PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-tdp-bjp-f73748de-b366-488d-8c87-f778d33faec8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-tdp-bjp-f73748de-b366-488d-8c87-f778d33faec8-415x250-IndiaHerald.jpgవిజయవాడ తెలుగుదేశం పార్టీలో కొన్ని సమస్యలు ఎప్పటినుంచొ ఉంటూనే ఉన్నాయి .ఆ సమస్యల పరిష్కారానికి పార్టీ అధిష్టానం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే అవి మాత్రం పరిష్కారం అయ్యే పరిస్థితి కనబడటం లేదు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్న విజయవాడలో ఉన్న కొంతమంది నాయకులు మాత్రం ప్రజల్లోకి వెళ్లకుండా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ముందుకు వెళుతుంది తెలుగుదేశం పార్టీ bonda uma,tdp,ap;cbn;telugu desam party;bonda;vijayawada;telugu;mla;dookudu;partyబెజవాడ టీడీపీలో తన మార్క్ వేస్తున్న మాజీ ఎమ్మెల్యే...!బెజవాడ టీడీపీలో తన మార్క్ వేస్తున్న మాజీ ఎమ్మెల్యే...!bonda uma,tdp,ap;cbn;telugu desam party;bonda;vijayawada;telugu;mla;dookudu;partyTue, 25 May 2021 09:10:23 GMTవిజయవాడ తెలుగుదేశం పార్టీలో కొన్ని సమస్యలు ఎప్పటినుంచో ఉంటూనే ఉన్నాయి .ఆ సమస్యల పరిష్కారానికి పార్టీ అధిష్టానం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే అవి మాత్రం పరిష్కారం అయ్యే పరిస్థితి కనబడటం లేదు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్న విజయవాడలో ఉన్న కొంతమంది నాయకులు మాత్రం ప్రజల్లోకి వెళ్లకుండా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

అయితే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ముందుకు వెళుతుంది తెలుగుదేశం పార్టీ నాయకత్వం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న బోండా ఉమ ఇప్పుడు మాత్రం కాస్త ప్రజల్లోకి వెళ్లే విషయంలో దూకుడుగానే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు ఆస్పత్రుల గురించి అదేవిధంగా కరోనా గురించి అవగాహన కల్పించడమే కాకుండా ప్రజలకు అవసరమైన వాటిని కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా ఆయన విషయంలో కాస్త విమర్శలు వచ్చినా విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధాన కారణమనే ఆరోపణలు సరే బోండా ఉమ మాత్రం ఎక్కడా కూడా వెనక్కి తగ్గటం లేదు.

ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి కాస్త ఆందోళన కలిగిస్తుంది. తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి అన్ని విధాలుగా కూడా బోండా ఉమ అండగా నిలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యే నుంచి సహకారం లేకపోయినా సరే తన అనుచరుల ద్వారా తనకు సన్నిహితంగా ఉండే వారి ద్వారా ఆయన మాత్రం ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. రాజకీయంగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్తే మాత్రమే బలపడే అవకాశం ఉంటుంది. అందుకే బోండా ఉమా ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటున్నారు. మరి ఆయనకు ఇది ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఓ బేబీ సినిమాతో మరో రికార్డు క్రియేట్ చేసిన నందిని..!

సినిమాలకు చంద్రమోహన్ గుడ్ బై ..కారణం ఇదే.. !

బ్లాక్ ఫంగస్ కలకలం.. ఒకే రోజు అన్ని కేసులా?

ఆ హీరో కూతురిని పెళ్లి చేసుకోవాలంటే ఈ కండిషన్ తప్పనిసరి..?

ఏంది సామి ఇది : 555 విద్యార్ధుల పట్టివేత ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీనే కాదు జనాలను కూడా విజయసాయి భలే టెన్షన్లో పెట్టేశారే ?

దమ్ముంటే అలా చేయండి.. ఏబీఎన్ ఆర్కేకు ప్రొ. కె.నాగేశ్వర్ సవాల్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>