PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dgca-spice-jetb8805685-4251-4be1-8bd5-ec345cca75fa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dgca-spice-jetb8805685-4251-4be1-8bd5-ec345cca75fa-415x250-IndiaHerald.jpgత‌మిళ‌నాడులోని మ‌ధురైకి చెందిన రాకేశ్‌, ద‌క్షిణ వివాహాన్ని విమానంలో చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో స్పైస్‌జెట్ కు చెందిన చార్డెడ్‌ విమానాన్ని అద్దెకు తీసుకొని 161 మంది బంధువుల‌తో మ‌ధురై నుంచి బెంగ‌ళూరుకు బ‌య‌ల్దేరారు. విమానంలోనే వ‌ధూవ‌రులు వివాహం చేసుకున్నారు. గాల్లోనే మాంగ‌ళ్య‌ధార‌ణ జ‌రిగింది. ఫోటోల‌కు ఫోజులిస్తూ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఎవ‌రూ క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని వీటిచి చూస్తే అర్థ‌మ‌వుతోంది. క‌నీసం మాస్క్‌లు కూడా పెట్టుకోలేదు. దీనిపై డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవdgca, spice jetస్పైస్ జెట్‌పై డీజీసీఏ ఆగ్ర‌హం?స్పైస్ జెట్‌పై డీజీసీఏ ఆగ్ర‌హం?dgca, spice jetTue, 25 May 2021 16:58:54 GMT
త‌మిళ‌నాడులోని మ‌ధురైకి చెందిన రాకేశ్‌, ద‌క్షిణ వివాహాన్ని విమానంలో చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో స్పైస్‌జెట్ కు చెందిన చార్డెడ్‌ విమానాన్ని అద్దెకు తీసుకొని  161 మంది బంధువుల‌తో మ‌ధురై నుంచి బెంగ‌ళూరుకు బ‌య‌ల్దేరారు.  విమానంలోనే వ‌ధూవ‌రులు వివాహం చేసుకున్నారు. గాల్లోనే మాంగ‌ళ్య‌ధార‌ణ జ‌రిగింది. ఫోటోల‌కు ఫోజులిస్తూ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఎవ‌రూ క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని వీటిచి చూస్తే అర్థ‌మ‌వుతోంది. క‌నీసం మాస్క్‌లు కూడా పెట్టుకోలేదు. దీనిపై డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. విమానం స‌మ‌కూర్చిన స్పైస్ జెట్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతోపాటు ఆ విమాన సిబ్బందిని స‌స్పెండ్ చేసి సంస్థ‌పై కేసు న‌మోదుకు ఆదేశాలు జారీచేసింది.

చ‌ర్య‌ల‌కు సిద్ధం?
నిన్న మ‌ధురై నుంచి బెంగ‌ళూరు వెళ్లేందుకు స్పైస్‌జెట్ చార్టెడ్ విమానాన్ని బుక్ చేసుకున్నార‌ని, కానీ ఆ విమానంలో వివాహం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్న‌ట్లు త‌మ‌కు తెలియ‌ద‌ని ఈ వ్య‌వ‌హారంపై మ‌ధురై ఎయిర్‌పోర్టు డైరెక్ట‌ర్ ఎస్ సెంథిల్ వ‌ల‌వ‌న్ తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై స్పైస్ జెట్ సంస్థ స్పందించింది. వివాహ వేడుక కోసం ట్రావెల్ ఏజెంట్ ద్వారా త‌మ సంస్థ బోయింగ్ 737 విమానాన్ని బుక్ చేసుకున్నార‌ని, ఎవ‌రైతే బుక్ చేసుకున్నారో వారికి కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని స్ప‌ష్టంగా చెప్పామ‌ని తెలిపింది. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే అనుమ‌తివ్వ‌మ‌ని కూడా చెప్పామ‌ని, అయినా వారు కొవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని,  నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్పైస్ జెట్ ప్ర‌క‌టించింది.

వెల్లువెత్తిన విమ‌ర్శ‌లు!
విమానంలో వివాహ‌నం చేసుకున్న సంఘ‌ట‌న‌కు సంబంధించి దేశం న‌లుమూల‌ల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కొవిడ్ ఉధృతంగా వ్యాపిస్తోన్న త‌రుణంలో ఇది ఎలా జ‌రిగింది? అనేదానిపై డీజీసీఏ పూర్తి ద‌ర్యాప్తున‌కు ఆదేశించింది. క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకొని నెగెటివ్ స‌ర్టిఫికెట్ చూపిస్తేనే వారంద‌రినీ విమానంలోకి అనుమ‌తించామ‌ని స్సైస్ జెట్ అధికారులు నిన్న ప్ర‌క‌టించారు. మ‌రి ఒక్క‌రోజులేనే డీజీసీఏ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో వివాహం జ‌రుగుతుంద‌నే విష‌యం త‌మ‌కు తెలియ‌ద‌ని ప్ర‌క‌టించింది. విమానం బుక్ చేసుకున్న‌వారిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నామ‌ని చెబుతోంది.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సుప్రీం కోర్ట్ తో యుద్దానికి వెళ్ళినట్టే ఉంటుంది...?

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి

స్టూడెంట్‌గానే ప్రెగ్నెంట్‌... ఆ సంచ‌ల‌న సినిమాకు 21 ఏళ్లు..!

విరాట్ కోహ్లీ మొదట ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా ?

3 సంవత్సరాలుగా మూలుగుతున్న 4 మల్టీస్టారర్లు ఇవే ... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>