LifeStyleSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/goden-temple-viral-viral-newsc8133710-28f5-49b2-a0ff-8775fe86b874-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/goden-temple-viral-viral-newsc8133710-28f5-49b2-a0ff-8775fe86b874-415x250-IndiaHerald.jpgబంగారం అంటే మ‌న‌కు కొన్నే గుర్తుకొస్తాయి. న‌గ‌లు, లేదా గోల్డ్ బిస్కెట్లు, ఇత‌ర ధ‌రించే వ‌స్తువులు మాత్ర‌మే మ‌నం ఇంత‌వ‌ర‌కు చూశాం క‌దా. ఇంకొంద‌రైతే వేసుకునే బ‌ట్ట‌ల‌ను కూడా బంగారంతో చేయించుకుంటున్నారు. కానీ ఇల్లును క‌ట్ట‌డం ఎప్పుడైనా చూశారా. నిజ‌మేనండి ఇల్లును కూడా బంగారు పూత‌తో క‌ట్టారు. ఒక‌టి కాదు చాలా ఉన్నాయి ఇలాంటివి. అవి ఎక్క‌డెక్క‌డ ఉన్నాయో చూద్దాం. క్యోటో అంటే ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుల‌కు భూత‌ల స్వ‌ర్గం. ఇక ఇక్క‌డ గోల్డెన్ పెవిలియన్ పేరుతో బంగారు పూత‌తో భ‌వ‌నం ఉంది. దీనిని 14వ శతాబ్ధపు యోధుడిgoden temple, viral, viral news;koti;amrutha;golden temple;gold;darbar;house;sree;sanyasamబంగారు పూత‌తో క‌ట్టిన భ‌వ‌నాలు ఇవే..!బంగారు పూత‌తో క‌ట్టిన భ‌వ‌నాలు ఇవే..!goden temple, viral, viral news;koti;amrutha;golden temple;gold;darbar;house;sree;sanyasamTue, 25 May 2021 18:00:00 GMTబంగారం అంటే మ‌న‌కు కొన్నే గుర్తుకొస్తాయి. న‌గ‌లు, లేదా గోల్డ్ బిస్కెట్లు, ఇత‌ర ధ‌రించే వ‌స్తువులు మాత్ర‌మే మ‌నం ఇంత‌వ‌ర‌కు చూశాం క‌దా. ఇంకొంద‌రైతే వేసుకునే బ‌ట్ట‌ల‌ను కూడా బంగారంతో చేయించుకుంటున్నారు. కానీ ఇల్లును క‌ట్ట‌డం ఎప్పుడైనా చూశారా. నిజ‌మేనండి ఇల్లును కూడా బంగారు పూత‌తో క‌ట్టారు. ఒక‌టి కాదు చాలా ఉన్నాయి ఇలాంటివి. అవి ఎక్క‌డెక్క‌డ ఉన్నాయో చూద్దాం.


క్యోటో అంటే ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుల‌కు భూత‌ల స్వ‌ర్గం. ఇక ఇక్క‌డ గోల్డెన్ పెవిలియన్ పేరుతో బంగారు పూత‌తో భ‌వ‌నం ఉంది. దీనిని 14వ శతాబ్ధపు యోధుడికి రిటైర్మెంట్ విల్లాగా వాడారు. దీనిని కింకకుజీ అని కూడా పిలుస్తారు. ఈ బిల్డింగ్ మొదటి రెండు అంతస్తులు బంగారు ఆకులతో కప్పబడి వెరైటీగా త‌యారు చేశారు. 1950 లో ఆలయ సన్యాసి చేత పైకప్పు కాలిపోయింది. దీంతో 1955 లో బంగారు పూత‌తో పైక‌ప్పును నిర్మించారు.  



ఇక మ‌న‌దేశంలో కూడా ఓ గోల్డ్ నిర్మాణం ఉంది. అమృత సర్ లోని గోల్డెన్ టెంపుల్.. ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన బంగారు నిర్మాణాలలో ఒకటి. ఈ ఆలయాన్ని శ్రీ దర్బార్ సాహిబ్ లేదా శ్రీ హర్మాండిర్ సాహిబ్ అని పేర్లు ఉన్నాయి. దీన్ని పూర్తిగా బంగారు పూత‌తో కప్పబడి అద్భుతంగా ఉంటుంది. ఈ ఆల‌యాన్ని సిక్కులు ఆధ్యాత్మికంగా కొలుస్తారు. ఈ ఆల‌యానికి ఉన్న ప్రతి తలుపుకు పైన ఉన్న గోపురాలను 2018 లో సుమారు 160 కిలోల బంగారంతో అలంకరించారు.


 
అలాగే థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లోని గ్రాండ్ ప్యాలెస్ ఒకటి. థాయ్ రాజ కుటుంబానికి సుమారు 150 సంవత్సరాలు ఇందులో నివసించింది. ఇవాళ ఇది ఒక పెద్ద క్రౌడ్ పుల్లర్. దీని గోడలు బంగారు పూత‌తో ఉంటాయి. అలాగే మయన్మార్‌లోని యాంగోన్‌లో శ్వేదాగన్ పగోడా. ఇది అందమైన మైలురాయి బంగారంతో కప్పబడి ఉంది. దీంతోపాటు ఇంకోటి డోమ్ ఆఫ్ ది రాక్, జెరూసలేం. డోమ్ ఆఫ్ ది రాక్ భ‌వ‌నం పూర్తిగా బంగారు పూతతో పైకప్పును క‌ప్పారు. ఇలా అనేక రకాల బంగారు భ‌వ‌నాలు ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తంపు తెచ్చుకున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"కృష్ణపట్నం ఆనందయ్య" పడుతున్న కష్టాలకు కారణమిదే ?

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>