబ్‌ నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సీనియర్ నటి జయసుధ ఏకంగా 27 సినిమాలు ఆయన దర్శకత్వంలోనే చేసిందట.!

కేజిఎఫ్ 2 లో రావు రమేష్ పాత్ర ఇదే...!

మాటల మాంత్రికుడు, పూజ హెగ్డే ల కాంబో అందుకే సూపర్ సక్సెస్..!!

ఆ మీటింగ్ తోనే అలర్ట్ అయిన ఎన్టీఆర్!

రాఘవేంద్ర రావు-జయసుధ కాంబో అంటేనే ఓ మ్యాజిక్..

కృష్ణవంశీ, రమ్యకృష్ణ ల కాంబో లో వచ్చిన సూపర్ హిట్ సినిమా లేంటో తెలుసా..?

కాజల్ - పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>