EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/krishnapatnam-anandayyab30b2851-4994-4235-bbba-9cafafbeff6d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/krishnapatnam-anandayyab30b2851-4994-4235-bbba-9cafafbeff6d-415x250-IndiaHerald.jpgకృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుపై వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. దీంతో మెయిన్ మీడియా కూడా దీనిపై ఫోకస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధాన టీవీ ఛానళ్లు, పత్రికలు కూడా ఆనందయ్య మందుపై మొదట్లో పాజిటివ్‌ గా ప్రచారం చేశాయి. ఆనందయ్య లాభాపేక్ష లేకుండా ఉచితంగా మందు ఇవ్వడం, తన మందులో ఏం వాడుతున్నదీ వివరంగా చెప్పడం.. వంటి కారణాలతో ఆయనకు మంచి పేరు వచ్చింది. అయితే క్రమంగా మెయిన్ మీడియా తీరు మారుతోంది. క్రమంగా ఆనందయ్య మందుపై దుష్ప్రచారం ప్రారంభించారు. ఆనందయ్య మందు వాడిkrishnapatnam-anandayya;media;television;ayurveda;master;racchaఆనందయ్య మందుపై దుష్ప్రచారం.. ఫార్మా మాఫియా కొనేసిందా..?ఆనందయ్య మందుపై దుష్ప్రచారం.. ఫార్మా మాఫియా కొనేసిందా..?krishnapatnam-anandayya;media;television;ayurveda;master;racchaTue, 25 May 2021 00:00:00 GMTకృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుపై వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. దీంతో మెయిన్ మీడియా కూడా దీనిపై ఫోకస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధాన టీవీ ఛానళ్లు, పత్రికలు కూడా ఆనందయ్య మందుపై మొదట్లో పాజిటివ్‌ గా ప్రచారం చేశాయి. ఆనందయ్య లాభాపేక్ష లేకుండా ఉచితంగా మందు ఇవ్వడం, తన మందులో ఏం వాడుతున్నదీ వివరంగా చెప్పడం.. వంటి కారణాలతో ఆయనకు మంచి పేరు వచ్చింది.

అయితే క్రమంగా మెయిన్ మీడియా తీరు మారుతోంది. క్రమంగా ఆనందయ్య మందుపై దుష్ప్రచారం ప్రారంభించారు. ఆనందయ్య మందు వాడిన ఓ హెడ్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఊదరగొట్టడం ప్రారంభించారు. ఆ తర్వాత అది కూడా అబద్దమని తేలింది. అయినా సరే.. ఆనందయ్య మందుపై దుష్ప్రచారం ఆగలేదు. ఓ ఛానల్ అయితే ఏకంగా ఆనందయ్యను ఓ బాబాగానో.. మంత్రగాడిగానో ఫోకస్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది.

ఈ ఛానళ్ల రచ్చ చూస్తుంటే.. వీళ్లంతా ఫార్మా మాఫియాకు అమ్ముడుపోయారన్న అనుమానాలు వస్తున్నాయి. ఆనందయ్య మందు ప్రభావం ఫార్మా రంగంపై విపరీతంగా ఉండే అవకాశం ఉంది. కరోనా పేరు చెప్పి మెడికల్ మాఫియా రెచ్చిపోతున్న విషయం చూస్తున్నాం. రోగుల ప్రాణ భయాన్ని క్యాష్ చేసుకుంటూ లక్షల్లో ఫీజులు దండుకుంటున్నారు. కీలకమైన ఇంజక్షన్‌ ఒక్కోటి 50వేలకు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఆనందయ్య మందు వల్ల మెడికల్, ఫార్మా మాఫియాల ఆటలకు అడ్డుకట్ట పడే ప్రమాదం ఉంది. అందుకే.. ఈ మాఫియాలను మీడియాను మేనేజ్‌ చేస్తున్నాయా అన్న అనుమానం వస్తోంది.

అందుకే ఉన్నట్టుండి కొన్ని ఛానళ్లు ఆనందయ్య మందుపై దుష్ప్రచారం చేస్తున్నట్టు వాదన వినిపిస్తోంది. మెరుగైన సమాజం కోసం అని చెప్పుకునే చానళ్లు మరి ఎవరి లాభం కోసం లాభాపేక్ష లేని ఆనందయ్యపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ నెటిజన్లు సైతం ఫైర్ అవుతున్నారు. ఆనందయ్య మందులో ఆరోగ్యానికి హాని చేసే ఎలాంటి పదార్థాలు లేవని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నా.. దానిపై దుష్ప్రచారం చేస్తున్నవారి వెనుక ఏ మాఫియాలు ఉన్నాయో.. ఆ ఛానళ్లకే ఎరుక.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈసారి ఆర్జీవీ కోపం దేవుడిపై.. ట్వీట్ వైరల్

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>