PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ramdev-babaf52ab294-cb73-4403-9116-d73df06d02e6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ramdev-babaf52ab294-cb73-4403-9116-d73df06d02e6-415x250-IndiaHerald.jpgవివాదాస్పద రాందేవ్ బాబా మరోసారి వార్తల్లోకెక్కారు. ఓ విషయంలో అనవసరంగా కెలుక్కుని సారీ చెప్పారు. తప్పయిపోయిందంటూ లెంపలేసుకున్నారు. ఇంతకీ అసలు రాందేవ్ బాబా ఏం అన్నారు.. మళ్లీ ఎందుకు తప్పయిపోయిందని లెంపలేసుకున్నారు చూద్దాం.. కరోనాకు ఇప్పుడు అల్లోపతి వైద్యంలోనే ఎక్కువగా చికిత్స జరుగుతోంది. అక్కడక్కడా ఆయుర్వేద వైద్యం కూడా అందుతోంది. ఆ మధ్య రాందేవ్ బాబా కూడా కరోనిల్ అంటూ ఓ మందును మార్కెట్లోకి తెచ్చినా.. ఆ తర్వాత దాన్ని నిషేధించారు. ఇప్పుడు రాందేవ్ బాబా అలోపతి వైద్యంపై ఘాటుగా కామెంట్లు చేశారు. అల్లోపramdev-baba;hari;hari music;ram madhav;baba bhaskar;minister;ayurveda;letter;central government;research and analysis wingసారీ.. లెంపలేసుకున్న రాందేవ్ బాబా.. ఎందుకంటే..?సారీ.. లెంపలేసుకున్న రాందేవ్ బాబా.. ఎందుకంటే..?ramdev-baba;hari;hari music;ram madhav;baba bhaskar;minister;ayurveda;letter;central government;research and analysis wingMon, 24 May 2021 09:00:00 GMTవివాదాస్పద రాందేవ్ బాబా మరోసారి వార్తల్లోకెక్కారు. ఓ విషయంలో అనవసరంగా కెలుక్కుని సారీ చెప్పారు. తప్పయిపోయిందంటూ లెంపలేసుకున్నారు. ఇంతకీ అసలు రాందేవ్ బాబా ఏం అన్నారు.. మళ్లీ ఎందుకు తప్పయిపోయిందని లెంపలేసుకున్నారు చూద్దాం.. కరోనాకు ఇప్పుడు అల్లోపతి వైద్యంలోనే ఎక్కువగా చికిత్స జరుగుతోంది. అక్కడక్కడా ఆయుర్వేద వైద్యం కూడా అందుతోంది. ఆ మధ్య రాందేవ్ బాబా కూడా కరోనిల్ అంటూ ఓ మందును మార్కెట్లోకి తెచ్చినా.. ఆ తర్వాత దాన్ని నిషేధించారు.

ఇప్పుడు రాందేవ్ బాబా అలోపతి వైద్యంపై ఘాటుగా కామెంట్లు చేశారు. అల్లోపతి పనికిమాలిన వైద్యం’.. దాంతో కరోనా బాగుకాదు.. అలోపతి వైద్యం రోగిని దివాలా తీయిస్తుంది.. అంటూ రాందేవ్‌ బాబా కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టాయి. దీంతో భారత వైద్యమండలి రాందేవ్ బాబాపై ఘాటుగా మండిపడింది. తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. దీంతో కేంద్ర మంత్రి హర్షవర్థన్ కూడా రాందేవ్ బాబాకు ఘాటుగా ఓ లేఖ రాశారు.

అల్లోపతి వైద్యం ఓ నాటకం.. దివాలా తీయిస్తుందంటూ మీరు చెప్పడం దురదృష్టకరం.. కరోనాపై మనం చేస్తున్న పోరాటంలో ఇప్పటికే ఎంతోమంది ఆరోగ్య కార్యకర్తలు సమిధలయ్యారని కేంద్ర మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. వెంటనే మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోండి అంటూ అల్టిమేటమ్ ఇచ్చారు. అల్లోపతి వైద్యంపై మీ వ్యాఖ్యలు కరోనా యోధులను అవమానించడమే కాదు.. ఆరోగ్య కార్యకర్తల మనోస్థయిర్యాన్ని దెబ్బతీయడమేనన్నారు మంత్రి. వివాదాస్పద మాటలతో దేశ ప్రజల మనోభావాలు కూడా దెబ్బ తీశారు.. కరోనా సంక్షోభంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శ్రమిస్తున్నారని, ఈ పోరాటాన్ని నీరుగార్చవద్దని మంత్రి అన్నారు.

తన వ్యాఖ్యాలపై అంతటా విమర్శలు రావడంతో రాందేవ్‌ బాబా మేలుకున్నారు. కేంద్ర మంత్రి లేఖతో దిగొచ్చారు. అల్లోపతి వైద్యంపై తాను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకొంటున్నానన్నారు. అన్నిరకాల వైద్యాలను తాను గౌరవిస్తానని.. ముఖ్యంగా అల్లోపతి ఎంతోమంది జీవితాలను కాపాడుతోందని ప్లేటు ఫిరాయించేసి లెంపలేసుకున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఉప్పెన హిట్ పాట వెనుక ఆసలు కథ ఇదే..?

అల్లు అర్జున్ జీవితాన్ని మార్చిన సుకుమార్.. !

ప్రభాస్ మాస్ స్టామినా చాటిన మిర్చి..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎల్లోమీడియా వాదనలో మరీ ఇంత డొల్లతనమా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : కార్పొరేటుకు ఆనందయ్యకు మద్య తేడా తెలిసిందా ?

ఆ కమర్షియల్ ఎలిమెంట్ ని మరచిన టాలీవుడ్... ?

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు, వెంకటేష్ ల కాంబోలోని సూపర్ హిట్ సినిమాలివే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>