PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp6d42c106-4ffd-41e5-a370-3beea123a56c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp6d42c106-4ffd-41e5-a370-3beea123a56c-415x250-IndiaHerald.jpgఏపీలో చాలామంది టీడీపీ నాయకులు రాజకీయాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదనే సంగతి తెల్సిందే. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పలువురు నాయకులు టీడీపీని వదిలేసి, వైసీపీలోకి జంప్ కొట్టేశారు. ఇక మరికొందరు నాయకులు జగన్ ప్రభుత్వం దెబ్బకు పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం లేదు. గత రెండేళ్ల నుంచి పార్టీ తరుపున నాయకులు పోరాడిన సందర్భాలు లేవు. అలాగే పలు నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేయడం లేదు.tdp;prabhakar;shyam;jagan;andhra pradesh;2019;deputy chief minister;government;k e krishnamurthy;chintamaneni prabhakar;cm;cycle;pattikonda;parakala prabhakar;party;tdpకేఈ ఫ్యామిలీ సైకిల్ తొక్కేదెప్పుడు?కేఈ ఫ్యామిలీ సైకిల్ తొక్కేదెప్పుడు?tdp;prabhakar;shyam;jagan;andhra pradesh;2019;deputy chief minister;government;k e krishnamurthy;chintamaneni prabhakar;cm;cycle;pattikonda;parakala prabhakar;party;tdpTue, 25 May 2021 15:00:00 GMTఏపీలో చాలామంది టీడీపీ నాయకులు రాజకీయాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదనే సంగతి తెల్సిందే. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పలువురు నాయకులు టీడీపీని వదిలేసి, వైసీపీలోకి జంప్ కొట్టేశారు. ఇక మరికొందరు నాయకులు జగన్ ప్రభుత్వం దెబ్బకు పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం లేదు. గత రెండేళ్ల నుంచి పార్టీ తరుపున నాయకులు పోరాడిన సందర్భాలు లేవు. అలాగే పలు నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేయడం లేదు.


అలా ఎన్నికలైన దగ్గర నుంచి సైలెంట్ అయిపోయిన నాయకుల్లో కే‌ఈ కృష్ణమూర్తి కూడా ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో కే‌ఈ చాలా సీనియర్ నాయకుడు. దశాబ్దాల పాటు టీడీపీకి సేవలు అందిస్తున్న కృషమూర్తి, గత చంద్రబాబు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అయితే వయసు మీద పడటంతో 2019 ఎన్నికల్లో పోటీలో దిగకుండా తన తనయుడు శ్యామ్‌ని పోటీలో దించారు. పత్తికొండలో పోటీ చేసిన శ్యామ్ జగన్ వేవ్‌లో ఘోరంగా ఓడిపోయారు.


అటు కే‌ఈ సోదరుడు ప్రతాప్ సైతం డోన్ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఇలా ఓడిపోయిన తర్వాత కే‌ఈ ఫ్యామిలీ రాజకీయాల్లో యాక్టివ్‌గా లేకుండా పోయింది. అదే సమయంలో కే‌ఈ మరో సోదరుడు ప్రభాకర్ సైతం టీడీపీకి దూరం జరిగారు. ఎమ్మెల్సీగా ఉన్న ప్రభాకర్ పార్టీకి కొన్ని రోజులు దూరమయ్యారు. అయితే కే‌ఈ ఫ్యామిలీపై వరుసగా కేసులు వచ్చి పడుతుండటంతో, డోన్ బాధ్యతల నుంచి ప్రతాప్ తప్పుకున్నారు. ఇదే సమయంలో ప్రభాకర్‌కు డోన్ బాధ్యతలు అప్పగించారు.


ఇటు పత్తికొండ ఇన్‌చార్జ్‌గా శ్యామ్ ఉన్నారు. అయితే పేరుకే ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు గానీ, పూర్తి స్థాయిలో పార్టీనీ నిలబెట్టే ప్రయత్నాలు చేయడం లేదు. ఇంతవరకు నియోజకవర్గాల్లో పెద్దగా కనిపించిన సందర్భాలు కూడా లేవు. అటు కృష్ణమూర్తి సైతం వయసు మీద పడటంతో ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతానికైతే కర్నూలు జిల్లాలో కే‌ఈ ఫ్యామిలీ సైలెంట్‌గా ఉంది. మరి కే‌ఈ ఫ్యామిలీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యి ఎప్పుడు సైకిల్ తొక్కుతారో చూడాలి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మూడు రోజుల పాటు లాక్ డౌన్ కఠినం

3 సంవత్సరాలుగా మూలుగుతున్న 4 మల్టీస్టారర్లు ఇవే ... ?

చిరంజీవి సర్జ కొడుకు ఎంత క్యూట్ గా ఉన్నాడో చూసారా?

పెళ్లి పీటలు ఎక్కనున్న టాలీవుడ్ హీరోయిన్స్

సీనియర్ నటి జయసుధ ఏకంగా 27 సినిమాలు ఆయన దర్శకత్వంలోనే చేసిందట.!

కేజిఎఫ్ 2 లో రావు రమేష్ పాత్ర ఇదే...!

మాటల మాంత్రికుడు, పూజ హెగ్డే ల కాంబో అందుకే సూపర్ సక్సెస్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>