MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/narappac02363b3-bf9f-4394-82d3-752393670f65-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/narappac02363b3-bf9f-4394-82d3-752393670f65-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ అగ్ర కథానాయకుడు వెంకటేష్ తెలియని వారుండరు. దాదాపు కొన్ని దశాబ్దాలుగా అగ్రహీరోగా సాగుతున్న వెంకటేష్ తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా కలియుగ పాండవులు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన వెంకటేష్ తన తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ తరువాత వరుస సినిమాలతో విజయాలను అందుకుని విజయాన్ని తన ఇంటి పేరు..narappa;venkatesh;karthik;murli sharma;prakash raj;priyamani;raj;rao ramesh;cinema;asuran;narappa;srikanth;srikanth addala;tamil;tollywood;sureshనారప్ప అప్పటికైనా వస్తాడా..?నారప్ప అప్పటికైనా వస్తాడా..?narappa;venkatesh;karthik;murli sharma;prakash raj;priyamani;raj;rao ramesh;cinema;asuran;narappa;srikanth;srikanth addala;tamil;tollywood;sureshTue, 25 May 2021 17:45:00 GMTటాలీవుడ్ అగ్ర కథానాయకుడు వెంకటేష్ తెలియని వారుండరు. దాదాపు కొన్ని దశాబ్దాలుగా అగ్రహీరోగా సాగుతున్న వెంకటేష్ తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా కలియుగ పాండవులు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన వెంకటేష్ తన తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ తరువాత వరుస సినిమాలతో విజయాలను అందుకుని విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకుని అభిమానుల చేత విక్టరీ వెంకటేష్‌ అనిపించుకున్నాడు. అంతేకాకుండా కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచాడు. తన డైలాగ్ డెలివరి, యాక్షన్ సన్నివేశాలతో పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.


అయితే ప్రస్తుతం వెంకటేష్ నారప్ప సినిమాను తెరకెక్కిస్తున్నాడు.  ఈసినిమా తమిళ ‘అసురన్’ సినిమాకు రీమేక్‌గా రూపొందుతోంది. అణగారిన కులానికి చెందిన ఒక కుటుంబం అదే ఊరిలోని సంపన్న కులంలోని ధనిక భూస్వామి వల్ల కలిగే సమస్యలను ఎదుర్కొని ఎలా పరిష్కరించుకుందనే నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించబడింది. ఈ సినిమాలో ప్రియమణి, కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కలైపులి ఎస్ తను, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. అయితే  ఈసినిమా ఈ నెల 14న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే.



తాజాగా ఈ సినిమా గురించి సరికొత్త సమాచారం అందుతోంది.  ఈసినిమా విడుదల విషయంలో మేకర్స్ చర్చలు చేస్తున్నారట. దేశంలోని పరిస్థితులు చక్కబడితే  ఈసినిమా ఆగస్టులో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. ఈ మేరకు వార్తలు సినీ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది ఆఖరుకి కూడా పరిస్థితులు ఇదే రీతిలో ఉంటే సినిమాను ఓటీటీ రిలీజ్ గురించి ఆలోచిస్తామని మేకర్స్ అంటున్నారట. మరి ఈ సినిమా విడుదల ఎందులో అవుతుందో వేచి చూడాల్సిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి

స్టూడెంట్‌గానే ప్రెగ్నెంట్‌... ఆ సంచ‌ల‌న సినిమాకు 21 ఏళ్లు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>