MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/directors-heroines-combination-8a26e898-f630-4c9d-acb3-cc6f86552006-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/directors-heroines-combination-8a26e898-f630-4c9d-acb3-cc6f86552006-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమాచరిత్రలో జంధ్యాల తన సినిమాలతో ఒక చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు. హాస్య ప్రధానమైన చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచారు జంధ్యాల. ఆయన చేసిన సినిమాల్లో ఎక్కువగా హాస్య ప్రధానమైన చిత్రాలే చేయగా అందులో హాస్యంతో పాటు కథ కూడా మిళితమై ఉంటుంది. ఈ విధంగా కూడా సినిమాలు చేయొచ్చా అన్న రీతిలో సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టడం ఒక జంధ్యాలకు మాత్రమే సొంతం. ఆ రోజుల్లో జంధ్యాల సినిమా వస్తుంది అంటే చాలు పొట్టచెక్కలయ్యేలా నవ్వొచ్చు అన్న భావన ప్రేక్షకుల్లో నెలకొనేది. ఇప్పటికీ ఆయన చేసిన సినిమాలు టీవీలలో వచ్directors-heroines-combination;naresh;allari naresh;bhavana;poornima;prema;purnima;industries;cinema;history;love;industry;heroine;jandhyala ravishankarజంధ్యాల దర్శకత్వంలో అన్ని సినిమాలు చేసే అవకాశం కొట్టేసిన పూర్ణిమ..!!జంధ్యాల దర్శకత్వంలో అన్ని సినిమాలు చేసే అవకాశం కొట్టేసిన పూర్ణిమ..!!directors-heroines-combination;naresh;allari naresh;bhavana;poornima;prema;purnima;industries;cinema;history;love;industry;heroine;jandhyala ravishankarTue, 25 May 2021 11:00:00 GMTతెలుగు సినిమాచరిత్రలో జంధ్యాల తన సినిమాలతో ఒక చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు. హాస్య ప్రధానమైన చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచారు జంధ్యాల. ఆయన చేసిన సినిమాల్లో ఎక్కువగా హాస్య ప్రధానమైన చిత్రాలే చేయగా అందులో హాస్యంతో పాటు కథ కూడా మిళితమై ఉంటుంది. ఈ విధంగా కూడా సినిమాలు చేయొచ్చా అన్న రీతిలో సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టడం ఒక జంధ్యాలకు మాత్రమే సొంతం. ఆ రోజుల్లో జంధ్యాల సినిమా వస్తుంది అంటే చాలు పొట్టచెక్కలయ్యేలా నవ్వొచ్చు అన్న భావన ప్రేక్షకుల్లో నెలకొనేది. ఇప్పటికీ ఆయన చేసిన సినిమాలు టీవీలలో వచ్చే సమయంలో ఇంట్లో అందరూ నవ్వుతూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం.

హాస్యం అంటేనే ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్. కాబట్టి జంధ్యాల సినిమాలు ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని తరాలు దాటినా చూసే విధంగానే ఉంటాయి తప్పా, బోర్ కొట్టే విధంగా అస్సలు ఉండవు. జంధ్యాల అప్పటి తరం హీరోలతో రిపీటెడ్ గా సినిమాలు చేసేవారు అలాగే హీరోయిన్లను కూడా కొన్ని సినిమాలకి రిపీట్ చేసారు. అలాంటి హీరోయిన్లలో పూర్ణిమ జంధ్యాలతో ఏకంగా నాలుగు సినిమాలు చేసి ఏ హీరోయిన్ కి దక్కని అదృష్టం కొట్టేసింది. నటిగా పూర్ణిమ తెలుగు సినిమా పరిశ్రమలో మంచి స్థానాన్ని ఏర్పరచుకోగా ఆమె జంధ్యాల సినిమాల్లో నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది.

అలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా ముద్దమందారం. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా అయినా ఇది బాక్సాఫీసు వద్ద నవ్వుల-పువ్వులు పూయించింది. ఆ తర్వాత వీరి కలయికలో వచ్చిన నాలుగు స్తంభాలాట సినిమా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది అని చెప్పొచ్చు. పుత్తడి బొమ్మ సినిమా యావరేజ్ గా నిలవగా తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పటికీ చెప్పుకునే సినిమా శ్రీవారికి ప్రేమలేఖ. నరేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో పూర్ణిమ గొప్ప నటనను ప్రదర్శించి సినిమా హిట్ అవడానికి ముఖ్య కారణంగా నిలిచింది. జంధ్యాల కలం నుంచి వచ్చిన సరికొత్త ప్రేమ కావ్యం లో పూర్ణిమా ఏకంగా జీవించింది అని చెప్పవచ్చు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మేనబావతో ప్రేమ.. పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. చివరికి..?

రమ్య కృష్ణను గోల్డెన్‌ లెగ్‌గా మార్చిన దర్శకేంద్రుడు.. వీరిద్దరు చేసిన సినిమాలెన్నంటే..

మరోసారి వార్ కు సిద్ధం అవుతున్న బాలకృష్ణ చిరంజీవి !

సౌందర్య సినీ జీవితాన్ని మలుపుతిప్పిన రామకృష్ణ..!

గూగుల్ లో వినిపించే ఆ కమ్మని గొంతు మన తెలుగు అమ్మాయిదే

రామ్ చరణ్ ఫ్యాన్స్ నిజంగా గ్రేటబ్బా ..!!

ఓ బేబీ సినిమాతో మరో రికార్డు క్రియేట్ చేసిన నందిని..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>