PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajendar95de04a2-fc6a-4056-a0b3-879f394be209-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajendar95de04a2-fc6a-4056-a0b3-879f394be209-415x250-IndiaHerald.jpgఈటల రాజేందర్ త్వరలో బీజేపీలో చేరబోతున్నారా.. ఆయనకు బీజేపీ అధిష్టానం ఏకంగా కేంద్ర మంత్రి పదవే ఆఫర్ గా ఇచ్చిందా.. ఈటలను బీజేపీలోకి చేర్చుకుని.. రాజ్యసభకు పంపేందుకు బీజేపీ వ్యూహం సిద్ధం చేస్తోందా.. బీజేపీలోకి రాగానే ఈటల రాజేందర్ కేంద్రంలో సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారా..? హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల త్వరలోనే రాజీనామా చేయబోతున్నారా.. ఆయన స్థానంలో ఉప ఎన్నికలో హుజురాబాద్ అసెంబ్లీ బరిలో ఈటల రాజేందర్ భార్య జమున రంగంలోకి దిగబోతున్నారా..! ఇవీ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లో వినిపిస్తున్న గetela-rajendar;view;kcr;jamuna;bharatiya janata party;eatala rajendar;telangana;g kishan reddy;congress;రాజీనామా;television;assembly;minister;wife;central government;etela rajender;party;huzurabad;reddyకేంద్ర మంత్రిగా ఈటల? : బీజేపీ బంపర్ ఆఫర్..!?కేంద్ర మంత్రిగా ఈటల? : బీజేపీ బంపర్ ఆఫర్..!?etela-rajendar;view;kcr;jamuna;bharatiya janata party;eatala rajendar;telangana;g kishan reddy;congress;రాజీనామా;television;assembly;minister;wife;central government;etela rajender;party;huzurabad;reddyTue, 25 May 2021 23:00:00 GMTఈటల రాజేందర్ త్వరలో బీజేపీలో చేరబోతున్నారా.. ఆయనకు బీజేపీ అధిష్టానం ఏకంగా కేంద్ర మంత్రి పదవే ఆఫర్ గా ఇచ్చిందా.. ఈటలను బీజేపీలోకి చేర్చుకుని.. రాజ్యసభకు పంపేందుకు బీజేపీ వ్యూహం సిద్ధం చేస్తోందా.. బీజేపీలోకి రాగానే ఈటల రాజేందర్ కేంద్రంలో సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారా..? హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల త్వరలోనే రాజీనామా చేయబోతున్నారా.. ఆయన స్థానంలో ఉప ఎన్నికలో హుజురాబాద్ అసెంబ్లీ బరిలో ఈటల రాజేందర్ భార్య జమున రంగంలోకి దిగబోతున్నారా..!

ఇవీ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లో వినిపిస్తున్న గుసగుసలు.. ఈటల రాజేందర్ కు ఇంక టీఆర్ఎస్‌లో స్థానం లేదు. ఆయన పార్టీ మారడమో.. పార్టీ పెట్టడమో తప్ప వేరే ఆప్షన్ లేదు. సొంత పార్టీ పెట్టి నెగ్గుకురాగలమా.. లేదా.. ఇప్పటికే ఉన్న జాతీయ పార్టీల్లో చేరడమా అన్న ఆప్షన్‌ను కూడా ఈటల సీరియస్‌గా పరిశీలిస్తున్నారు. ఆయన ఇప్పటికే అనేక పార్టీల పెద్దలతో చర్చలు జరిపారు. ఇలాంటి సమయంలో ఆయన ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోనూ చర్చించారని.. బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైందని.. జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు అన్ని టీవీ ఛానళ్లు ఉదయం నుంచి బ్రేకింగులు వేసి వేసి అలసిపోయాయి.

ఇక సాయంత్రం.. ఈ విషయంపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన తాను ఇప్పటి వరకూ ఈటలను కలవలేదని చెప్పినా.. కలిస్తే మాత్రం తప్పేంటి అని ప్రశ్నించడం విశేషం. 15 ఏళ్లు కలిసి పని చేశామని.. అలాంటప్పడు ఈటలతో చర్చిస్తే తప్పేంటని కిషన్ రెడ్డి ఎదురు ప్రశ్నించారు. అయితే ఈటలతో పాటు కొందరు కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలోకి వెళ్తున్నట్టు ప్రచారం సాగుతోంది. తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక వర్గాలను ఏకం చేయడం ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవాలన్న ఆలోచన బీజేపీకి ఉంది.

ఇప్పడు ఈటల వంటి నాయకుడు బీజేపీలోకి వస్తే.. ఆ ఊపు వేరేగా ఉంటుంది. ఈటల తెలంగాణ ఉద్యమ నాయకుడు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అనేకమంది ఉద్యమ నాయకులను దూరం చేసుకున్నారు. అలాంటి వారినందరినీ ఏకం చేసే అవకాశం ఈటల ద్వారా బీజేపీకి లభిస్తుంది. మరి ఈ ప్రచారం నిజమే అయితే తెలంగాణలో రాజకీయం యమా రంజుగా ఉండటం మాత్రం ఖాయం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బన్నీ కోసం అడ్వాన్స్ ..... భద్ర కోసం డిస్కషన్స్ ..... ??

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>