PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aims-comments-on-types-of-fungus99723893-da3d-41eb-b14d-7b32bd45d50b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aims-comments-on-types-of-fungus99723893-da3d-41eb-b14d-7b32bd45d50b-415x250-IndiaHerald.jpgఇప్పటికే దేశంలో కరోనా బీభత్సంతో ప్రజలు వణికిపోతుంటే మరోవైపు ఎల్లో ఫంగస్, వైట్ ఫంగస్ అంటూ పేర్లు పెట్టి ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా. వాస్తవానికి ఇవేమీ ప్రాణాంతకమైన ఫంగస్ లు కావని, ఫంగస్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగులో ఉంటుంది అని స్పష్టం చేశారు.AIMS COMMENTS ON TYPES OF FUNGUS;car;director;doctorఫంగస్ రకాల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన ఎయిమ్స్ ...ఫంగస్ రకాల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన ఎయిమ్స్ ...AIMS COMMENTS ON TYPES OF FUNGUS;car;director;doctorTue, 25 May 2021 11:00:00 GMTఇప్పటికే దేశంలో కరోనా బీభత్సంతో ప్రజలు వణికిపోతుంటే మరోవైపు ఎల్లో ఫంగస్,  వైట్ ఫంగస్ అంటూ పేర్లు పెట్టి ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా. వాస్తవానికి ఇవేమీ ప్రాణాంతకమైన ఫంగస్ లు కావని, ఫంగస్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగులో ఉంటుంది అని స్పష్టం చేశారు. అక్కడ  పరిస్థితులపై ఆ ఫంగస్ యొక్క రంగు ఆధారపడి ఉంటుందే తప్ప ఇవేవీ మరో కొత్త ఫంగస్ లు కాదు. కానీ ఎల్లో ఫంగస్, వైట్ ఫంగస్ అని రంగుల పేర్లతో వీటిని కొత్త ఫంగస్ లుగాచూపెట్టి ప్రజల్ని  భయపెడుతున్నారు అని గులేరియా దుయ్యబట్టారు. 

దీనిపై ప్రజలు ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటువ్యాధి కాదని ఆయన మరో సారి స్పష్టం చేశారు. వాస్తవానికి ఫంగల్ ఇన్ఫెక్షన్లు మూడు రకాలుగా ఉన్నాయని వివరించారు.  మొదటి రకం మ్యూకార్ మైకాసిస్ అని, రెండవ రకం  కాండిడా అని, ఇక మూడవ రకం  ఆస్పర్ జిల్లోసిస్ అని తెలియజేశారు. అయితే ప్రస్తుతం కరోనా నుండి కోలుకుంటున్న రోగులలో కనిపిస్తున్న ఫంగస్ మొదటి రకమైన మ్యూకార్ మైకాసిస్ అని చెప్పారు.

ఇక థర్డ్ వేవ్ గురించి ఇప్పటికే అతిభయకరమైన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని, మూడవ దశలో పిల్లలపై  కరోనా ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుదన్న
వార్తలను ఈయన ఖండించారు.  పీడియాట్రిక్స్ అసోసియేషన్  నివేదిక ప్రకారం వారు తెలియజేసింది ఏమిటంటే, థర్డ్ వేవ్ వచ్చినప్పటికీ ఈ దశలో పిల్లలపై కరోనా పెద్దగా ప్రభావం చూపబోదని వారు స్పష్టం చేశారు. కాబట్టి తల్లి తండ్రులు అసత్య ప్రచారాలు నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పిల్లల్లో ఏమైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించండి. పాజిటివ్ వస్తే డాక్టర్ ను సంప్రదించి దానికి తగిన చికిత్సను తీసుకోండి అని తల్లితండ్రులకు సలహా ఇచ్చారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మేనబావతో ప్రేమ.. పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. చివరికి..?

రమ్య కృష్ణను గోల్డెన్‌ లెగ్‌గా మార్చిన దర్శకేంద్రుడు.. వీరిద్దరు చేసిన సినిమాలెన్నంటే..

మరోసారి వార్ కు సిద్ధం అవుతున్న బాలకృష్ణ చిరంజీవి !

సౌందర్య సినీ జీవితాన్ని మలుపుతిప్పిన రామకృష్ణ..!

గూగుల్ లో వినిపించే ఆ కమ్మని గొంతు మన తెలుగు అమ్మాయిదే

రామ్ చరణ్ ఫ్యాన్స్ నిజంగా గ్రేటబ్బా ..!!

ఓ బేబీ సినిమాతో మరో రికార్డు క్రియేట్ చేసిన నందిని..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>