MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/tdp-mla-98da0ffd-dd6a-4585-81c4-f94b3691523c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/tdp-mla-98da0ffd-dd6a-4585-81c4-f94b3691523c-415x250-IndiaHerald.jpg2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో జంప్ చేసిన ఎమ్మెల్యేలకు చెక్ పడిపోయింది. కానీ ఒక్క గొట్టిపాటి రవికుమార్ మాత్రం జగన్ వేవ్‌ తట్టుకుని మరోసారి అద్దంకి నియోజకవర్గంలో విజయం సాధించారు. మామూలుగానే అద్దంకి తెలుగుదేశం పార్టీకి పట్టున్న నియోజకవర్గం. ఆ పార్టీ ఆవిర్భావించిన దగ్గర నుంచి...అంటే 1983 నుంచి 2004 వరకు ఆరుసార్లు ఎన్నికలు జరిగితే అయిదుసార్లు టీడీపీ విజయం సాధించగా, ఒక్కసారి కాంగ్రెస్ గెలిచింది.tdp mla;naga chaitanya;nithya new;jagan;congress;karanam balarama krishna murthy;2019;telugu;k s ravikumar;mla;air;cheque;tdp;karanam balaram krishna murthy;chirala;ycp;gottipati ravi kumar;chaitanya 1;addanki;partyహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: గొట్టిపాటి బలం తగ్గలేదా?హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: గొట్టిపాటి బలం తగ్గలేదా?tdp mla;naga chaitanya;nithya new;jagan;congress;karanam balarama krishna murthy;2019;telugu;k s ravikumar;mla;air;cheque;tdp;karanam balaram krishna murthy;chirala;ycp;gottipati ravi kumar;chaitanya 1;addanki;partyTue, 25 May 2021 05:00:00 GMT2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో జంప్ చేసిన ఎమ్మెల్యేలకు చెక్ పడిపోయింది. కానీ ఒక్క గొట్టిపాటి రవికుమార్ మాత్రం జగన్ వేవ్‌ తట్టుకుని మరోసారి అద్దంకి నియోజకవర్గంలో విజయం సాధించారు. మామూలుగానే అద్దంకి తెలుగుదేశం పార్టీకి పట్టున్న నియోజకవర్గం. ఆ పార్టీ ఆవిర్భావించిన దగ్గర నుంచి...అంటే 1983 నుంచి 2004 వరకు ఆరుసార్లు ఎన్నికలు జరిగితే అయిదుసార్లు టీడీపీ విజయం సాధించగా, ఒక్కసారి కాంగ్రెస్ గెలిచింది.


అయితే 2009 ఎన్నికల నుంచి అద్దంకి కాస్త గొట్టిపాటి రవికుమార్ అడ్డాగా మారిపోయిందనే చెప్పుకోవచ్చు. 2009లో కాంగ్రెస్ నుంచి తొలిసారి బరిలో దిగిన గొట్టిపాటి..అప్పుడు టీడీపీ అభ్యర్ధి కరణం బలరాంపై విజయం సాధించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగవడంతో వైసీపీలోకి వచ్చి, 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా బరిలో దిగి టీడీపీ నుంచి పోటీ చేసిన కరణం తనయుడు వెంకటేష్‌పై స్వల్ప మెజారిటీతో గెలిచారు.


అయితే అధికారం టీడీపీకి దక్కడంతో ఆయన పసుపు కండువా కప్పేసుకున్నారు. పార్టీలోకి వచ్చిన కొన్నాళ్లు కరణం ఫ్యామిలీతో విభేదాలు అలాగే కొనసాగిన, 2019 ఎన్నికల్లో కరణం బలరాంకు చీరాల టికెట్ ఇవ్వడంతో, గొట్టిపాటికి ఇబ్బందులు తప్పాయి. 2019 ఎన్నికల్లో కూడా అద్దంకి నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచారు.


రాష్ట్రమంతా జగన్ గాలి ఉన్న, తనతో పాటు పార్టీ మారిన వారు ఓడిపోయిన, గొట్టిపాటి మాత్రం గెలుపు గుర్రం ఎక్కగలిగారు. అయితే ఈసారి అధికారం వైసీపీ చేతుల్లోకి వెళ్లడంతో గొట్టిపాటికి ఇబ్బందులు మొదలయ్యాయి. ఆయన్ని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలే జరిగాయని వార్తలు కూడా వచ్చాయి. పైగా ఆయన గ్రానైట్ వ్యాపారంపై విజిలెన్స్ దాడులు జరగడంతో, పార్టీ మారడం ఖాయమైపోయిందని ప్రచారం జరిగింది.


ఎంత ప్రచారం జరిగిన గొట్టిపాటి మాత్రం టీడీపీని వీడలేదు. అవన్నీ వదిలేసి నియోజకవర్గంలో పనులు చేసుకుంటున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నిధులు అందకపోయిన, నిత్యం జనాలకు అందుబాటులో ఉంటున్నారు. అయితే గొట్టిపాటి అధికార వైసీపీ మీద అసలు విమర్శలు చేసిన సందర్భాలు లేవు. ఏం మాట్లాడితే, ఏం చిక్కులు వస్తాయనో ఏమో గానీ సైలెంట్ గానే ఉంటున్నారు.


ఇక ఇక్కడ వైసీపీ తరుపున బాచిన చైతన్య పనిచేస్తున్నారు. గొట్టిపాటిని ఢీకొడుతూ చైతన్య అద్దంకిలో వైసీపీని బలోపేతం చేస్తున్నారు. ఇటీవల పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. అటు అద్దంకి మున్సిపాలిటీలో కూడా వైసీపీ జెండా ఎగిరింది. అయితే అధికారంలో ఉండటం వల్లే వైసీపీ ఈ స్థాయిలో విజయం సాధించగలిగిందని చెప్పొచ్చు. ప్రతిపక్షంలో ఉన్నా సరే గొట్టిపాటి వైసీపీకి ధీటుగా టీడీపీని నిలబెట్టారు.


అసలు పోటీలో ఉండటమే కష్టం అనుకుంటే, పంచాయితీ, అద్దంకి మున్సిపాలిటీలో అభ్యర్ధులని నిలబెట్టారు. అలాగే చెప్పుకోదగిన విధంగా పంచాయితీలు గెలిపించారు. అటు అద్దంకి మున్సిపాలిటీలో 19 వార్డులు ఉంటే, వైసీపీ 13 గెలుచుకోగా, టీడీపీ 6 గెలుచుకుంది. అయితే అంతటి వైసీపీ వేవ్‌లో 6 వార్డులు గెలుచుకోవడం మామూలు విషయం కాదు. ఏదేమైనా అద్దంకిలో గొట్టిపాటి కాస్త బలంగానే ఉన్నారని చెప్పొచ్చు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

‘ఆర్ఆర్ఆర్‌’ మ‌ల్టీస్టార‌ర్ స్వ‌ర్ణ‌యుగం మ‌ళ్లీ తేనుందా...?

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>