PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ap-jagan-ycp77a0367e-f19d-4a02-9faa-cf12d0e8c97e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ap-jagan-ycp77a0367e-f19d-4a02-9faa-cf12d0e8c97e-415x250-IndiaHerald.jpgఐఏఎస్ అయిన నీలం సాహ్నికి ఇంగ్లిషు నుంచి తెలుగుకు అనువాదం చేసుకునేంత స‌మ‌ర్థ‌త లేదా? అంటూ ఏపీ హైకోర్టు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌రు స‌మ‌ర్ధ‌త‌పై సందేహం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ త‌రుణంలో ఆమె నియామ‌కాన్ని స‌వాల్‌చేస్తూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయ‌వాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్ర‌భుత్వం కౌంట‌ర్ దాఖ‌లు చేసే విధానాన్నిబ‌ట్టే నీలంసాహ్ని ప‌ద‌వి ఉంటుందా? లేదా? అనేదap, jagan, ycp;andhra pradesh;district;high court;petitioner;march;mantra;teluguప్ర‌భుత్వంలో నీలంసాహ్నికి మ‌ద్ద‌తు లేదా?ప్ర‌భుత్వంలో నీలంసాహ్నికి మ‌ద్ద‌తు లేదా?ap, jagan, ycp;andhra pradesh;district;high court;petitioner;march;mantra;teluguTue, 25 May 2021 16:41:37 GMT
ఐఏఎస్ అయిన నీలం సాహ్నికి ఇంగ్లిషు నుంచి తెలుగుకు అనువాదం చేసుకునేంత స‌మ‌ర్థ‌త లేదా? అంటూ ఏపీ హైకోర్టు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌రు స‌మ‌ర్ధ‌త‌పై సందేహం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ త‌రుణంలో ఆమె నియామ‌కాన్ని స‌వాల్‌చేస్తూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయ‌వాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్ర‌భుత్వం కౌంట‌ర్ దాఖ‌లు చేసే విధానాన్నిబ‌ట్టే నీలంసాహ్ని ప‌ద‌వి ఉంటుందా?  లేదా? అనేది తేలిపోతుంది. ఒక‌ర‌కంగా ఇప్పుడు బంతి ప్ర‌భుత్వం చేతిలోనే ఉంది. నీలంసాహ్ని ఉండాల‌నుకుంటే ఆమెకు అనుకూలంగా కౌంట‌ర్ దాఖ‌లుచేయ‌వ‌చ్చు.. వ‌ద్ద‌నుకుంటే తూతూమంత్రంగా కూడా దాఖ‌లు చేయ‌వ‌చ్చు. ఐఏఎస్ ల నుంచి కూడా కోర్టు వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ ఇంత‌వ‌ర‌కు ఎటువంటి కౌంట‌ర్ దాఖ‌ల‌వ‌లేదు. దీన్నిబ‌ట్టి మాజీ చీఫ్ సెక్ర‌ట‌రీకి ఏపీ ఐఏఎస్ అధికారుల్లో ఎటువంటి మ‌ద్ద‌తు క‌న‌ప‌డ‌టంలేదంటూ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు  అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

ఆమె నియామ‌కాన్ని ర‌ద్దుచేయండి!
గత డిసెంబరు 31న సీఎస్‌గా పదవీ విరమణ చేయకముందే సీఎం ముఖ్యసలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.. కొద్ది కాలానికే 2021 మార్చి 28న ఎస్ఈసీగా నియమిస్తూ పంచాయతీరాజ్‌ శాఖ జీవో జారీచేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించింది. ఆర్టికల్ 243(కె) ప్రకారం నీలం సాహ్ని నియామకం రాజ్యాంగ విరుద్ధం.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని రద్దు చేస్తే ఆదేశాలు జారీచేయాలి.. వ్యాజ్యం పరిష్కారమయ్యేంతవరకు ఎస్‌ఈసీగా విధులు నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి’’ అని పిటిషనర్‌ కోరారు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల తీర్పులో కూడా హైకోర్టు విచారణను జూన్‌ 15కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు తీర్పును తమకు కావాల్సినట్టుగా ఏపీ ఎన్నికల కమిషన్ అన్వయించుకుందని.. చదవటం, అవగాహన చేతకాలేదని, ఇష్టం వచ్చినట్లుగా అన్వయించుకోవటం ఆమోదయోగ్యం కాదని ఏపీ హైకోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యంలో కూడా ఒక్క ఐఏఎస్ మాట్లాడ‌లేద‌ని, ప్ర‌భుత్వంలో ఏం జ‌రుగుతోంది? అనేదానిపై ఐఏఎస్‌ల‌కే స్ప‌ష్ట‌త లేన‌ట్లుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు అంటున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి

స్టూడెంట్‌గానే ప్రెగ్నెంట్‌... ఆ సంచ‌ల‌న సినిమాకు 21 ఏళ్లు..!

విరాట్ కోహ్లీ మొదట ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా ?

3 సంవత్సరాలుగా మూలుగుతున్న 4 మల్టీస్టారర్లు ఇవే ... ?

చిరంజీవి సర్జ కొడుకు ఎంత క్యూట్ గా ఉన్నాడో చూసారా?

పెళ్లి పీటలు ఎక్కనున్న టాలీవుడ్ హీరోయిన్స్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>