PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/second-dose-in-telanganad24135c2-3b62-4dc7-b478-d4f2c32b6d72-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/second-dose-in-telanganad24135c2-3b62-4dc7-b478-d4f2c32b6d72-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కరోనా చర్యలు మరింత వేగవంతం చేస్తూ రాష్ట్రంలో వైరస్ తీవ్రతను తగ్గించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. నిన్న అనగా మే 24 సోమవారం నాడు రాష్ట్రంలో కరోనా తీవ్రత, రానున్న రోజుల్లో వైరస్ ప్రభావం మరియు వ్యాక్సినేషన్ తో కరోనా ను అరికట్టడానికి చర్యలు ఇలా పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు తెలంగాణ సీఎం కేసిఆర్. SECOND DOSE IN TELANGANA;kcr;harish;telangana;chief minister;survey;minister;t harish raoసెకండ్ డోస్ వ్యాక్సిన్ పై కేసీఆర్ కీలక ఆదేశాలు ?సెకండ్ డోస్ వ్యాక్సిన్ పై కేసీఆర్ కీలక ఆదేశాలు ?SECOND DOSE IN TELANGANA;kcr;harish;telangana;chief minister;survey;minister;t harish raoTue, 25 May 2021 09:00:00 GMTతెలంగాణలో కరోనా చర్యలు మరింత వేగవంతం చేస్తూ రాష్ట్రంలో వైరస్ తీవ్రతను తగ్గించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. నిన్న అనగా మే 24 సోమవారం నాడు రాష్ట్రంలో కరోనా తీవ్రత, రానున్న రోజుల్లో వైరస్  ప్రభావం మరియు వ్యాక్సినేషన్ తో కరోనాను అరికట్టడానికి చర్యలు ఇలా పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు తెలంగాణ సీఎం కేసిఆర్.  ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితి గురించి తెలుసుకున్న సీఎం పలు అంశాలపై దృష్టి సారించి  కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని సూచించారు. అదే విధంగా ఫీవర్ సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందచేసే విధానం ఇంకా జోరుగా కొనసాగించాలన్నారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై పలు కీలక అంశాలను సూచించారు. 

ఈ రోజు మంగళవారం నుండి రెండవ డోస్ వ్యాక్సినేషన్  కార్యక్రమం ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికీ మొదటి డోస్ తీసుకున్నవారు ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి తప్పకుండా రెండవ డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని  పేర్కొన్నారు. అలాగే ఎంతో కీలకమైన సూపర్ స్ప్రెడర్లను వీలైనంత త్వరగా గుర్తించి  వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించాలని, వెంటనే ఆచరణలోకి తీసుకురావాలని    మంత్రి హరీష్ రావుకు అదే విధంగా వైద్యారోగ్యశాఖ అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి. 

వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద కరోనా నిబందనలు పాటించేలా, అదే విధంగా వ్యాక్సినేషన్ తీసుకున్న వారిని అబ్జర్వేషన్ లో ఉంచడం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రెండవ డోస్ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అవసరమైతే అవగాహన చర్యలు చేపట్టలన్నారు. రాష్ట్రంలో వీలైనంత త్వరగా కరోనా తగ్గు ముఖం పట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో ఇంకాస్త జాగ్రత్త వహించాలన్నారు. అలాగే రాష్ట్రంలో లాక్ డౌన్ పరిస్థితి గురించి తెలుసుకున్నారు సీఎం. ఇప్పటికే రెండు రోజుల నుండి తెలంగాణలో లాక్ డౌన్ ను కఠినంగా ఆచరిస్తున్న విషయం తెలిసిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఓ బేబీ సినిమాతో మరో రికార్డు క్రియేట్ చేసిన నందిని..!

సినిమాలకు చంద్రమోహన్ గుడ్ బై ..కారణం ఇదే.. !

బ్లాక్ ఫంగస్ కలకలం.. ఒకే రోజు అన్ని కేసులా?

ఆ హీరో కూతురిని పెళ్లి చేసుకోవాలంటే ఈ కండిషన్ తప్పనిసరి..?

ఏంది సామి ఇది : 555 విద్యార్ధుల పట్టివేత ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీనే కాదు జనాలను కూడా విజయసాయి భలే టెన్షన్లో పెట్టేశారే ?

దమ్ముంటే అలా చేయండి.. ఏబీఎన్ ఆర్కేకు ప్రొ. కె.నాగేశ్వర్ సవాల్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>