PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jupudi-prabhakar-2e17c059-fb5f-4ebb-b116-792e984a5a24-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jupudi-prabhakar-2e17c059-fb5f-4ebb-b116-792e984a5a24-415x250-IndiaHerald.jpgజూపూడి ప్రభాకర్...ఏపీ రాజకీయాల్లో సుపరిచితమైన పేరు. ముఖ్యంగా జూపూడి పేరు చెబితే వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడు అని గుర్తొస్తుంది. కానీ జూపూడి ఆ విధేయతని పూర్తిగా నిలుపుకోలేదు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టిన జూపూడి, వైఎస్సార్‌కు బాగా సన్నిహితంగా ఉండేవారు. అయితే వైఎస్సార్ చనిపోయాక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉండేవారు. ఆయనకు ఎప్పుడు సపోర్ట్‌గా ఉండేవారు. చివరికి అక్రమాస్తుల కేసులో సి‌బి‌ఐ, జగన్‌ని అరెస్ట్ చేసేటప్పుడు కూడా జూపూడి, ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు.jupudi prabhakar;editor mohan;jeevitha rajaseskhar;prabhakar;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;2019;రాజీనామా;media;chintamaneni prabhakar;arrest;tdp;ycp;parakala prabhakar;kondapi;scheduled caste;scheduled tribesజూపూడి లైన్‌లోకి ఎప్పుడొస్తారో?జూపూడి లైన్‌లోకి ఎప్పుడొస్తారో?jupudi prabhakar;editor mohan;jeevitha rajaseskhar;prabhakar;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;2019;రాజీనామా;media;chintamaneni prabhakar;arrest;tdp;ycp;parakala prabhakar;kondapi;scheduled caste;scheduled tribesTue, 25 May 2021 01:00:00 GMTజూపూడి ప్రభాకర్...ఏపీ రాజకీయాల్లో సుపరిచితమైన పేరు. ముఖ్యంగా జూపూడి పేరు చెబితే వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడు అని గుర్తొస్తుంది. కానీ జూపూడి ఆ విధేయతని పూర్తిగా నిలుపుకోలేదు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టిన జూపూడి, వైఎస్సార్‌కు బాగా సన్నిహితంగా ఉండేవారు. అయితే వైఎస్సార్ చనిపోయాక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉండేవారు. ఆయనకు ఎప్పుడు సపోర్ట్‌గా ఉండేవారు. చివరికి అక్రమాస్తుల కేసులో సి‌బి‌ఐ, జగన్‌ని అరెస్ట్ చేసేటప్పుడు కూడా జూపూడి, ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు.


జగన్ జైలుకు వెళ్లినప్పుడు వైసీపీ కోసం గట్టిగానే కష్టపడారు. ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు టీడీపీలని ఎదురుకుని మీడియా డిబేట్లలో వైసీపీ తరుపున బలమైన వాయిస్ వినిపించారు. ఇక 2014 ఎన్నికల్లో జూపూడి కొండపి నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున పోటీ చేశారు. అయితే ఊహించని విధంగా జూపూడి ఓటమి పాలయ్యారు. అలాగే సొంతవాళ్లే తనని ఓడించారని అసంతృప్తి, మరోవైపు టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి జంప్ కొట్టేశారు.



టీడీపీలోకి వచ్చాక జూపూడికి ఎమ్మెల్సీ పదవి దక్కింది. అలాగే చంద్రబాబు, జూపూడిని ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ఛైర్మన్‌ని కూడా చేశారు. జూపూడి సైతం మీడియా డిబేట్లలో, సమావేశాల్లో టీడీపీ తరుపున బలమైన వాయిస్ వినిపించేవారు. ఇక 2019 ఎన్నికల్లో జూపూడికి ఏ సీటు రాలేదు. ఆ తర్వాత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం, వైసీపీ అధికారంలోకి రావడం జరిగిపోయాయి.


దీంతో జూపూడి కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దానికితోడు ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో జూపూడి మళ్ళీ వైసీపీ వైసీపీలోకి వచ్చేశారు. జగన్ సమక్షంలో వైసీపీ కడువా కప్పేసుకున్నారు. వైసీపీలో చేరాక జూపూడి రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. ఏదో రెండు, మూడు సందర్భాల్లో మీడియా ముందు కనిపించారు. అలాగే ఆయనకు వైసీపీలో ఎలాంటి పదవి రాలేదు. మరి చూడాలి జూపూడి వైసీపీలో ఎప్పుడు లైన్‌లోకి వస్తారో?





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?

బాలీవుడ్ బడా డైరెక్టర్ తో విభేదాల్లో ఉన్న హీరో హీరోయిన్లు వీరే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>