PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/nara-lokesh-8cc0f473-7d4b-4834-a4d6-572318770763-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/nara-lokesh-8cc0f473-7d4b-4834-a4d6-572318770763-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నారా లోకేష్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. తాజాగా ఆయన గుండెపోటుతో మరణించిన దళిత డాక్టర్ సుధాకర్ ఇంటికి పరామర్శకు వెళ్లిన సంగతి తెలిసిందే. కరోనా సమయంలో మాస్కులు కూడా ఇవ్వడం లేదంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ చేసిన డాక్టర్ సుధాకర్ ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం సస్పెండ్ కూడా కాబడి చివరికి కేసు సీబీఐ దర్యాప్తులో ఉండగానే కన్నుమూసిన పరిస్థితి అందరికీ తెలిసిందే. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికిlokesh;cbn;lokesh;editor mohan;vamsi;korcha;jagan;nara lokesh;andhra pradesh;chief minister;cbi;mla;minister;doctor;lokesh kanagaraj;party;tdp;telugu;telugu desam party;sudhakarబాబులో లేని లక్షణం కోసం తపిస్తున్న లోకేష్!బాబులో లేని లక్షణం కోసం తపిస్తున్న లోకేష్!lokesh;cbn;lokesh;editor mohan;vamsi;korcha;jagan;nara lokesh;andhra pradesh;chief minister;cbi;mla;minister;doctor;lokesh kanagaraj;party;tdp;telugu;telugu desam party;sudhakarTue, 25 May 2021 17:00:00 GMTఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నారా లోకేష్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. తాజాగా ఆయన గుండెపోటుతో మరణించిన దళిత డాక్టర్ సుధాకర్ ఇంటికి పరామర్శకు వెళ్లిన సంగతి తెలిసిందే. కరోనా సమయంలో మాస్కులు కూడా ఇవ్వడం లేదంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ చేసిన డాక్టర్ సుధాకర్ ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం సస్పెండ్ కూడా కాబడి చివరికి కేసు సీబీఐ దర్యాప్తులో ఉండగానే కన్నుమూసిన పరిస్థితి అందరికీ తెలిసిందే. 


ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన లోకేష్ సుధాకర్ తల్లి పక్కనే కూర్చుని ఆమె చేతిలో చేయి వేసి మరి అందరూ ఉన్నామని ధైర్యం చెప్పారు.. ఈ అంశమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి రాజకీయాల్లో ఉన్న వారికి ఈ హ్యూమన్ టచ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యమంత్రి జగన్ సైతం ఈ పాలసీని ఎక్కువగా ఫాలో అవుతుంటారు.. తన పాదయాత్రలో సైతం కనిపించిన వారిని పలకరిస్తూ వారితో కరచాలనం చేస్తూ, బుగ్గలు నిమురుతూ, తల నిమురుతూ ఆయన తాను మీ అందరివాడిని అనే సంకేతాలు ప్రజల్లోకి పంపగలిగారు. 


కానీ చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన ఇప్పుడు ఒక ఆఫీసర్ లాగానే వ్యవహరిస్తూ ఉంటారు. దూరంగా ఉంటూ, దూరం నుంచి మాట్లాడుతూ ఉంటారు. గతంలో పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్ సైతం ఈ ఆరోపణలు గుప్పించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇవి ఆరోపణలు అని టీడీపీ భావించినా అవన్నీ నిజాలే, అయితే కాదు చంద్రబాబు ఎందుకో కానీ అలా హ్యూమన్ టచ్ కి అలవాటు పడలేదు.


 ఇప్పుడు ఆయనలో లేని ఆ లక్షణం కోసం లోకేష్ తపిస్తున్నాడు.. ఖచ్చితంగా అది ఉంటే ప్రజల్లోకి పాజిటివ్ సంకేతాలు పంపినట్లు అవుతుందని భావిస్తూ వీలైనంతగా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లి వారితో మమేకం కావడానికి ప్రయత్నిస్తున్నాడు. దీంతో తెలుగుదేశం శ్రేణులు కాస్త ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఎలాగూ పార్టీ బాధ్యతలు చేపట్టేది లోకేష్ కాబట్టి ఆయన ఈ మేరకు పరిణితి పొందుతూ ఉండడం వారికి ఆనందం కలిగిస్తోంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సుప్రీం కోర్ట్ తో యుద్దానికి వెళ్ళినట్టే ఉంటుంది...?

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి

స్టూడెంట్‌గానే ప్రెగ్నెంట్‌... ఆ సంచ‌ల‌న సినిమాకు 21 ఏళ్లు..!

విరాట్ కోహ్లీ మొదట ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా ?

3 సంవత్సరాలుగా మూలుగుతున్న 4 మల్టీస్టారర్లు ఇవే ... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>